Featuredప్రాంతీయ వార్తలు

స్థానబలమేదీ…!

మహిళలు అన్నింటిలో రారాణులు.. దేశ ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అంతరిక్షంలోకి సైతం అవలీలగా వెళుతున్నారు. అధికారులుగా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారు.. క్రీడల్లో రాటుదేలుతూ గర్వంగా నిలుస్తున్నారు.. అన్నింటిలో సగం కాదు.. ప్రపంచమే మా వెంట అంటూ వ్యాపార, వాణిజ్యరంగాల్లో వేగంగా దూసుకెళుతున్నారు… అన్నింటిలో ఆవిడ వెలకట్టలేని గుర్తింపు ఉంది… కాని రాజకీయరంగంలో ఆవిడెప్పుడూ వెనుకనే ఉంటుంది.. ఆవిడను ఎదిగినట్టు చేయందిస్తూ, మరో వైపు చేతిని లాగేస్తున్నారు… ఆవిడకు రాజకీయాల్లో నేటికి గుర్తింపు లేదు.. ఐనా తెలంగాణ రాష్ట్రంలో మగవారికి సమానంగా ఓటర్లుగా ఎదిగిపోయారు. నేటి రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో మహిళల ఓట్లే ప్రధానం కీలకంగా మారిపోనున్నాయి… గుర్తింపునివ్వని ఆమె ఎవరిపై ఓటు వేస్తుందో చూడాల్సిందే..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆవనిలో సగం… ఆకాశంలో సగం అని గొప్పలు చెపుతూ ఆమెను పట్టించుకొని నాయకులకు చెమటలు పట్టించే చేదు నిజాన్ని తట్టుకోలేక పోతున్నారు.. పురుషులకు దీటుగా వారికి సమానంగా మహిళలు ఓట్లు పెరిగిపోయాయి.ఒప్పుడు పురుషుల్లో యాభై శాతంగా ఉన్నా మహిళ ఓటర్లు నేడు తొంభై శాతం పెరిగింది. ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో వారి ఓట్లే గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉన్నారు. మహిళ అంటే వంటింటి కుందేలు అనుకున్న పార్టీలకు రోజురోజుకు పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల్లో వారిలో కూడా చైతన్య వెల్లివిరిస్తుంది. వారి ఆలోచన, వారి ఓటువినియోగం ఏటు వైపు వెళుతుందో అర్థం కాని పరిస్థితిగా మారిపోయింది. పురుషుల ఓటర్లను ఆట్టుకోవడానికి అనేక తాయిలాలు ఇస్తూ, మందు, విందులతో ప్రలోభ పరుస్తూ ఓట్లను రాబట్టుకునే పార్టీలు, మహిళలను ఆకర్షించడంలో వెనుకబడిపోతున్నారు. అవకాశాలే ఇవ్వని వారు వాగ్దానాలు ఏలా నేరవేర్చారంటూ మహిళల నోట ఎదురుదాడులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాలకు యువతకు, మహిళకు పెద్ద పీట వేస్తూ సరియైన ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన కల్పించిన స్థానమెంటో తెలంగాణ ప్రజలందరికి తెలిసిన విషయమే.. అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. గెలుపు గుర్రాలను, డబ్బును వెదజల్లే వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నాయి. కాని మహిళలను గుర్తించడంలో వారికి అవకాశం కల్పించడంలో మాత్రం పట్టింపులేనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 105 సీట్లు ప్రకటించినతెలంగాణ రాష్ట్ర సమితి అందులో ఇద్దరూ మహిళలకు అవకాశాలు లేకుండానే ఉన్న సీట్లను తీసేసింది. వరంగల్‌ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ, కరీంనగర్‌ జిల్లా బడిగే శోభ ఇద్దరికి అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ అభ్యర్థులైనా వారికి మాత్రం సీట్లు కేటాయించలేదు. ఇంకా సీట్టు కసరత్తులో ఉన్న పార్టీలు కూడా మహిళలకు పెద్దపీట వేయాలని ఆలోచనలో లేనట్లే తెలుస్తుంది. తెలంగాణలో మహిళల ఓట్లు భారీగా పెరుగుతున్న వారికి అవకాశాలు కల్పించడంలో అందరూ వెనుకబడిపోతున్నారు.

తెలంగాణలో భారీగా పెరిగిన మహిళల ఓట్లు..

ముందస్తు భాగంగా జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణలో మహిళల ఓట్లు భారీగా పెరిగాయి. 2018 ఎన్నికల కమిషన్‌ ప్రకారం తెలంగాణలో మొత్తం ఓట్లు 2,73,18,603 కాగా, అందులో పురుషులు 1,37,87,920 ఓట్లు, మహిళలు 1,35,28,020గా నమోదు అయ్యాయి. అంటే సుమారుగా పురుషులకు, మహిళలకు మధ్య ఓట్ల తేడా ఇరవైలక్షల తేడాలోనే ఉంది. పురుషుల కంటే మహిళలే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశంఉంది. రోజురోజుకు మహిళలు చదువుకుంటూ ముందుకు నడుస్తూ ఓటర్లుగా ఎక్కువ శాతం నమోదవుతున్నారు. కాని ప్రధాన రాజకీయపార్టీలు మాత్రం మహిళలను చట్టసభల్లో అడుగుపెట్టనీయకుండా ఆదిలోనే తొక్కివేస్తున్నారు. మహిళలను ఇప్పటికే ఓటుబ్యాంకుగానే గుర్తిస్తూ వారి అవకాశాలు లాక్కుంటున్నారు.

తెరాసలో మహిళలకు గుర్తింపే లేదు..

తెలంగాణలో అన్నిరంగాల్లో దూసుకెళ్తూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నామని చెపుతున్నా కెసిఆర్‌ మహిళల విషయంలో మాత్రం పట్టింపు లేనట్లుగానే ఉన్నాడని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడ్డాక కొద్దోగొప్పో అవకాశాలు కల్పించిన కెసిఆర్‌ అధికారంలోకి వచ్చాక మాత్రం తమ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదు. మహిళలకు గుర్తింపు నివ్వని పార్టీగా, ప్రభుత్వంగా కెసిఆర్‌ చరిత్ర సృష్టించాడనే చెప్పవచ్చు. ఇప్పుడు జరుగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌లో సీట్ల ప్రకటన దాదాపు జరిగిపోయింది. అన్ని సిట్టింగ్‌లకే ఇచ్చేశారు. అందులో కూడా ఇద్దరికి మహిళలను తప్పించాడు. మహిళల పరిస్థితి ఇంతేనా అని ప్రశ్నించినా పార్టీ అధిష్టానం నుంచి సరియైన సమాధానమే రావడం లేదు. తమ పార్టీ తమ ఇష్టమని తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుండడంతో తెరాసలో మహిళల నుండి తిరుగుబావుటా మొదలైందనే చెప్పవచ్చు..

రాజకీయాల్లో అమెకు అవమానమే…

ఎన్నికల ముందు మాత్రమే రాజకీయ నాయకులకు మహిళలు గుర్తుకువస్తారు. రిజర్వేషన్‌ ప్రకారం వారికి సరియైనఅవకాశం కల్పిస్తామని చెపుతారు. తీరా అవకాశం వచ్చేసరికి అన్ని పార్టీలు మహిళలకు మొండిచేయి చూపుతున్నారు. విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు దేశ ప్రతిష్టను సైతం ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నా సొంత రాష్ట్రంలో అవకాశాలు లేక వెనుకబడిపోతున్నారని చెప్పవచ్చు. మహిళలను ఇప్పటికి ముందుకు రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. రాజకీయాల్లో ఎందుకు అంటూ వెనక్కి నెట్టేవారే ఎక్కువవుతున్నారని మహిళలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అన్నింట్లో సగం అంటూనే చిన్న చూపేంటి అని ప్రశ్నిస్తున్నారు. తమకు శాసనసభల్లో, స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకునే వారే ఎక్కువమంది ఉన్నారు.

కాని రాజకీయాలపై ఆసక్తి ఉన్న మహిళలు ఇప్పటికే వారి ప్రయత్నాలు ఆపడమే లేదు. అవకాశాల కోసం వారు ప్రయత్నాలు చేస్తున్న ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడమే లేదు. తమ పేరును పరిశీలించాలంటూ మహిళ నేతుల అన్ని పార్టీల వారీగా వినతులు చేస్తూనే ఉన్నారంట. కాని వారి వినతులను అన్ని రాజకీయ పార్టీల అధిష్టానం పెడచెవిన పెడుతుండటంతో చాలామంది నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో ఆసక్తి కనబరిచిన పార్టీలపై జరగబోయే ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అరటున్నారు. –

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close