మారుతీరావు కాల్‌ లిస్ట్‌ ఎక్కడ..?

0

ప్రణయ్‌ హత్యకేసులో చార్జిషీటు దాఖలు

? టెలిఫోన్‌ సంభాషణల వివరాలు ఎక్కడ..?

? తూతూమంత్రంగా ‘దళితహత్య’ కేసు..

(ఖాకీ రంగు మరుతోందా..? ఆదాబ్‌ హైదరాబాద్‌ విశ్లేషణ కథనం -2)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఈదేశంలో దళితుల ప్రాణాలకు విలువ ఉందా..? ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయా..? ఎట్టకేలకు అసలు తెర వెనుక దొంగలు దొరల్లా మారారు. ఇకనైనా దళితులు, ఆ,యా సంఘాలు మాట్లాడకపోతే… నిలదీయకపోతే… ప్రణీత్‌ ఆత్మకు దండలు వేసే అర్హత కోల్పోతారు.

చార్జిషీటు లో…:

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో మిర్యాలగూడ పోలీసులు జిల్లా కోర్టులో బుధవారం చార్జిషీటు దాఖలు చేశారు. మొత్తం 102 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు 1600 పేజీలతో చార్జిషీటు, 63 పేజీల్లో విచారణ నివేదిక కోర్టుకు సమర్పించారు. తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో ప్రణయ్ను అమృత తండ్రి తిరునగరు మారుతీరావు దారుణంగా హత్యచేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఏం జరిగింది:

ఈ ఘటన గతేడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడ పట్టణంలో పట్టపగలే జరిగింది. ప్రణయ్‌ హత్యకేసులో అరెస్టయిన నిందితులు మారుతీరావు, అతని తమ్ముడు శ్రావణ్‌, మరొక నిందితుడు కరీంపై గతేడాది సెప్టెంబర్‌ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించగా…ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఈ ముగ్గురితోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా పోలీసులు చార్జిషీటులో చేర్చారు. హత్యజరిగిన 9 నెలల అనంతరం చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం.

టెలిఫోన్‌ జాబితా…?:

ప్రణీత్‌ హత్యకు, మారుతీరావు అరెస్టుకు మధ్య హైడ్రామా నడితింది. ఇందులో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అయితే మారుతీరావుకు సబంధించిన టెలిఫోన్‌ కాల్‌ లిస్ట్‌ ఎక్కడుంది. హత్యకు ఎనిమిది నెలల ముందు నుంచి ఆయన కాల్‌ లీస్ట్‌ పోలీసులు ఈ చార్జిషీటులో ప్రస్థావించలేదు. హత్యకు కొద్ది గంటల ముందు కూడా ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులుతో మాట్లాడిన విషయాలు సవివరంగా పోలీసులు వివరించలేకపోయారు. ఇందులో ప్రధానంగా మారుతీరావు ఏవిధంగా హత్యకు డబ్బు సమకూర్చుకున్నాడు..?

ఎవరి ద్వారా..? ఎంత పంపకాలు చేశాడు..?

ప్రణిత్‌ హత్యకు ఎంత మొత్తం చెల్లించాడనే క్లారిటీ పూర్తిస్థాయిలో లేదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరి ద్వారా. ? ఎంత వచ్చింది..? లావాదేవీలు ఎలా జరిగాయి.? ఈ హత్య కేసులో ఒక్క పైసా పోలీసులు తీసుకున్నట్లు లేదు. అంటే…అందుకే సెల్‌ సంభాషణల విషయం అత్యంత రహస్యంగా మరుగునపడిపోయింది. ఆ జాబితా బహిరంగ పరిస్తే అసలు బండారం బట్టబయలు ఆవుతోంది. ఇది లేదంటే… అంటే దొరలు సేఫ్‌..

దళిత సంఘాలు, ఆ నాయకులు చార్జిషీట్‌ చదవండి.. లోతుగా ఆలోచన చేయండి… అంతా బోధపడుతోంది.

కొసమెరుపు:

ఓ ప్రభుత్వ ఉద్యోగి వచ్చిన కొద్ది రోజులకే ప్రణీత హత్య జరిగింది. ఈ కేసులో బాగా బాగా నొక్కాడనే ఆరోపణలు వినవచ్చాయి. ఏది ఏమైనా…. అందరూ మంచోళ్ళే… పోయినోళ్ళు ఉన్నోళ్ళకు తీపిగుర్తులు.

న్యాయం ఎలా..?:

స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదనో తెలుస్తోంది. అయితే ఈ కేసును త్వరితగతిన సిబిఐ కి వెళితే… ఆర్థిక కోణాలు బయటపడతాయి. వెయిట్‌ చేద్దాం… ఏం జరుగుతోంది తచిచూద.జవారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here