హైదరాబాద్‌ను వదిలెయ్‌.. కరెంట్‌ను ఎక్కడ పెట్టావ్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ‘హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాను, అక్కడ పెట్టాను అంటాడు. హైదరాబాద్‌ను ఎక్కడ పెట్టాడో కానీ.. మరి కరెంట్‌ ఎక్కడ పెట్టాడు’ అని చంద్రబాబును విమర్శించారు. సోమవారంనాడు కామారెడ్డి, నిజామాబాద్‌, బోధన్‌, బాల్కొండ, జగిత్యాల, కరీంనగర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పరకాల, వరంగల్‌ ప్రజా ఆశీర్వాద సభలలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమిల మధ్యేనని తెలంగాణ ఆపద ్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలు ఒక్కటే గుర్తుంచుకోవాలని ప్రజాకూటమి, టీఆర్‌ఎస్‌ పార్టీలే పోటీలో ఉన్నాయని మిగి లిన పార్టీలు లెక్కల్లో లేవన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కూటమి 58ఏళ్లు పరిపాలించిందని ఏనాడైనా ప్రజల సంక్షేమం కోసం పాటు పడిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హ యాంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమా ర్‌ రెడ్డి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఎందు కంటూ ఎగతాళి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే అంధకారమేనని అంతా చెమ్మ చీకటేనని చెప్పాడని కానీ నేడు ఒక్క నిమిషం కూడా కరెంట్‌ పోకుండా విద్యుత్‌ అందిస్తున్నామని గుర్తు చేశారు. చంద్రబాబు పీడ మళ్లీ తెలంగాణకు అవసరమా అంటూ నిలదీశారు.

నేనూ రైతునే. నాకు 60ఎకరాల పొలం ఉంది. ఆరునూరైనా సరే భవిష్యత్తులో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతా. ఇవాళ రైతు భీమా కింద గుంట భూమి ఉన్న రైతులు చనిపోయినా రూ.5లక్షల భీమా అందిస్తున్నాం. గీత కార్మికుల బాధను గత పాలకులు పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెట్లపై పన్నును రద్దు చేసింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు తీసుకొస్తానని సీఎం తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్లు రానివ్వనని అమిత్‌ షా చెబుతున్నారని… ఎందుకు రాదో తాను చూస్తానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ గెలుస్తారని.. టీఆర్‌ఎస్‌కు 15 ఎంపీలను అందిస్తే ఇద్దరం కలిసి కేంద్రంతో పోరాడి ముస్లిం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ వస్తే జనరేటర్లు కొనుక్కోవాల్సిందే

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయని మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కీసీఆర్‌ ఎద్దేవాచేశారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే దాన్ని రెట్టింపుచేస్తాం. ఇతర సామాజిక పింఛన్లు కూడా రెట్టింపు చేస్తాం అన్నారు. ”ఎన్నికలు వస్తుంటాయి.. పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. అన్ని పార్టీల వారు మంచీ చెడ్డా చెబుతారు. అన్నీ సావధానంగా వినాలి. మీ బిడ్డగా చెబుతున్నా. అందరూ చెప్పినవి విని ఇంటికి వెళ్లాక కూర్చొని వారు చెప్పిన అంశాలపై చర్చ చేయాలి. రాజకీయాల్లో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు. ప్రజలు గెలవాలి. ప్రజల గెలుపే ప్రజాస్వామ్యానికి పరిపక్వ దశ. ప్రజలు కోరుకున్న పార్టీ గెలిస్తే ఐదేళ్ల పాటు వారి ఆకాంక్షల మేరకు పని జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగాను. తెరాస ప్రభంజనమే వస్తోంది. అధికారంలోకి వస్తే భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తాం. బాల్కొండకు ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం” అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ”ఎన్నికలు వస్తుంటాయి.. పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. అన్ని పార్టీల వారు మంచీ చెడ్డా చెబుతారు. అన్నీ సావధానంగా వినాలి.

మీ బిడ్డగా చెబుతున్నా. అందరూ చెప్పినవి విని ఇంటికి వెళ్లాక కూర్చొని వారు చెప్పిన అంశాలపై చర్చ చేయాలి. రాజకీయాల్లో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు. ప్రజలు గెలవాలి. ప్రజల గెలుపే ప్రజాస్వామ్యానికి పరిపక్వ దశ. ప్రజలు కోరుకున్న పార్టీ గెలిస్తే ఐదేళ్ల పాటు వారి ఆకాంక్షల మేరకు పని జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగాను. తెరాస ప్రభంజనమే వస్తోంది. అధికారంలోకి వస్తే భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తాం. బాల్కొండకు ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం” అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here