రాహుల్‌ ఏ రకంగా బ్రాహ్ముడయ్యాడు

0

తల్లిదండ్రులకు లేని బ్రాహ్మణత్యం ఆయనకెక్కడిది

కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు : కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ సంకర జాతి సంతానం అన్నారు. ముస్లిం తండ్రి, కైస్త్రవ తల్లికి రాహుల్‌ జన్మించాడని విమర్శించారు. బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటున్న రాహుల్‌.. తగిన ఆధారాలు ఇస్తాడా అని ఆయన ప్రశ్నించారు. కర్నాటకలోని సిర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ దాడులకు ఆధారాలు కావాలని కాంగ్రెస్‌ నేతలు అడుగుతున్నారని, ప్రపంచం అంతా అంగీకరించినా వాళ్లు మాత్రం ఆధారాల కోసం వెతుకుతున్నారని, రాహుల్‌ ఓ ముస్లిం వ్యక్తి అని, కానీ జంజం వేసుకున్న బ్రాహ్మణుడిని అంటూ చెప్పుకుంటున్నాడని అనంత్‌ విమర్శించారు. రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ. రాజీవ్‌ తల్లి ఇందిరా.. గుజరాత్‌కు చెందిన పార్సీ వ్యక్తి ఫిరోజ్‌ గాంధీని పెళ్లాడారు. గత ఏడాది నవంబర్‌లో రాజస్థాన్‌లో ఆలయానికి వెళ్లిన రాహుల్‌ అక్కడ తన గోత్రం పేరు చెప్పారు. కౌల్‌ బ్రహ్మణ వంశస్తుల మన్నాడు. బాలాకోట్‌ దాడిపై రాహుల్‌ ఆధారాలు అడగడాన్ని మంత్రి తప్పుపట్టారు. రాజీవ్‌ చనిపోయినప్పుడు డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ పరిశీలన కోసం నమోనాలు సేకరించామని, అప్పుడు సోనియా .. తన కూతురు ప్రియాంకా శ్యాంపిల్స్‌ తీసుకోవాలని కోరిందని మంత్రి గుర్తు చేశారు. రాహుల్‌ డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ను వద్దని సోనియా చెప్పినట్లు మంత్రి తెలిపారు. రాహుల్‌కు ఈ దేశం గురించి తెలియదని, మతం గురించి కూడా అతనికి తెలియదని, తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్‌, కొడుకు బ్రహ్మణుడని మంత్రి విమర్శించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిగిన వైమానిక దాడులపై ఆధారాలడుగుతున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై హెగ్డే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తనను తాను జంధ్యం ధరించిన వ్యక్తిగా చెప్పుకునే రాహుల్‌కు హిందూ అని చెప్పే ఆధారాలివ్వాలని హెగ్డే డిమాండ్‌ చేశారు. /ూహుల్‌ నాన్నమ్మ ఇందిరా నెహ్రూ 1942 మార్చిలో ఫెరోజ్‌ జహంగీర్‌ను వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో మహాత్మా గాంధీ ఫెరోజ్‌ జహంగీర్‌ను దత్తత తీసుకున్నారు. దీంతో నాటి నుంచి నెహ్రూ ఇంటిపేరు గాంధీ ఇంటిపేరుగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here