Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఇంకెప్పుడు మారునో కమలం..

ఎమ్మెల్యెపై దాడి చేసిన స్పందనేది..

కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా ఇక్కడ శూన్యం..

ఇలాగైతే తెలంగాణలో ఉనికికే ప్రమాదం..

తెలంగాణలో పాగా వేయాలి.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి.. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకొవడమే మన ప్రధాన కర్తవ్యమని బిజెపి కేంద్ర నాయత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు.. రాష్ట్రంలో ఉన్న క్యాడర్‌ను అంతా ఉత్సాహపరిచేందుకు సిద్దమవుతున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాషాయం జెండా ఎగరేసినా బిజెపి పార్టీకి రాష్ట్రంపై ఆసక్తి పెరిగింది. పరిమితంగానే తెలంగాణపై దృష్టి సారిస్తే నాలుగు సీట్లు గెలిచాయని, అదే సీరియస్‌గా వ్యూహాలు పన్నుతూ ముందడుగు వేస్తే పట్టు సాధించడం అంత కష్టమేమి లేదని ఒక అంచనాకు వచ్చింది. అందుకే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పటడుగులు అనుగుణంగా మలుచుకుంటే ప్రజల్లో దూసుకువెళ్లాలని జాతీయ నాయకత్వం చెపుతూనే ఉంది. తెలంగాణలో పార్టీని పటిష్టంగా మార్చడానికి వారి జాతీయ పార్టీ ఆదేశాలను పాటిస్తుందో, లేదో తెలియదు కాని స్వంత పార్టీ ఎమ్మెల్యెపై పోలీసులు దాడిచేస్తే కనీస ఆందోళనలు కూడా చేయలేని స్థితిలో ఉన్న బిజెపి ఇంకెలా ఉనికిని చాటుతుందో, ఇంకెలా ప్రజల్లో పాతుకుపోతుందో అర్థమే కావడం లేదు. నలుగురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ఉండి కూడా ఎమ్మెల్యెపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే భరోసా ఇవ్వకుంటే తెలంగాణలో ఇంక సామాన్యుడి పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు ప్రజల్లో వస్తున్న ఆలోచనలు, అనుమానాలు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. చాపకింద నీరులా అన్నిరాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తూ అధికారంలోకి వస్తున్న బిజెపి ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అతిరథమహరథులు, తలపండిన నాయకులున్నా బిజెపిలో భద్రత నేడు కరువవుతోందని తెలుస్తుంది. కరీంనగర్‌ జిల్లాలో స్థానిక సంస్థల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిపై బిజెపి అభ్యర్థి గెలిచాడని అక్కడికక్కడే టిఆర్‌ఎస్‌ నాయకులు గెలుపొందిన బిజెపి అభ్యర్థిని హత్యచేశారు. నాలుగు రోజులు హడావుడీ చేసిన రాష్ట్ర బిజెపి నాయకత్వం ఆ హత్యపై ఏం చేసిందో మాత్రం తెలియదు. మరో చోటు బిజెపి కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఐనా కఠినమైన చర్యలు లేవు. మొన్నటికి మొన్న రాష్ట్రరాజధాని హైదరాబాద్‌ నగరంలో గోషామహల్‌ ఎమ్మెల్యె రాజాసింగ్‌పై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యె రాజాసింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక బిజెపి వర్గాల సమాచారం ప్రకారం గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జుమ్మెరాత్‌ బజార్‌లో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అక్కడ రాణీ అవంతిబాయ్‌ లోధ్‌ విగ్రహన్ని 2009లో ఏర్పాటు చేశారు. రెండు మూడు సార్లు చిన్నచిన్న మరమ్మత్తులు ఉంటే మార్చారు. ఈ సారి కూడా మరమ్మత్తులకోసం మార్చాలని ప్రయత్నం చేశారు. కాని పోలీసులు అంగీకరించలేదు. అంతలోనే అక్కడికి స్థాని ఎమ్మెల్యె రాజాసింగ్‌ వచ్చేసరికి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తును బలగాలను మోహరించారు. ఆ ఉద్రిక్తతలో ఎమ్మెల్యె రాజాసింగ్‌కు తలకు గాయమైంది. కావాలనే గోషామహల్‌ ఎసిపి, ఇద్దరు ఎస్సైలు తనపై దాడిచేశారని రాజాసింగ్‌ ఆరోపిస్తున్నారు. గాయపడిన రాజాసింగ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. నిజానికి ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో ఎవరూ వెల్లడించలేదు. ఒక వేళ రాజాసింగ్‌ ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టిస్తే అతనిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించాలి కాని ఒక స్థానిక ఎమ్మెల్యెపై దాడి చేయడం ఎంత వరకు కరెక్టో అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. తెలంగాణలో ఒక ఎమ్మెల్యె మీదనే విచక్షణారహితంగా దాడి చేసినప్పుడు ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదని ప్రముఖులు అంటున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నా భద్రత సున్నా..

జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న బిజెపి రెండవసారి కూడా కేంద్రంలో అత్యధిక స్థానాల్లో అధికారంలోకి వచ్చింది. బిజెపి చేసిన పనులవల్లే మళ్లీ అధికారంలోకి వచ్చామని చెపుతున్నా నాయకత్వం పార్టీ క్యాడర్‌ను మాత్రం కాపాడుకోలేక పోతుంది. తెలంగాణలో బిజెపి పాతుకుపోవాలని ప్రణాళికలు సిద్దం చేస్తుందీ కాని పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం భద్రత కల్పించలేకపోతుందని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యెపై దాడి జరిగినప్పుడు ఖండించకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయకుండా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకొకుండా ఉన్నారంటే ఇంక పార్టీని తెలంగాణలో వీరు ఏలా బతికించుకుంటారు, టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఏలా ఎదుగుతారనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. టిఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్‌ రోజరోజుకు బలహీనంగా మారుతోంది. అక్కడ ఖాళీఅవుతున్న స్థానాన్ని బిజెపినే పూడ్చాలని, యువత, మహిళల రంగాన్ని అంతా పార్టీ వైపు తిప్పుకోవాలని కేంద్ర నాయకత్వం దృష్టి సారిస్తుంది. కాని రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో ఉన్న నాయకులకు, కిందిస్థాయి కార్యకర్తలకు ఎంతవరకు భరోసా ఇస్తుందనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు.

బిజెపిలోకి మారినా భద్రత సున్నానే…

తెలంగాణలో బిజెపిలో చేరేందుకు అన్ని పార్టీల నాయకులతో పాటు ఇతర ప్రజాసంఘాలు వారు సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే పెద్ద ఎత్తున చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.కాని ఇప్పటికి బిజెపిలో ఉన్న వారికే సరియైన భద్రత లేదని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గెలిచినా ఏకైక బిజెపి గోషామహల్‌ ఎమ్మెల్యెపై దాడి జరిగి రెండు రోజులవుతున్నా ఇటు కేంద్ర నాయకత్వం కాని, అటు రాష్ట్ర నాయకత్వం కాని స్పందించనే లేదు. వారి పార్టీలో వారికే న్యాయం చేయలేని నాయకత్వం కొత్తవారికి ఏలా రక్షిస్తుందనేదే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలని పార్టీ కేంద్ర అధిష్టానం చెపుతుంటే రా

ష్ట్ర నాయకత్వం మాత్రం తప్పులు జరుగుతున్నా, వాటిని ఉద్యమంగా మార్చుకోలేకపోతుంది. ఇలా ఎవరికి వారే యమునా తీరుగా ఉంటే పార్టీ తెలంగాణలో బలపడడం మాత్రం కష్టంగానే కనిపిస్తోంది..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close