FeaturedUncategorizedబిజినెస్

ఈనాటి ఈబంధం ఏనాటిది..?

? రిలయన్స్‌ డైరెక్టర్‌ గా చౌదరీ

? నాటి మేలుకు నేడు లాభం

? నైతిక విలువలకు నిలువునా పాతర

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ప్రభుత్వంలో కీలకస్థానంలో పనిచేసి, ఎడాపెడా కొందరికి మేళ్లు చేసిపెట్టి, రిటైర్‌ కాగానే ఆయా కంపెనీల్లో ఒదిగిపోవడం చాలారోజులుగా ఉన్న ట్రెండ్‌. కానీ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ బాసుగా చేసిన వ్యక్తి దేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంలో స్వతంత్ర డైరెక్టర్గా చేరాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? దాని వెనుక దాగిన అసలు నిజాలు ఏమిటి.? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించి… కొన్ని కంపెనీలకు కోట్లు దోచిపెడతారు. వారే విచారణ అధికారులు. నివేదిక కొండెక్కుతుంది. రిటైర్మెంట్‌ తరువాత పక్కాగా లక్షాలాది రూపాయల నెలసరి జీతం కోసం అదే కంపెనీలో ఏదో ఒక ¬దా పొందుతారు. అందుకు తాజా ఉదాహరణ…

గతంలో ప్రత్యక్ష పన్నుల బోర్డుకు బాసుగా కూడా పనిచేసిన ఆయన పలుకుబడి అంతా ఇంతా కాదు. రెవిన్యూ శాఖకు (ఆదాయ సంబంధ అంశాల్లో?) సలహాదారుగా?! పన్నులు, ఆదాయ సంబంధ దర్యాప్తు విభాగాల్లో తన శిష్యులే అధికులు. తన ప్రభావమూ ఎక్కువే. తనపై గతంలో పెద్దగా అక్రమాల ఆరోపణలు ఏవిూ వచ్చింది లేదు. ఒకప్పుడు విజిలెన్స్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇప్పుడు భారతదేశ అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీ బోర్డులోని డైరెక్టర్‌! ఆయనే ది గ్రేట్‌ కెవి చౌదరి.

చౌదరి రిలయన్స్‌ డైరెక్టర్‌ ఎందుకయ్యారు?:

అవినీతి నిరోదక శాఖ మాజీ అధికారి. ప్రభుత్వంలో పన్నుల శాఖకు మొట్టమొదటి అధికారిగా పనిచేసిన చౌదరికి రిలయన్స్‌ లో ఈ కంపెనీల లో బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వంలో అవినీతి నిరోదక అధికారులుగా, కీలక అధికారులుగా ఉండి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం, వారి పదవీ విరమణ తరువాత కీలక బాధ్యతలు అప్పగిం చడం ఇటీవల కాలంలో పెరిగిపోయిందనే విమర్శలున్నాయి. రిలయన్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో చౌదరిని అడిషనల్‌ డైరెక్టర్‌ (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌)గా నియమించినట్లు రిలయన్స్‌ సంస్థ తెలిపింది.

ఇదీ ప్రస్థానం:

1978 బ్యాచ్కు చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి అయిన చౌదరి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) చైర్మన్గా 2014లో నియమితులయ్యారు. 2015లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సివిసి) కమిషనర్గా పనిచేశారు. చౌదరి పదవీ విరమణ పొందిన తరువాత నల్లధనానికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖకు సలహాదారుగా నియమితులయ్యారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close