Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఏది నీతి జరుగుతుందంతా అవినీతే

కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలని పరిష్కరించాల్సిన వివిధ పార్టీలకు చెందిన కార్మిక సంగాలు యాజమాన్యాల చేతుల్లో కీలు బొమ్మల్లా మారడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందు బిళ్లల కోసం బిక్క మొహం వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీస్‌ డెరెక్టరేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల మందుల కొనుగోలు కుంభకోణంలో జరిగిన అవినీతిని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌నివేదికలో బట్టబయలు చేసినా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు గానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిక్షణం కార్మికుల పక్షాన నిలబడి వారి బాగోగుల కోసం పోరాటం చేసే కార్మిక సంఘాలు సైతం ప్రేక్షక పాత్ర వహించడం పట్ల కార్మిక లోకంలో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోపక్క విజిలెన్స్‌ నివేదికపై తగు విచారణ కోసం ప్రభుత్వం నియమించిన విచారణ కమీషన్‌ చైర్మెన్‌ ఉత్తర్వులు అందుకున్న నెల రోజులకే ఆయన పదవీ కాలం ముగియడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. మరోప్రక్క సుమారు 466కోట్ల మందుల కొనుగోలులో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్లే తాము రోగులకు మందులు అందజేయగలిగామని మానవత్వంతో చేసిన ఈపనికి తమకు ఎటువంటి శిక్ష విధించినా సమ్మతమేనని ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి ప్రతినిధిగా కార్యాలయం సూపరింటెండెంట్‌ వీరన్న ఒప్పుకోవడం గమనార్హం. ప్రస్తుతం తాము నిబంధనలని అనుసరించడం వల్లే కార్మికులకు కావాల్సిన మందులని సరఫరా చేయలేక పోతున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే కార్మికులకు అవసరమైన వందల కొనుగోళ్లు అడ్డంకులుగా మారిన నిబంధనల గూర్చి వాటిని తొలగించాల్సిన అవసరం గూర్చి డైరెక్టర్‌ దేవికారాణి తగు సూచనలని ప్రభుత్వానికి అందజేయకపోవడంతో అత్యవసర సమయాల్లో వేసుకోవాల్సిన మందులు లేక కార్మికులు తమ ప్రాణాలని అరచేతిలో పట్టుకుని ఇంకెంత కాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనలో తాము అనాధలుగా మారామని లక్షలాది మంది కార్మికులు మందుల కోసం విలపిస్తున్న తమ సమస్యని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రికి తీరిక లేకపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తపరిచారు. నిబంధనలని అడ్డుపెట్టుకుని తప్పు చేశారని ఒప్పుకున్నా తగు చర్యలు తీసుకోవడంలో ఆయన మీన మేషాలు లెక్కించడం తీవ్రమైన విషయమని ఇకనైనా తెలంగాణలో బంగారు పాలన, పారదర్శకతే తమ పరిపాలన ప్రత్యేకతని చాటింపు వేసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులని చిన్నచూపు చూడటం తగదని వారు పేర్కొన్నారు. ఈసంవత్సరం ఫిబ్రవరిలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, కార్మికశాఖ ముఖ్యకార్యదర్శికి నివేదిక సమర్పించి ఎనిమిది నెలలు కావస్తున్నా దోషులని గుర్తించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం కార్మికుల పాలిట శాపంగా మారిందని వారు వాపోయారు. ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక కార్మికుల పక్షాన నిలబడి వరుస కథనాలతో ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసు కార్యాలయంలో జరిగిన మందుల కొనుగోలు కుంభకోణాన్ని ప్రజలు కార్మికులు ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు తన వంతు భాద్యతలని కానసాగిస్తుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close