ప్రాంతీయ వార్తలు

ఆరేళ్లుగా మున్సిపాలిటీలకు చేసిందేమిటీ?

టిఆర్‌ఎస్‌కు ఓటమితో గుణపాఠం చెప్పాలి

టిఆర్‌ఎస్‌కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే

విూడియాతో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

హైదరాబాద్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వీరిద్దరి మధ్యా లోపాయకారి ఒప్పందంఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓటర్‌ లిస్ట్‌, రిజర్వేషన్‌ ప్రకటించకుండా షెడ్యూల్‌ విడుదల చేశారని ఆరోపించారు. మా అభ్యంతరాలను ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కుట్రలు ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారని తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలకు ఆరేళ్ల పాలనలో కేసీఆర్‌, కేటీఆర్‌ చేసింది ఏవిూ లేదన్నారు. టీఆర్‌ఎస్‌ డబ్బుల ప్రవాహంతో గెలిచే ప్రయత్నం చేస్తోందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఏం ఉద్ధరించారని ఓటు అడుగబోతున్నారని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు?, ఎవరికైనా ఇచ్చారా?, ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదన్నారు. రెండో పంటకు రైతుబంధు ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఓటమితో షాక్‌ ఇవ్వాలన్నారు. నోట్ల రద్దు, ట్రిపుల్‌ తలక్‌, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్న సంగతి మైనార్టీ సోదరులు ఆలోచించాలన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఏం చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఓట్లు అడగ బోతున్నారని ప్రశించారు.. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఏ ఒక్కరికైనా ఇచ్చిందా అని నిలదీశారు. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదని.. రెండో పంటకు రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఝలక్‌ ఇవ్వాలని ప్రజలను పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ తీర్మానం చేయకున్నా.. మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై మైనార్టీ సోదరులు ఆలోచించాలని కోరారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close