టాస్‌ గెలిస్తే ధోనీ ఏం చేస్తాడు?

0

చెన్నై : ఐపీఎల్‌ 12వ సీజన్‌ తుది దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సాయంత్రం 5గంటలైతే టీవీల ముందుకు చేరిపోతున్నారు. ఈ ఐపీఎల్‌ ఫీవర్‌ ఇప్పుడు విద్యా సంస్థలకూ పాకింది. ఎంతగానంటే ప్రముఖ ఐఐటీ ప్రశ్నాపత్రంలో ఐపీఎల్‌ గురించి ప్రశ్నలు వచ్చేంతా. దేశంలో పేరెన్నికగల ఐఐటీ మద్రాస్‌.. చెన్నై జట్టు కెప్టెన్‌ అయిన ధోనికి టాస్‌ విషయంలో సహాయం చేయాలని భావించింది. ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని టాస్‌ గెలిస్తే ఎం చేస్తాడు? అనే ప్రశ్నను ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ విగ్నేష్‌ ముత్తు విజయన్‌ తన విద్యార్థులకు సంధించాడు. ఈ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు అంటే మే 6న జరిగిన ‘మెటీరియల్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌’ పరీక్షలో ఈ ప్రశ్నను పొందుపరిచాడు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఐసీసీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి కూడా ఇది షేర్‌ అయింది. చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో మూడు సార్లు టాస్‌ గెలిచిన ధోని ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అయితే నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో మాత్రం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ సేన ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై ఓడిపోయింది. అయితే ఫైనల్‌ చేరడానికి చెన్నైకి మరో అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here