Featured

ఎల్‌.బి.నగర్‌ కేసులో ఏముంది.? ఈ బామ్మర్ది ఎవరబ్బా..?

ఆ ఎమ్మెల్యే ఎవరు..?

సబ్‌ రిజిస్ట్రార్‌ నిందితుడే

సిబిఐ దర్యాప్తు చేయాల్సిన కేసు..

ఇక్కడే తొక్కిన వైనం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఓ కేసు పార్టీ నుంచి ‘జంప్‌’ చేయిస్తోంది. సరిగ్గా ఇదే జరిగింది. పార్టీ మారడానికి ఎంత నాటకం నడిపారు. నడుపుతూ ఉన్నారు. ఆ కేసు ముందుకు కదలకుండా ఎంత బాగా ‘మేనేజ్‌’ చేస్తున్నారు. ఆ కేసు విలువ జస్ట్‌ రూ. 40 కోట్లు. ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ విషయ పరిశోధనలో.. ఏడుగురితో కూడిన ‘ఆదాబ్‌’ బృందం ముందుకు సాగుతున్న తరుణంలో.. ఈగ్భ్భ్రాంతి కరమైన ఊహించని కథనం ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఆలోచనలకు సరదాగా..చూడ చక్కగా.. చిక్కింది. ఇందులో ఉన్న పెద్ద చేపలు ఎన్ని..? ‘తిమింగలాలు’ ఎవరు..? ‘బినామీలు’ ఎవరు..? వాళ్ళ చీకటి జీవితం ఏమిటి..? మనలో మనకు ముసుగులో గుద్దులాట ఎందుకు..? వాళ్ళు ఎవరో చెపితే పోలా..? మాకు భేషజాలు ల్లేవ్‌. ఉండవ్‌. ఉండాల్సిన పనీ లేదు. ‘అక్కర్ల’ అవసరం లేదు. ‘లోఫర్‌’ల ఆఫర్‌ లకు అసలు తావే లేదు. ఉండదు. ఉండబోదు. ‘సోషల్‌ మీడియా బ్రోకర్లు.. సుపారీ సోంబేరి కబర్లు’ మీం చెప్పం. ఈ కథనాలు చదివి తెలుసుకోండి. అసలు దొంగలు ఎవరో..? ఏ బ్యాంక్‌ లోను లోసుగైని.. అది సిబిఐకి చేరాలి. మరి ఇన్నేళ్ళుగా ఇక్కడే ఎందుకు మూలుగుతుంది.

అసలేం జరిగింది..: ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, నమ్మకం, బ్రైయిన్‌ వాష్‌.. మిళతంగా.. సామాన్యులే

లక్ష్యంగా సంస్థల ముసుగులో ఏకంగా రూ. 40 కోట్లు కుమ్మేశారు. ఆమేరకు చైతన్యపురి పోలీస్టేషన్‌ లో నలుగురు వ్యక్తులపై క్రైం కేసు జూన్‌ 9, 2017న కేసు ఐఓ వేణుగోపాల్‌ నేతృత్వంలో నమోదైంది. ఇందులో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ పాత్ర ఉండటం గమనార్హం. (ఆయన ఏవరు..? ఏమిటో..? రేపటి కథనంలో చెప్పుకుందాం).

ఫోర్జరీ డాక్యుమెంట్లు: రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు నెం. 132/ 2013ను ఉదహరిస్తూ..ఫోర్జరీ చేసిన డాక్యుమెంటు ద్వారా మహేశ్వరంలో 2015లో డాక్యుమెంటు నెం. 4064/ 2015 రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఇదే అదనుగా కంపెనీ పేరుతో లంకెలతో కూడిన లింకు డాక్యుమెంట్లు సృష్టించి అనేక అకౌంట్ల ద్వారా సుమారు రూ. 40 కోట్లు చూస్తుండగా కాజేశారు.

దొంగలను ఇలా ‘దొరలు’ చేద్దామని..?: ఇందులో ఉన్న అసలు దొంగలు బడాబాబులే. ఎవడికీ నీతి, నిజాయితీ.. ఆలహవకాయ బద్ద అలాంటివేం లేం. ఉండవ్‌. ఉంటే ఇలా దిగాజారి దేశం మీద పడి దా’రుణాలు’ చేయరు. అయితే ఇందులో అసలు దొంగలు బయటపడటం కోసం క్రైం నెం. 312/2015, సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ లో 738/2015, చైతన్యపురి పి.ఎస్‌.లో క్రైం. నెం.271/ 2015, ఎవహల్‌.బి.నగర్‌ లో621/2017 ( ఇటీవల ఓ మానవ హక్కుల సంఘంపై కూడా దర్యాప్తు ఇదే సంస్థ చేస్తుంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం) ఇలా నాలుగు కేసులు.. గందరగోళం చేసి సామాన్య ప్రజలను ఉద్దేశ్య పూర్వకంగా తప్పుదారి పట్టిస్తున్నారు. అయితే ఈకేసులన్నీ బ్యాంక్‌ లావాదేవీలతో ముడిపడి ఉండటంతో.. ఈ కేసులన్నీ వెళ్ళాల్సింది. సిబిఐ చెంతకు. అసలు ఈ కేసులో ఏదీ ముందుకు సాగకపోవడం మరో కుట్ర కోణం.

22 అకౌంట్లు..: ఈ రూ. 40 కోట్లను ఏ అకౌంట్‌ నుంచి ఎవరు కాజేశారు. అకౌంట్లలలో పడిన డబ్బు ఏ బ్యాంక్‌ డెబిట్‌ కార్డు నెంబర్లతో సహా రేపు చెప్పుకుందాం. అలాగే మియాపూర్‌ భూ కుంభకోణానికి.. దీనికి.. ఆదాయపన్ను శాఖకు.. ఈ దొంగలకు లింకు ఏమిటో తర్వాత కథనాలలో చూద్దాం.

ఆ బామ్మర్ది ఎవరు..?: క్రైం నెంబర్లు ఇచ్చాం. పోలీస్టేషన్‌ పేరు చెప్పొం. మరి ఆ బామ్మర్ది పేరు చెప్పటం లేదంటే.. ఏదో కారణం ఉంటుంది. ఆయన ఓ ఎమ్మెల్యేకు ముద్దుల బామ్మర్ది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ‘జబర్‌ దస్ద్‌’ చేసి.. ఈ కేసును బొంద పెట్టడానికి.. ఆయన బావ ఏకంగా ఇప్పుడు కారులోకి జంప్‌ అయ్యి…నగరం నడిబొడ్డున గులాబీ ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకు ఈ కేసులోని నిందితుడు బామ్మర్ది. ఆయన కథ ఏంటి.. ? ఎలా కుమ్మేశారనే విషయం రేపు సరదాగా కాదు.. సీరియస్‌ గా చదువుకుందాం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close