రాజకీయ వార్తలు

మహాకూటమి గెలిస్తే…? సిఎంగా జైపాల్‌ రెడ్డి

– ఉప ముఖ్యమంత్రులుగా రమణ, రాజనర్సింహ

– మహిళల కోటాలో రచనారెడ్డి

(అనంచిన్ని వెంకటేశ్వరరావు చౌదరి)

(న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రాజకీయ చదరంగంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆశ్చర్యానికి తావుండదు. ఊహలకు అందని విధంగా ఎత్తులకు పై ఎత్తులు వేయటమే రాజనీతి. బద్ద శత్రువులైన పార్టీలు ‘కాంగీదేశం’ జతకట్టాయి. ఎలాగైనా ఎలాగైనా గెలవాలనే దిశగా మహా కూటమిని తెరవిూదకు తెచ్చారు. ఆ తరువాతనే కాంగ్రెస్‌, టిడిపి, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ విషయాన్ని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ముందుగానే చెప్పింది. రాహుల్‌ గాంధీ, చంద్రబాబులను కలిపిన అజ్ఞాతశక్తి మరో అధ్భుతమైన వ్యూహరచన చేసింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎవరిని తీసుకురావాలనే ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా వేగంగా జరిగాయి.

వార్‌ రూమ్‌లో నిశ్శబ్ద విప్లవం:

ఏఐసీసీ వార్‌ రూమ్‌ కో ప్రత్యేకత ఉంది. కీలక నిర్ణయాలన్నీ అక్కడే తీసుకుంటారు. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు… కాంగీ కోటరీ ముఖ్యుడు కొప్పుల రాజు సంధానకర్తగా వ్యవహరించినట్లు తెలిసింది. మహాకూటమిని దగ్గరుండి నడిపిస్తున్న వ్యూహకర్త ముఖ్యమంత్రిగా జైపాల్‌ రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. అయితే అందుకు సరిపడా నిధులను సమకూర్చే పెద్ద అంభాని లాంటి వ్యక్తికి ఆ విషయం నచ్చలేదు. జైపాల్‌ రెడ్డి గతంలో పెట్రోలియం మంత్రిగా పనిచేసినప్పుడు ఓ చమురు ‘ఫైల్‌’ను జిడ్డు అంటుకుంటుందని వద్దనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. ‘తెలంగాణ అసెంబ్లీ రద్దు’ విషయం కేంద్రంలో ఓ నలుగురికి మాత్రమే కేసీఆర్‌ సమాచారం ఇచ్చారని, వారిలో వ్యూహకర్త ఒకరని తెలిసింది. దీంతో మరో చిన్న అంభానీ లాంటి సోదరుడితో హైదరాబాద్‌ లోని సితార ¬టల్‌ లాంటి ఖరీదైన ¬టల్లో ఆగస్టు నెలాఖరులో రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. తెలంగాణలో తమ ప్రయోజనాలు పరిమితం కాబట్టి, ఎట్టకేలకు అన్యమనస్కంగానే ‘సరే’ అనేశారు.

‘రెడ్డి’ మాత్రమే ఎందుకు..?:

ఆర్థిక అవసరాలకు సరిపడా వనరులు ఉన్నప్పుడు రెడ్డి సమాజిక వర్గానికే ఆ పదవి ఎందుకు కట్టబెట్టాలి.? తమకు ‘కమ్మ’గా ఉండే వారిని ఎందుకు వద్దు అనుకున్నారంటే… అన్ని పార్టీలలో రెడ్డి ప్రాబల్యం అధికంగా ఉంది. కాంగ్రెస్‌ లో అది మరీ అధికం. ఆ పార్టీలో పోటీలో ఉన్న ఇతర ‘రెడ్డీ’లు జైపాల్‌ రెడ్డి బంధువు కావడం వ్యూహకర్తలు కూడా ఊహించని విజయం ఎలా వరిస్తుందో చూడండి. భాజపాకు ఉన్న ఓకే ఒక ధీరుడు నరేంద్ర మోడీ. ఆ యన అనుకుంటే తెలంగాణలో కాషాయరంగులో కమలం వికస ిస్తుంది. ఆయనను తెలంగాణలో 12 నుంచి 18 బహిరంగ సభ లకు తెలంగాణ నాయకులు ఒప్పిస్తే తప్పక విజయం భాజపాను వరిస్తుంది. హైదరాబాద్‌, రంగారెడ్డిజిల్లాలలో అదనపు సభలకు తోడు ఉమ్మడి జిల్లాలో నరేంద్ర మోడీ 12 సభలు పెడితే భాజపా తెలంగాణలో తప్పక అధికారంలోకి వస్తుంది. మోడీకి తో డుగా అద్వానీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌ ఉండనే ఉన్నారు. కిషన్‌ రెడ్డితో పాటు పరిపూర్ణానంద ఉండనే ఉన్నారు. అధినేతను ఇక్కడి కమల నాథులు ఒప్పిస్తారా..?ఒప్పిస్తే మరోచరిత్ర భాజపా సొంతం.

కాంగీ’రేసు’లో..:తెలంగాణ ఇచ్చి సీట్లుతో కూడిన ఓట్లు తెచ్చుకోవడంలో కాంగ్రెస్‌ గతంలో ఘోరంగా విఫలమైంది. అందుకు స్థానిక మూర్ఖపు నాయకత్వం కారణం. ఇప్పుడు అంతా చల్లబడి.. చతికిలబడ్డారు. అధికారం లేక విల విలలాడుతున్నారు. కాంగీ విజయాల బాట పట్టాలంటే… సోనియా గాంధీతో ఆరు, రాహుల్‌ గాంధీతో 15 నుంచి 18 వరకు బహిరంగ సభలు పెట్టించ గలిగితే చాలు. సోనియా వచ్చి సభలలో మాట్లాడితే గులాబీ దళపతి వాగ్దాటికి ‘చెక్‌’ పెట్టినట్లు అవుతుంది. వీరికి తోడుగా ‘మహాకూటమి’ నుంచి చంద్రబాబు, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్‌, కోదండరాం, రేవంత్‌ రెడ్డి, రేణుకాచౌదరి,

విజయశాంతి, వీహెచ్‌ లు ఉండనే ఉన్నారు. ప్రజా గాయకుడు

గద్దర్‌ ఆట పాట మహాకూటమికి అదనపు ఆకర్షణ.

కారుకు కేసీఆరే కిక్కు: ఉద్యమపార్టీ రాజకీయ పార్టీగా మారింది. అనుభవించడానికి అందరూ వచ్చారు. బరువు మోసేది మాత్రం ఒక్క కేసీఆర్‌ మాత్రమే. ఆయన తెలంగాణ యాసతో కూడిన తిట్ల పురాణం ఆపాలి. తెలంగాణ తేవడం కోసం ఆనాడు మాట్లాడితే ఆనందించిన ప్రజలు ఇప్పుడు అందుకు సిద్దంగా లేరు. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీలు కూడా అదే తిట్లపురాణం బాట పట్టాయి. తెలంగాణలో సాఫీగా సాగుతున్న ప్రభుత్వానికి అధికార కొనసాగింపు కోసం అసెంబ్లీ రద్దు చేశారు. ఈ ‘సాకు’ను కాంగ్రెస్‌ విూద రుద్దటం సబబుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. స్థానిక నేతలు ప్రచారంలో ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవి ఏవిూ కాదు. అలాగే ఇతర పార్టీల గుర్తుతో గెలిచి కారెక్కిన వారిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. సంప్రదాయ ఓటర్ల ఆగ్రహం నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. అలాగే పెరిగిన శాసనసభ్యుల ఆస్థుల విషయం కూడా స్థానికులు గుర్రుగా ఉన్నారు. ఆ దిశలో ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో తెలంగాణ వాదులు తెరాసతో ఉన్నారు. లేదంటే మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ లోపాలు ఎత్తి చూపటంలో ముందు వరుసలో ఉంటున్నారు. కేసీఆర్‌ ప్రతి నియోజకవర్గంలో ఉండి స్వయంగా పరిస్థితి అంచనా వేసి… మళ్ళీ ప్రజలకు తాను చేరువగా ఉన్నానని స్పష్టంగా చెప్పాలి.

ప్రచార ‘బాహుబలులు’

భాజపా జాతీయ నాయకులు: నరేంద్ర మోడీ, అమిత్‌ షా, అద్వానీ, సుష్మాస్వరాజ్‌

రాష్ట్రంలో..: లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి

కాంగ్రెసు: సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ

రాష్ట్రంలో..: ఉత్తమ్‌, కోమటిరెడ్డి సోదరులు, రేవంత్‌ రెడ్డి, రేణుకాచౌదరి, గద్దర్‌ విజయశాంతి, వీహెచ్‌ జాతీయ నాయకులు లేరు

రాష్ట్రంలో:

తెరాస :కేసీఆర్‌, హరీష్‌ రావు, కేటీఆర్‌, కవిత

తెలుగుదేశం: చంద్రబాబు, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌

కమ్యూనిస్టు పార్టీలు: సీతారాం ఏచూరి, నారాయణ.

తెజస: కోదండరాం,రచనారెడ్డి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close