Featuredస్టేట్ న్యూస్

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?

చర్యలు తీసుకొకపోతే నిబందనలు ఎందుకు?

బేగంపేట్‌ సర్కిల్‌ పరిధిలో ఇష్టానుసారంగా సెలర్ల తవ్వకం

సెలర్ల తవ్వకంతో పొంచిఉన్న పెను ప్రమాదం

ఆమ్యామ్యాలకు తలొగ్గి చర్యలు చేపట్టని డీసీ, ఏసీపీ, సెక్షన్‌ అధికారులు

బేగంపేట(ఆదాబ్‌ హైదరాబాద్‌):బేగంపేట్‌ సర్కిల్‌ పరిధిలో ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల పర్యవేక్షణ కరువై అక్రమ భవంతుల నిర్మాణాలు పుట్టగొడు గుల్లా వెలుస్తున్న అధికారులు కళ్ళున్న కబోదుళ్ల వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క మొండా డివిజన్‌ పరిధిలోనే మూడు చోట్ల భారీ ఎత్తున సెలర్ల తవ్వకం కొనసాగుతున్న బేగంపేట్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ,సెక్షన్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాస్థార్యం చేస్తున్నా రని స్థానికులు ఆరోపిస్తున్నారు.భారీ సెలర్ల తవ్వకంతో పక్కన ఉన్న భవనాలకు ప్రమా దాలు పొంచిఉన్నాయని స్థానికులు జిహెచ్‌ ఎంసి అధికారులకు పిర్యాదు చేసి రోజులు గడుస్తున్న ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు.

మున్సిపల్‌ అను మతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న నిర్మాణదారులనుండి లక్షల కొద్ది లంచాలు వసూళ్లు చేసు కుంటూ అక్రమ నిర్మాణాలవైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.భాటా కూడలి సమీపంలో భారీ సెల్లర్‌ తవ్వకం జరుగుతుంది దానిపై స్థానికులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు చేసి రోజులు గడు స్తుంది… నిర్మాణం కొనసాగు తుంది. కానీ నిర్మాణాన్ని ఆపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనప్పుడు నిబంధనలు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతా ధికారులు జిహెచ్‌ఎంసి నిబంధనలు అతిక్రమించిన భవన నిర్మాణాలపై, నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.ఆదాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో అక్రమ భవన నిర్మాణాలపై వస్తున్న వరుస కథనాలపై సికింద్రాబాద్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌, బేగంపేట డిప్యూటీ కమిషనర్‌ లు స్పందిస్తారో లేదో చూడాలి..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close