వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కన్నుమూత

0

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ సీమర్‌ నర్స్‌(85) కన్నుమూశారు. ఈ మేరకు బార్బడోస్‌, వెస్టిండీస్‌ దిగ్గజం డెస్‌మండ్‌ హేన్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘ నా కోచ్‌, మెంటార్‌, మే మంతా ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇక లేరు’ అని అందులో రాశారు. గత కొంత కాలంగా సీమర్స్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1960-1969 ప్రాంతంలో 29 టెస్టులాడిన సీమర్స్‌ 47.6 స్ట్రయిక్‌ రేట్‌తో 2523 పరుగులు చేశారు. అందులో ఆరు శతకాలుకాగా, మరో 10 అర్ధశతకాలున్నాయి. రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత సీమర్స్‌.. బార్బడోస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో కోచ్‌గా పని చేశారు. అంతేకాకుండా బార్బడోస్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ‘ మేమంతా నీ బాటలోనే నడవాలనుకుంటున్నాం, మాటల్లోనూ, చేతల్లోనూ నిన్నే స్ఫూర్తిగా తీసుకుంటాం. ఇన్నాళ్లూ మాందరికీ మీరు చేసిన సహాయానికి క తజ్ఞతలు, మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాం’ అని హేన్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here