బాగా పండిన అరటిపండ్లు, వాటి పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు.

0

అరటి పండు అంటే మీకు అభిమానం ఉండవచ్చు కానీ, అది పండిన అరటి పండు కాకపోవచ్చు. మనం అరటి పండ్లు తెచ్చినప్పుడు తాజాగా కనిపించినా, ఒకటి రెండు రోజుల తర్వాత వాటి మీద నల్లటి మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. ఈవిధంగా నల్లటి మచ్చలు ఏర్పడి ఉన్న ఎడల, దానిని పండిన అరటి పండుగా గుర్తించబడుతుంది. ఈ మచ్చలు అధికంగా కనిపిస్తే ఖచ్చితంగా పారవేస్తూ ఉంటారు. అవునా ?. వాస్తవానికి, వాటి మ దుత్వం మరియు రంగులో మార్పులు చోటు చేసుకుంటున్న కారణాన అవకాశం తీసుకోకుండా పారవేయడం జరుగుతుంటుంది. కానీ ఈ పండిన అరటి పండ్ల వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పబడుతుంది.

అరటి పండు బాగా పండిన తరువాత, దాని పోషక విలువల స్థాయిలు మారుతాయి. అంతేకానీ, పోషక ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కోల్పోయిందని అర్థం కాదు. అరటి పండు పండినా కూడా మీ శరీరానికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని కార్నెల్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎకాలజీ వారు చెప్తున్నారు.

పొటాషియం, మాంగనీస్‌, ఫైబర్‌, రాగి, విటమిన్‌ సి, విటమిన్‌ %దీ%6 మరియు బయోటిన్‌ సమ ద్ధిగా ఉన్న ఈ అరటి పండు ఆస్థమా, క్యాన్సర్‌, అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, అలాగే జీర్ణ సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా బాగా పండిన అరటి పండులో కూడా ఈ పోషకాలన్నీ కొనసాగుతాయి. కావున, ఈసారి అరటి పండు మీద గోధుమ రంగు మచ్చలు కనపడితే, వాటిని దూరంగా పారవేయకండి! మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

బాగా పండిన అరటి పండులోని పోషకాలు :

పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉండే సంక్లిష్ట పిండి పదార్థాలు పక్వానికి వచ్చే కొలదీ, స్టార్చ్‌ నుండి సాధారణ చక్కెరలవలె మార్పులకు గురవుతుంది. ఏదిఏమైనా క్యాలరీల సంఖ్య మాత్రం అదేవిధంగా ఉంటుంది. కానీ నీటిలో కరిగే స్వభావం ఉండే విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్‌ మరియు థయామిన్‌ వంటి విటమిన్లు తగ్గుదలకు గురవుతాయి.

బాగా పండిన అరటి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

వాస్తవానికి దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఆహారంగా పరిగణించడం జరుగుతుంది. అరటి పండులో విటమిన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. బాగా పండిన అరటి పండులో టన్నుల కొద్దీ పోషకాలు ఉంటాయి. శరీరానికి సరైన జీవక్రియలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

 1. కణ నష్టాన్ని నివారిస్తుంది : యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉన్న కారణాన, కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత డ్యామేజీలు మరియు ఫ్రీ రాడికల్స్‌ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటి పండు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది వ్యాధులబారిన పడే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
 2. రక్తపోటును తగ్గించడంలో : అరటి పండ్లలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి. మరియు ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. తరచుగా పండిన అరటి పండ్లను తీసుకోవడం మూలంగా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ధమనుల్లోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. క్రమంగా మీ రక్త ప్రసరణ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తూ, స్ట్రోక్‌ మరియు హార్ట్‌ అటాక్‌ సమస్యలు తలెత్తకుండా చూస్తుంది.
 3. గుండె మంటను తగ్గిస్తుంది : హనుమంతుడు అత్యంత శక్తివంతుడుగా ఎలా మారాడు? హనుమంతుడు అత్యంత శక్తివంతుడుగా ఎలా మారాడు? అతను ఫుల్‌ గా తాగుతాడు, కళ్ళు కోల్పోయిన విషయం కూడా గుర్తించలేకపోయాడు! అతను ఫుల్‌ గా తాగుతాడు, కళ్ళు కోల్పోయిన విషయం కూడా గుర్తించలేకపోయాడు! తొడల మద్య కొవ్వు కరిగించే హోం రెమెడీస్‌ తొడల మద్య కొవ్వు కరిగించే హోం రెమెడీస్‌
 4. రక్త హీనత సమస్యను నివారించడంలో : పండిన అరటి పండ్లలో ఐరన్‌ అధికంగా ఉన్న కారణాన అనీమియా సమస్యను నివారిస్తుంది. పండిన అరటి పండ్లను తినడం వల్ల మీ రక్త స్థాయిలను సహజ సిద్దంగా పెంచడానికి సహాయపడుతుంది. అనీమియా చికిత్సకు గల ఉత్తమ నివారణలలో ఇది కూడా ఒకటి.
 5. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది : బాగా పండిన అరటి పండులో ఉండే అధిక కార్బోహైడ్రేట్స్‌ మరియు షుగర్‌ కంటెంట్‌ సహజ సిద్దమైన ఎనర్జీ బూస్టర్స్‌ వలె పనిచేస్తాయి. క్రమంగా శారీరిక శక్తి స్థాయిలు మెరుగవుతాయి. బాగా పండిన రెండు అరటి పండ్లను తినడం వలన 90 నిమిషాల పాటు లాంగ్‌ వర్కౌట్‌ చేయగలిగినంత శక్తి స్థాయిలు శరీరానికి లభిస్తాయని చెప్పబడుతుంది. ఒకవేళ శరీరం డస్సిపోయిన అనుభూతికి లోనవుతూ ఉంటే, ఒకటి లేదా రెండు బాగా పండిన అరటి పండ్లను తీసుకోండి.
 6. క్యాన్సర్‌ సమస్యను నివారిస్తుంది : బాగా పండిన అరటి పండులో ఉండే ప్రయోజనాలలో ముఖ్యమైనది క్యాన్సర్తో పోరాడే సామర్థ్యం. అరటి పండు చర్మంపై కనిపించే ముదురు మచ్చలు, ట్యూమర్‌ నెక్రోసిస్‌ ఫ్యాక్టర్‌ (%ుచీఖీ%) ఏర్పాటు చేస్తాయి, ఇవి క్యాన్సర్‌ మరియు శరీరంలో పేర్కొన్న అసంబద్ద కణాలను చంపే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
 7. హదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : పైన చెప్పినట్లు, అధికంగా పండిన అరటి పండ్లలో పొటాషియం సమ ద్ధిగా ఉంటుంది. మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్‌ స్థాయిలను నిర్వహించడానికి లాభదాయకంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ గుండె వ్యాధుల ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కాపర్‌ మరియు ఐరన్‌ కంటెంట్‌ శరీరంలోని రక్తం మరియు హీమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.
 8. అల్సర్స్‌ తగ్గించడంలో : అరటి పండ్లు అల్సర్స్‌ సమస్యతో బాధపడుతున్న వారికి, అత్యంత లాభదాయకమైన పండుగా ఉంటుంది. మరియు అల్సర్‌ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా ఈ పండిన అరటి పండును తీసుకొనవచ్చు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేనిదిగా ఉండడమే కాకుండా, బాధ నుండి ఉపశమనాన్ని అందివ్వడంలో సహాయం చేయగలదు. అరటి పండ్ల యొక్క మ దుత్వం కారణంగా కడుపులో పేగు వ్యవస్థను సవ్యంగా జరిగేలా చూస్తూ, అల్సర్స్‌ నుంచి యాసిడ్లు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది.
 9. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది : బాగా పండిన అరటి పండ్లలో ఉండే అధిక ఫైబర్‌ కంటెంట్‌ కారణంగా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయం చేయగలదు. అవి మీ ప్రేగు ఉద్యమాన్ని మెరుగుపరచి, మీ జీర్ణ వ్యవస్థ నుండి వ్యర్థ పదార్థాలను బయటకు తరలించడాన్ని సులభతరం చేస్తుంది. క్రమంగా మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
 10. లక్షణాలను అదుపులో ఉంచుతుంది: బాగా పండిన అరటి పండ్లలో ఉండే విటమిన్‌ %దీ6, ూవీూ% లక్షణాల చికిత్సలో లాభదాయకంగా ఉంటుంది. వివిధ అధ్యయనాల ప్రకారం ప్రెసెసివ్‌ సిండ్రోమ్‌ లక్షణాలను తగ్గించడంలో విటమిన్‌ %దీ%6 ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది.
 11. డిప్రెషన్‌ చికిత్సలో : బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాన్‌ యొక్క అధిక స్థాయిల కారణంగా, వినియోగం మీద సెరోటోనిన్‌ హార్మోన్‌ వలె మారడం జరుగుతుంది. సెరోటోనిన్‌, మీరు మంచి అనుభూతికి లోనయ్యేలా చేసి, మీ నాడీ వ్యవస్థ ఉధ తిని తగ్గించి, తద్వారా మీ మానసిక స్థాయిలను సావధాన పరుస్తుంది. క్రమంగా ఆరోగ్యకరమైన మానసిక స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here