Featuredరాజకీయ వార్తలు

100 స్థానాలు కాదు.. 106 గెలుస్తాం

వికారాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తాజా సర్వే ప్రకారం.. తెరాస 100 స్థానాల్లో కాదు 103 నుంచి 106 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆదివారంనాడు తాండూరు, పరిగి, నారాయణ పేట, దేవరకద్ర, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలనగానే నేతలు వస్తుంటారు.. వెళ్తుంటారని, ఓటర్లు గందరగో ళానికి గురికావొద్దని హితవు పలికారు.

సోనియాకు ఎందుకు బాధ

మోసం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ నైజమని టీఆర్‌ఎస్‌ చేఫీ కేసీఆర్‌ చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్‌, చంద్రబాబులు కుంభకోణా లకు పాల్పడ్డారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిని కక్కిస్తా మన్నారు. సోనియాగాంధీపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ హత్యలు తగ్గిన విషయం సోనియా గాంధీకి కన్పించడం లేదా కేసీఆర్‌ ప్రశ్నించారు కేసీఆర్‌ ఓడించే సత్తా లేక చంద్రబాబును భుజాలపై మోసుకొస్తున్నారన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వచ్చినట్టుగా నెలవారీగా వస్తున్న మామూళ్లు వస్తలేవా… సూట్‌ కేసులు వస్తలే వనే బాధ కలుగుతోందా అని సోనియా ప్రశ్నించారు. రౖౖెతులకు 24 గంటల పాటు విద్యుత్‌ ను ఇస్తున్నాం, చేనేత కార్మికులకు భరోసా కల్పిస్తున్నాం… ఇవన్నీ చూసీ సోనియా గాంధీ కడుపు తరుక్కుపోతోందా అని కేసీఆర్‌ ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌ పాలనలో రైతుల సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకో లేదో చెప్పాలని సోనియా గాందీని óడిమాండ్‌ చేశారు. పంజాబ్‌ లో పంట రుణ మాఫీ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది, కానీ ఇంతవరకు పంట రుణాన్ని మాఫీ చేయలేదన్నారు. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఏపీకి సోనియా గాంధీ ప్యాకేజీ ప్రకటించింది. తెలంగాణలో కూడ ఇదే ప్యాకేజీని ఇస్తావా లేదా అనే విష యాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేయాలని కోరారు.

2014లో రాలేదా?”సోనియాగాంధీ ఇటీవ ల తెలంగాణకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఆమె వచ్చారని కాంగ్రెసోళ్లు ప్రచారం చేశారు. 2014లో ఇదే వికారాబాద్‌ జిల్లాలో ఆమె పర్యటనకు వచ్చిన విషయం గుర్తు లేదా? తెలంగాణ తామే తెచ్చానని చెబుతున్నారు. మరెందుకు 2014లో మమ్మల్ని గెలిపించారు. మీ మీద నమ్మకం లేకనే అని ఆయన అన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close