అక్రమ వలసదారులను వెళ్లగొట్టి తీరుతాం

0

అంతర్జాతీయ చట్టం ప్రకారమే వెనక్కి పంపిస్తాం

  • కేంద్ర ¬మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ

దేశంలో ఎక్కడ అక్రమ వలసదారులు ఉన్నా.. వారిని దేశం నుంచి వెళ్లగొడతామని కేంద్ర ¬మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌ అమలుకు ఆయన సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభలో అమిత్‌షా బుధవారం మాట్లాడుతూ.. అక్రమ వలసలు దేశంలో ఎక్కడా లేకుండా చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికి కేంద్రం కట్టుబడి ఉంటుందని, అలా వచ్చిన అక్రమ వలసదారులను అంతర్జాతీయ చట్టం ప్రకరమే వెనక్కి పంపిస్తామని తెలిపారు. అసోంలో జరుగుతున్న జాతీయ పౌరుల నమోదు (ఎన్‌ఆర్‌సీ)లో మరింత పారదర్శకత్వ కోసం ఎన్‌ఆర్‌సీ తుది ప్రచురణ గడువును జూలై 31 నుంచి మరింత పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని ¬ం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో మంగళవారం హావిూ ఇచ్చింది. అక్రమ వలసదారుల అడ్డుకట్ట వేసేందుకు 1964 ఫారినర్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కింద కేంద్రానికి అధికారులు ఉన్నాయని కూడా ¬ంశాఖ తెలిపింది. ఈ చట్టం కింద దేశంలో ఉంటున్న విదేశీ అక్రమ వలసదారులను గుర్తించి, వారిని నిర్బంధించి, వెనక్కి పంపే హక్కు కేంద్రానికి ఉంటుందని పేర్కొంది. అక్రమవలసదారులు దేశంలోకి అడుగుపెట్టి, ఇక్కడే స్థిరపడడానికి ఇండియా ‘ధర్మశాల’ కాదని అమిత్‌షా గత ఏడాది చాలా స్పష్టంగానే చెప్పారు. ఎన్‌ఆర్‌సీని బీజేపీతో ముడిపెట్టరాదన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అక్రమ వలసదారుల సమస్య ఒకటని అన్నారు. ‘అంతా ఇండియాకు అక్రమంగా వలసవచ్చి స్థిరపడిపోతానంటే ఎలా అని ప్రశ్నించారు. దేశాన్ని అలా నడపడం కుదరదు. దేశ పౌరులు మాత్రమే దేశంలో ఉండాలి. దేశ వనరులపై హక్కు వారికి మాత్రమే ఉంటుందని అమిత్‌షా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here