జీవన్ రెడ్డి ని ఓడించి కేసీఆర్ కు బుద్ధి చెప్తాం…

0

మైలారం బాలు ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు…

ఆర్మూర్ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని ఓడించి కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతామని మైలారం బాలు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు అన్నారు. జీవన్ రెడ్డి తనను ఎదిరించిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదంలో పొట్టన పెట్టుకున్నారని దీనిపై న్యాయ విచారణ జరిగే అంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు. వాస్తవంగా జీవన్ రెడ్డి కి సంబందించిన అక్రమాలను, కేసులను వెలుగులోకి తీసుకు వచ్చి న్యాయ పోరాటం చేయడం చేసింది తలారి సత్యం, అందువల్లన వారిమీద కక్ష్య కట్టి తలారి సత్యం, చీపురు రవి లను రోడ్డు ప్రమాదంలో హత్య చేశారని బాలు ఆరోపించారు. రోడ్డు ప్రమాదం పై వెంటనే సిబిఐ విచారణ జరిపించి జీవన్ రెడ్డి కి శిక్ష పడే అంత వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. అలాగే దళితులంతా ఏకమై జీవన్ రెడ్డి కి తగిన పాఠం చెబుతామని అన్నారు. గత ఎన్నికల్లో తలారి సత్యం ఆర్మూరు అభ్యర్థిగా పోటీ చేయడం జీవన్ రెడ్డి చెందిన రికార్డులను బయట పెట్టడం ద్వారానే తలారి సత్యం అమరుడు అయ్యాడని ఆయన లక్ష్యాన్ని ఎమ్మార్పీఎస్ పూర్తి చేస్తుందని బాలు ఆదాబ్ హైదరాబాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల్లో తోలు పరిశ్రమ జరిపిస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ పని పూర్తి చేయక పోవడమే కాకుండా నిధులను మంజూరు అయినట్టు జీవోలను తీసుకువచ్చి తప్పుడు ప్రచారం చేసి మాదిగలను అబద్ధం లో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల అనంతరం జీవన్ రెడ్డి ఆస్తులపై న్యాయ విచారణ చేయాలని ప్రభుత్వం భూములను కబ్జా చేసుకున్న ఆ భూములను విడిపించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here