Featuredరాజకీయ వార్తలు

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం?

బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అసెంబ్లీలో కమలం వికసిస్తుంది. తెలంగాణలో కాషాయ జెండా రెప రెపలాడబోతోంది. మజ్లీస్‌తో జతగట్టిన తెరాసతో పొత్తు ఉండబోదు. రాజకీయాలలో ఆనంద క్షణాలకన్నా ప్రజలకోసం బాధపడ్డ సంఘటనలే ఎక్కువ.

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఏ సౌకర్యాలు లేని రంగారెడ్డి జిల్లా, తిమ్మాపూర్‌ గ్రామంలో 1964 మే15న కళ్ళు తెరిచిన ఓ బుడతడు… నేడు అధునాతన సదుపాయలతో కనిపించే ఆ ఊరిలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. భాజాపా ఆఫీసులో చిన్నప్పటి నుంచి సేవలందిస్తూ… అఖిలభారత యువమోర్చా జాతీయ అధ్యక్షుడు కాగలిగారు.ఎప్పుడూ అందరినీ నవ్వుతూ ప్రేమగా పలకరించే కిషన్‌ రెడ్డితో ఆదాబ్‌ హైదరాబాద్‌ ముఖాముఖి.

– అసెంబ్లీలో భాజపా విజయావకాశాలు..?

అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరేస్తాం. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుందని.. మెజారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం.

– తెలంగాణ తొలి ప్రభుత్వంపై మీ అభిప్రాయం.?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గ, కుటుంబపాలన పట్ల తెలంగాణ ప్రజలు విసుగు చెందారు.

– రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెపుతారు.

కేసీఆర్‌ సచివాలయానికి రాలేదని చెపుతున్నారు..? ఈ నాలుగున్నర సంవత్సరాల పాలనలో సీఎం కేసీఆర్‌ కేవలం 17 సార్లు మాత్రమే సచివాలయంలో అడుగుపెట్టారు. విమర్శించక అభినందించాలా.?

– కేసీఆర్‌ ప్రధానిని కలసి ముందస్తు ముచ్చట్ల తరువాత మీరు ప్రగతిభవన్‌ కు ఎలా వెళ్ళి కలిశారు.?

మేము వాజ్‌ పేయి విగ్రహం రాష్ట్ర కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరడానికి వెళ్ళాం. అంథకు మించి మరేం లేదు.

– కేసీఆర్‌ అసెంబ్లీలో మజ్లీస్‌ తో… పార్లమెంట్‌ లో భాజపాతో జతకడతారని వార్తలు గుప్పుమంటున్నాయి.?

మజ్లీస్‌తో జతకట్టే ఏపార్టీతోనూ భాజపా జత కట్టదని, ఎట్టి పరిస్థితిలో టిఆర్‌ఎస్‌ తో కలవమని చెప్పారు.

– హంగ్‌ దిశగా అసెంబ్లీ అడుగులు వేస్తే…?

మా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధింస్తుందని, ఇక రాష్ట్రంలో హంగ్‌ వచ్చే అవకాశం ఎక్కడిది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీ మాది.

– మీకు గ్రామస్థాయిలో అంత బలం లేనట్లు కనిపిస్తోంది.?

భాజపా 20 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అత్యధిక ఎంపీలు, ఎమ్మెల్యేలు మా వాళ్ళే. ఎక్కువ మంది ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు మా వాళ్ళే. చివరకు మహిళల ఎమ్మేల్యేలు కూడా మావాళ్ళే ఎక్కువ. ఇప్పుడు చెప్పండి విూం బలంగా ఉన్నా..లేమా..!

– నోట్ల రద్దు.. జిఎస్టీ నిర్ణయాలతో భాజపా ప్రభ తగ్గినట్లుంది.

నోట్ల రద్దు వల్ల ఆర్థిక లావాదేవీలు ఆలస్యం అయ్యాయి కానీ ఎవరూ రూపాయి కూడా నష్ట పోలేదు. ఇక జిఎస్టీ వలన సమాజానికి జవాబుదారీతనం వచ్చింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో భాజపా విజయఢంకా మోగించింది.

– ముస్లిం రిజర్వేషన్లపై మీ అభిప్రాయం.?

ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్ల రద్దుపైనే తొలి సంతకం చేస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని, వారిని అధికార పార్టీ మోసం చేస్తోంది.

– ‘ప్రత్యేక¬దా’ విషయంలో భాజపా వైఖరి..?

ఏపీకి ¬దా ఇవ్వలేం. జాతీయస్థాయిలో చాలా రాష్ట్రాలలో సమస్యలు వస్తాయి. అందుకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామంటే బాబు ఒప్పుకున్నారు. అందుకు సంబంధించి సహాయాలు అందుతూనే ఉన్నాయి. ఇతరపార్టీల వత్తిడితో బాబు ‘యు’ టర్న్‌ తీసుకున్నారు.

– మరి కాంగ్రెస్‌ తోలి సంతకం ‘¬దా’ పైనే అని చెపుతోంది కదా..?

అధికారంలోకి రాని పార్టీలు ఎన్నో చెపుతాయి.

– సిబిఐ విషయంలో భాజపా తొందరపడిందని విమర్శలు..?

సిబిఐ లో గ్రూపులు కట్టడంతో ప్రధానమంత్రి వేగంగా స్పందించి చర్యలకు శ్రీకారం చుట్టారు. భాజపా జాతీయ నారకులు త్వరలో సవివరంగా వివరాలు అందిస్తారు.

– విూరు రాజకీయ జీవితంలో ఎక్కువగా బాధపడిన సంఘటనలు..?

ఎన్నో ఉన్నాయి. ప్రజలకు సంతృప్తి కరంగా సేవలందించి

నప్పటికి ఇంకా చాలా చేయాలని మనస్సు తపిస్తుంది. చాలా చేసి చూపుతాను.

– బాగా సంతోషపడ్డ సంఘటనలు.?

నేను కృష్ణ మాదిగ కలసి గుండె జబ్బలు కలిగిన 50 వేల మంది చిన్నారులకు వైద్య సహాయానికి ఎంతో పోరాడాం. ప్రభుత్వం మెడలు వంచి చేసిన వారందరికీ వైద్య సహాయం చేయడం ఇప్పటికీ కళ్ళముందు కదిలాడుతోంది.

– విూరు ఎంపిగా వెళతారని చెపుతున్నారు..?

పార్టీ ఎలా ఆదేశిస్తే అలా ముందుకు వెళ్ళటమే.!

– చివరిగా…

రాజకీయాలలో విూరు బిజీగా ఉంటూ కుటుంబసభ్యులతో గడపడం ఆనందకరం. ఎలా ‘బ్యాలెన్స్‌’ చేస్తున్నారు. నేను ఆవిషయంలో ముందుగా మా కుటుంబ సభ్యులను అభినందించాలి. నా ప్రజా సమయానుకూలంగా వారు అందిస్తున్న తోడ్పాటే కారణం. పాదయాత్రకు సమయం కావడంతో సుధీర్ఘ ముఖాముఖి ముగించుకొని ఆదాబ్‌ హైదరాబాద్‌ నవ్వుతూ సెలవు తీసుకుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close