Featuredస్టేట్ న్యూస్

అటవీకి పూర్వ వైభవం తెస్తాం..

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

ఆదిలాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

అంతరించిపోతున్న అడవికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం సమీపం లోని మావల పట్టణ అటవీ క్షేత్రం బ్లాక్‌ చుట్టూ చైన్‌ పుల్లింగ్‌ పెన్సింగ్‌ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భూమిపూజ నిర్వహిం చారు. ఒక కోటి 71 లక్షలతో 8087 ఎకరాల విస్తీర్ణం లో పెన్సింగ్‌ ఏర్పాటుకు పనులు ప్రారంభిం చడం జరుగు తుందని తెలిచారు. సుమారు అయిదు కిలోమీటర్ల మేర మావల పార్కు నుండి దుర్గానగర్‌, కెఆర్కె కాలనీ, తంతోలి రోడ్డు వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అభివ ద్ధి చేయడానికి పనులు చేపడు తున్నట్లు మంత్రి తెలిపారు. తరిగిపోయిన అడవులకు పూర్వ వైభవం తీసుకురా వడానికి ప్రజల భాగస్వామ్యంతో కార్యక్ర మానికి నిర్వహిస్తున్నామని తేలిపారు. భావి తరాల వారికి అందించడానికి ఈ బహత్కర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ముందు తరాల వారికి పాఠ్య పుస్తకాలలో పొందుపరిచే విధంగా అడవిని సంరక్షించడం జరుగుతుందని అన్నారు. అటవి సంప దను అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్‌ ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుం దని తెలిపారు. రాష్ట్రంలో 3110 కోట్ల కంపా నిధులు ఉన్నాయని, 1700 అటవీ అధికా రులను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ అటవి క్షేత్రాల్లో పులుల పెంపకం వలన అడవి అభివద్ధి చెందుతుం దని అన్నారు. ఇందులో నడకదారి, గేట్‌ లు, వాచింగ్‌ టవర్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రానున్న కాలంలో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవాలయాల అభివద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ మాట్లాడుతూ 33 శాతం అడవులను పెంచి సంరక్షించాలని అన్నారు. అడవులను పెంచడం ద్వారా వర్షాలు సమ ద్ధిగా కురు స్తాయని అన్నారు. ఆదిలాబాద్‌ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హరిత ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. 171 లక్షలతో 3000 హెక్టార్ల విస్తీర్ణంలో అడవిని పెంచడం జరుగుతుందని అన్నారు.

మంచి వాతావ రణం పట్టణ వాసులు ఆస్వాదించాలని, కుటుంబ సమేతంగా విహరించవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్‌ దివ్య దేవ రాజన్‌ మాట్లాడుతూ కంపా నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి ధన్యవా దాలు తెలియజేశారు. దేశరాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్యంతొ అక్కడి ప్రజలు బాధపడు తున్నారని, వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు మొక్కల పెంపకం అవ సరమని, ప్రజల ఆరోగ్య కరమైన వాతావరణంలో జీవించవచ్చని అన్నారు. బోథ్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ ప్రాంతాల్లోని అడవి పెంచేందుకు అనుమతించాలని కోరారు. ఈ అటవి క్షేత్రాల భూములను ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ప్రాంతాలకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్‌ వస్తువులను తీసుకు రాకూడదని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్లను కోమటి బండ గ్రామానికి తీసుకువెళ్లి అక్కడి అటవీ ప్రాం తాన్ని చూపించారని తెలిపారు. జిల్లా అటవీ అధికారి ప్రభాకర్‌ స్వాగతో పన్యాసం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రాల్లో పట్టణ ప్రాంతాలను అనుకోని అటవీ భూములు ఉన్నాయని, ఆయా పట్టణాల్లో అటవీ సంపదను పెంచుకోవచ్చని అన్నారు. మవాల నుండి తంతోలి వరకు విస్తరించి ఉన్న ఐదు కిలోమీటర్ల రక్షణ పనులు చేపట్టడానికి మంత్రివర్యులు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. అభివద్ధి పనులను మరో రెండు కోట్లతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవవందనం స్వీకరించిన తర్వాత భూమి పూజ చేశారు. అనంతరం మొక్కలు నాటి నర్సరీని పరిశీలించారు. అనంతరం దుర్గాదేవి ఆలయంలో పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజ న్న, అదనపు ఎస్పీ రవికుమార్‌, మావల సర్పంచ్‌, జెడ్పిటిసి, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధులు, అట వీశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close