టీఆర్ఎస్ కే మా మద్దతు వడ్డెర సంఘం నేతలు

0

మా మద్దతు టీఆర్ఎస్ కేనన్నారు తెలంగాణ వడ్డెర సంఘం నేతలు.
శనివారం హైదరాబాద్ లో సంఘం బాధ్యులు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది వడ్డెర కులస్తులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు వడ్డెర్లకు కూడా అందుతున్నాయని వారు తెలిపారు.

బి సి -ఏ కేటగిరి లో ఉన్న తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎంపీ కవిత ను కోరారు. వడ్డెరలను ఎస్టిల్లో చేర్చే అంశం టీఆర్ఎస్ మేనిఫెస్టో లో చేర్చాలని కోరగా..మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ కే.కేశవరావు ను కలవాలని వారికి ఎంపి కవిత సూచించారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ మళ్లీ అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. టీఆర్ఎస్ పట్ల వడ్డెర సంఘం కు ఉన్న ప్రేమాభిమానాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అన్నారు ఎంపి కవిత.

సమావేశంలో
తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు మొగిలి, ప్రధాన కార్యదర్శి ఎత్తరి మారయ్య, జాతీయ ఉపాధ్యక్షులు పీట్ల శ్రీధర్, రూపని లోకనాథం, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లేపు శంకర్, బత్తుల శంకర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల ఎల్లయ్య, నాయకులు వల్లెపు గణేష్ ఓర్సు యాదగిరి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here