బలపరీక్షకు మేం సిద్ధం

0
  • అందుకు సమయం ఖరారు చేయండి
  • స్పీకర్‌ను కోరిన కర్ణాటక సీఎం కుమారస్వామి

బెంగళూరు, జులై12(ఆర్‌ఎన్‌ఎ) : కర్ణాటకలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో సీఎం కుమారస్వామి వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమయ్యారు. బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్పీకర్‌ సమయం ఎప్పుడు కేటాయిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. జేడీఎస్‌, కాంగ్రెస్‌లోని పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో నేను అధికారంలో ఉండలేనని కుమారస్వామి భావిస్తున్నాయి. అయితే నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దాన్ని రుజువు చేసుకుంటానని తాజా పరిణామాల నేపథ్యంలో బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు సమయాన్ని ఖరారు చేయండని సీఎం కుమారస్వామి అసెంబ్లీలో తెలిపారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటక సంక్షోభం కీలక మలుపు తిరిగినట్లయింది. బలపరీక్షకు స్పీకర్‌ ఎప్పుడు సమయమిస్తారన్నది ఉత్కంఠగా మారింది. రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది క్షణాలకే కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను స్పీకర్‌ ఇప్పుడు అంగీకరించకూడదు గనుక మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 107, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణం సంఖ్యా బలం 100. ఇలాంటి సమయంలో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గుతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here