Featuredస్టేట్ న్యూస్

అదరం.. బెదరం..

  • 9న మిలియన్‌ మార్చ్‌
  • ఇప్పటికైనా చర్చలు జరపండి..
  • సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు కృతజ్ఞతలు
  • ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌

సీఎం కేసీఆర్‌ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు ఎవరూ భయపడొద్దని, పోరాటం ద్వారా మన హక్కులను మనం సాధించుకుందామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఈ మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంపూర్ణ మద్దతిచ్చారని అన్నారు. అలాగే మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు. సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌కు ఒక్క కార్మికుడూ స్పందించలేదన్నారు. మంత్రుల వాహనాల్లో తీసుకెళ్లి విధుల్లో చేర్పించినా.. కార్మికులు మళ్లీ వెనక్కి వస్తున్నారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి కార్మికులు భయపడాల్సిన అవసరంలేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు తమ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారని అశ్వత్థామ తెలిపారు. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీపై ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వంతో చర్చలకు ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. చట్టబద్ధత ఉంటే…అటెండర్‌ కమిటీతోనైనా చర్చిస్తామన్నారు. సమ్మెను జఠిలం చేయొద్దని సీఎంను కోరుతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం అనుకూలంగా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close