రాష్ట్రానికి ఎంతో చేశాం..

0

రాజమండ్రి బీజేపీ సభలో చంద్రబాబుపై అమిత్‌షా నిప్పులు చెరిగారు. ఉగ్ర దాడిలో 40మంది భారత జవాన్లు అమరులైతే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడతావా? అంటూ ఫైరయ్యారు. ఇదేనా విూ దేశ భక్తి అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎంతకైనా దిగుజారుతారా అంటూ చంద్రబాబుపై అమిత్‌షా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించింది మోసం చేసిందీ చంద్రబాబేనన్నారు అమిత్‌షా. ఢిల్లీ, కోల్‌కతా, కర్నాటకల్లో ధర్నాలు చేయడం కాదు ముందు టీడీపీ కార్యాలయం ముందు దీక్ష చేయాలంటూ బాబుకి సూచించారు”

రాజమహేంద్రవరం (ఆదాబ్‌ హైదరాబాద్‌): పుల్వామా ఉగ్రదాడిని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. సైనికులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఏపీకి 90 శాతం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చామని, తాము నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడంలేదని, చంద్రబాబు పెద్ద మోసకారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అమిత్‌ షా. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సాయం చేసినా.. దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో బుధవారం అమిత్‌ షా పర్యటించారు. తొలుత క్వారీ మార్కెట్‌ సెంటర్‌ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం లాలాచెరువు వద్ద ఉభయగోదావరి జిల్లాల పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ”ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నా. అమరులైన జవాన్లకు ఈ వేదిక నుంచి నివాళులు అర్పిస్తున్నా. ఈ ఐదేళ్లలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. భారత సైనికులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రదాడిని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది. చంద్రబాబుకు పాకిస్థాన్‌ ప్రధానిపై భరోసా ఉంది గానీ, మన ప్రధానిపై లేదు. రాజకీయాలకు కూడా హద్దు ఉండాలి. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోదీ వ్యవహరిస్తున్నారు” అని అమిత్‌షా అన్నారు. అనంతరం లాలాచెరువు వద్ద ఉభయగోదావరి జిల్లాల పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అమిత్‌ షా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాద దాడిని కూడా రాజకీయం చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ, కోల్‌ కతా వెళ్లి ధర్నాలు చేస్తారని కానీ ధర్నా చెయ్యాల్సిందే కాంగ్రెస్‌ పార్టీ ముందేనన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమిత్‌ షా. ఇప్పుడు ప్రధాని మోడీని మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో తెలంగాణలో ప్రచారం చేస్తూ.. మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. దేశభద్రతతకు మోడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత సైనికులకు మోడీ వెన్నుదన్నుగా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని హావిూలను 90 శాతం అమలు చేశామని తెలిపారు. తాము నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చెయ్యకుండా భారీ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి 20 ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఇచ్చిందన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ0.180కోట్లు ఇచ్చామని తెలిపారు. గెయిల్‌, హెచ్పీసీఎల్‌ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని స్పష్టం చేశారు. కంటైనర్‌ కొర్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.4,500కోట్లు పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు. కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని అమిత్‌ షా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలు అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ వల్ల కానీ చంద్రబాబు వల్లకానీ ఒరిగేదేవిూ ఉండదని అమిత్‌ షా చెప్పుకొచ్చారు. చంద్రబాబు, జగన్‌లతో ఏపీ అభివృద్ధి జరగదన్నారు అమిత్‌ షా. టీడీపీ, వైసీపీలు వారి కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాయని.. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలంటూ నిప్పులు చెరిగారు. బీజేపీతోనే ఆంధ్ర అభివృద్ధి చెందుతుందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు షా. చంద్రబాబుకు పాక్‌ ప్రధానిపై ఉన్న నమ్మకం.. మన ప్రధానిపై లేదన్నారు. ఉగ్రదాడిని కాంగ్రెస్‌ రాజకీయం చేయాలని చూస్తోందని.. రాజకీయాలకు కూడా హద్దు ఉండాలి.. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు బీజేపీ అధ్యక్షుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here