మనమంతా ప్రజా సేవకులం

0

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పనితీరు

  • నిర్ణయాలను ఖచ్చింతగా అమలు చేయాలి
  • ప్రజా సమస్యలల్లో ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వాలి
  • రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పథకాలు
  • అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దు
  • కలెక్టర్ల సదస్సులో సిఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

అమరావతి

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలన్నారు. సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని చేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరు తాయన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వివిధ జిల్లాల నుంచి వచ్చి కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here