అవకాశం కోసం ఎదురుచూపు…

0
  • ప్రధాని పదవిపై కెసిఆర్‌ ఆసక్తి…
  • చెప్పకనే చెపుతూ సంకేతాలు…
  • పెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో మంతనాలు…

ఏమో గుర్రం ఎగరావచ్చు.. అవకాశమొస్తే ఎందుకు కాదనాలి… దేశ ప్రధాని అంటే మామూలు విషయమే కాదు..అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునేందుకు అందరూ తహతహలాడుతున్నారు.. దేశ రాజకీయాల్లో తెటిఆర్‌ఎస్‌ పార్టీ గెలిచే సీట్లే ప్రధానం కావచ్చు.. పదిసీట్లతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.. అందుకే అందరిని ఏకం చేసే పనిలో పర్యటనలు ప్రారంభించారు కెసిఆర్‌.. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌కు అనుకున్నన్నీ సీట్లు రాకపోతే అప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయి. ప్రాంతీయ పార్టీల మద్దతు వారికి ఇవ్వడం కాదు. వారి మద్దతే మాకు ఇవ్వమని అడుగుతాము.. మా ప్రాంతీయ పార్టీల పెడరల్‌ ఫ్రంట్‌ నుంచే ఒక్కరికి అవకాశం ఇస్తాం..అందరూ ఒప్పుకుంటే ప్రధాని పదవిని స్వీకరించేందుకైనా తాము ఓకేలా అన్నట్లు ఎవరికి వారు అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.. ఎప్పటికి ఉత్తరాది వారే దేశాన్ని పాలిస్తున్నారు.. దక్షిణాది వారికి గతంలో ఎప్పుడో అవకాశం ఇచ్చారు. మళ్లీ పట్టించుకునే వారే కరువయ్యారు.. అందుకే దక్షిణాది రాష్ట్రం నుంచే దేశానికి ఈ సారి ప్రధాని కావాలి. దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాలలో అంతా చాతుర్యత, చాణక్యత ఎవరికి ఉందో వారే ప్రధాని అవుతారు. అనుకున్న ప్రకారం అన్ని కలిసొస్తే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు కెసిఆర్‌ కూడా సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు వారి పార్టీ నాయకుల నుంచి వినపడుతున్నాయి..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

దేశ రాజకీయాల్లో ఏం జరగపోతోంది.. ఇన్ని రోజులు అధికారంలో ఉన్న బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేదా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ప్రధాని పదవిని అధిష్ఠిస్తుందా అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారుతుంటే రెండు పార్టీలను కాదని ఈ సారి ఎన్నికల్లో పెడరల్‌ ఫ్రంట్‌ దేశ ప్రధాని పదవిని దక్కించుకుంటుదనే ప్రాంతీయ పార్టీల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాజకీయమంటేనే మాటలతో, మాయలతో నడిచేది. అందుకే అందులో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరనే నానుడికి తగ్గట్టుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేస్తున్న గులాబీ బాస్‌ కెసిఆర్‌ కేంద్రంలో మాత్రం మద్దతు ఇచ్చేందుకైనా, తీసుకునేందుకైనా సిద్దమవుతున్నాడు. అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలని, ఒకవేళ కాంగ్రెస్‌కు తమ అవసరం ఉంటే బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కెసిఆర్‌ సిద్దమవుతున్న తీరును టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు బహిర్గతపరుస్తున్నారు. మద్దతు ఇవ్వడమో, తీసుకోవడమో ఉంటుందీ కాని ప్రధాని అవకాశాన్ని మాత్రం కాంగ్రెస్‌కు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో తమ అధికారాన్ని నిలుపుకోవాలని బిజెపి విస్తృతంగా ప్రయత్నిస్తుంటే ఆ పార్టీని అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలు ఎవరి పంథాలో వారు ఉన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్నదీ కెసిఆర్‌ లక్ష్యమని, అందుకే అందరిని ఏకం చేసే దిశగా పర్యటనలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఏకంకాగానే అందులో ఎవరికో ఒకరికి ప్రధాని కుర్చీ దక్కాలనే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బిజెపి మినహాయిస్తే ఇంక కాంగ్రెస్‌ ఒక్కటి ఉంటుందీ. ప్రాంతీయ పార్టీల మద్దతు లేనిదీ అదీ అధికారంలో రానేరాదు. అందుకే అందివచ్చిన అవకాశాన్ని వారికి అనుగుణంగా వాడుకునేందుకు కెసిఆర్‌ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

చర్చలకు ఫెడరల్‌ ఫ్రంట్‌ సిద్దం..

కాంగ్రెస్‌తో చర్చలకు ఫెడరల్‌ ఫ్రంట్‌ సిద్దంగా ఉందని టిఆర్‌ఎస్‌ శ్రేణులు చెపుతున్నప్పటికి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వారు మద్దతు ఇస్తారో, లేదో అన్నదీ ఇప్పుడు ప్రధాన అంశంగా మారిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని పీఠం కోరుకోకుండా తమకు మద్దతు చేస్తానంటే ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నాయని తెలుస్తోంది. బిజెపితో విరక్తి చెందామని పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రకటిస్తున్నారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, డిఎంకే, టిఆర్‌ఎస్‌ లాంటి ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలోనే సీట్లు గెలుచుకోనున్నట్లు చెపుతున్నారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు కూడా రావని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌కు రెండువందల సీట్లు గెలిస్తే డిఎంకే లాంటి కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరతాయన్నారు.. అప్పుడు అత్యధిక సీట్లు సాధించిన రాష్ట్రాలు చెప్పినట్టుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెపుతున్నారు..

దక్షిణాది రాష్ట్రాల్లో కెసిఆర్‌ ప్రధానికి అర్హుడు..

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని పదవికి సత్తా నాయకుడు కెసిఆర్‌ననే ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో దేవేగౌడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చని, ఆయన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉండడంతో వారు ప్రధాని పదవిపై ముందుకు రాకపోవచ్చనే తెలుస్తోంది. కేరళ సిఎం విజయన్‌ స్వంతంగా ఏలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఆదేశాల మేరకు ఆయన పనిచెయ్యాలి. వారి సిద్దాంతాలను కాదని ఆయన ముందుకు రాలేడు. తమిళనాడు స్టాలిన్‌ బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్దతు అని ప్రకటించారు. ఆయన వీరితో జతకలిసే అవకాశమే లేదు. ఇంకా పోతే ఎపీలో జగన్‌ ఉన్నా ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఆయన ముందున్న ప్రధాన ఆశయం. ఎపీకి చెందిన మరోనేత చంద్రబాబునాయుడు మొదటి నుంచి కాంగ్రెస్‌ కూటమితో కలిసే పనిచేస్తున్నారు. బాబు కూటమిలో కలిసే అవకాశమే లేదు. దక్షిణాది నేతలే ప్రధాని కావాలని కోరితే ఇంకా మిగిలిందీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌. కెసిఆర్‌ ఫ్రంట్‌ పెట్టినప్పటి నుంచి జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడాలని చెపుతూ వస్తున్నారు కాని ఈ మధ్య నుంచే దక్షిణాది ప్రాంతం వాడే దేశ పగ్గాలు కావాలని తెరమీదకు తీసుకురావడమే అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తుంది. అవకాశం కలిసోస్తే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు కెసిఆర్‌ సిద్దమైపోతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్‌ ఆశ, ఆశయం ఎంత వరకు నేరవేరుతాయో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here