ఓటింగ్‌ ప్రశాంతం – ఇబ్బందులు యథాతథం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాం తంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎం లలో నిక్షిప్తమయ్యింది. ఈ ఎన్నికల్లో సాయం త్రం 4 గంటల వరకు 67 శాతం నమోదైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇసి దీనిని ధృవీకరించాల్సి ఉంది. చిల్లరమల్లర ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13 సమ స్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌ ముగియగా.. మిగతా నియోజ కవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే ఆ సమయం వరకూ క్యూలై న్లలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియో గించుకొనే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11న తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 11న ఉదయం కౌంటింగ్‌ మొదలై మధ్యాహ్నానికి ఫళితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయన్న ప్రశంసతోపాటే ఆనవాయితీగా వచ్చే సమస్యలపై దృష్టిపెట్టలేకపోయిందన్న విమర్శను ఎన్నికల సంఘం మూటగట్టుకుంది. మొదటి గంట నుంచే ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. యువ ఓటర్లలో నవ్యోత్సాహం కొట్టవచ్చినట్టుగా కనిపించింది. తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువత ఉబ్బితబ్బిబ్బయింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువ ఓటర్లు ఆసక్తిగా క్యూలు కట్టారు. అనేకులు వివిపాట్‌ ఏర్పాటుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటువేసే బూత్‌లో లైటింగ్‌ సరిగాలేక ఇబ్బంది పడ్డామని చాలా మంది సీనియర్‌ సిటిజన్‌లు కంప్లయింట్‌ చేశారు. కాగా తొలి గంటలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్నిచోట్ల ఓటు లేక ప్రజలు ఆందోళనకు దిగారు. నగరంతో పాటు పలు జిల్లాల్లో ఓటరు కార్డున్నా జాబితాలో ఓటు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. ఉప్పల్‌ నియోజకవర్గం 10వ డివిజన్లో గందరగోళం నెలకొంది. పోలింగ్‌ కేంద్రం 297, 297ఏ పరిధిలో ఓటర్‌ కార్డులున్నా లిస్ట్‌లో పేరు లేకపోవటంతో వందల మంది ఓటర్లు ఓటు వేయకుండానే తిరిగారు. దీనిపై రిటర్నింగ్‌ అధికారిని కలసినా ఫలితం లేదని ఓటర్లు చెబుతున్నారు. గత ఎన్నికలతో పాటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఓట్లు వేశామని ఓటర్లు తెలిపారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారుల నుంచి సరైన సమాధానం లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 40 వేల ఓట్లు గల్లంతయ్యాయి. జాంబాగ్‌ డివిజన్‌, జూబ్లీహిల్స్‌లో కూడా భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. తమ ఓట్లు గల్లంతవ్వడంతో పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట కాలనీలో 50 మంది ఓట్లు గల్లంతయ్యాయి. తమకు ఓటు హక్కు కల్పించాలంటూ ఎంఆర్‌ఓ పరమేశ్వర్‌ను బాధితులు నిలదీశారు. గుత్తా జ్వాల గగ్గోలు… తన ఓటు గల్లంతు కావడంపై గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాలో పేర్లు లేనప్పుడు ఎన్నికలు పారద్శకంగా ఎలా జరుగుతాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా జ్వాలా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని జ్వాలా ట్వీట్‌లో ప్రశ్నించారు. కాగా బ్యాట్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధూ, కూడా ఓటువేశారు. మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రావులు శుక్రవారం ఉదయమే పోలింగ్‌ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హరీష్‌ రావు సిద్ధిపేటలోను, జగదీష్‌ రావు సూర్యాపేటలోను ఓటేశారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మెహదీపట్నంలో ఓటేశారు. వరంగల్‌లో కడియం శ్రీహరి ఓటేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here