ఓటింగ్‌ సరళి మాకే అనుకూలం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అధికారం నిలబెట్టుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చింతమడకలో తన సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని, భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రభంజనం సృష్టిస్తామని దీమాగా చెప్పారు. ఈసారి పోలింగ్‌ శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించు కోవాలన్నారు. ప్రభుత్వ అనుకూల పవనాలు చాలా బాగా వీస్తున్నాయి. మేము ముందు నుంచి చెబుతున్నట్టుగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మాకు ఎటువంటి అనుమానం లేదు మళ్లీ ప్రజా అనుకూల ప్రభుత్వమే వస్తుంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు సాయంత్రం విూరే చూస్తారు. ఈసారి పోలింగ్‌ శాతం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్‌లో భారీగా పోలింగ్‌ నమోదవుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార’ని కేసీఆర్‌ చెప్పారు. ఇకమరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ జోరుగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడానికి ఉత్సాహంగా కదిలి వచ్చారు. టీఆరెస్‌ ఎంపీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్‌ బూత్‌లో కవిత ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేయడం విశేషం. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి ఓట్లు వేశారు. మరోవైపు ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుని తమ భవిష్యత్తును తామే నిర్దేశిరచుకోవాలని రాష్ట్రమంత్రి కేటీఆర్‌ కోరారు. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు. ఓటు వేయకుండా, మనకు కావాల్సిన నాయకున్ని ఎంచుకోకుండా, తర్వాత నిందిస్తే లాభం లేదని, ప్రజలంతా బయటకు వచ్చి తమ ఓటును వినియోగించు కోవాలని మంత్రి కోరారు. పెద్ద ఎత్తున ఓట్లు వేసి, నచ్చిన నాయకున్ని, పార్టీని ఎన్నుకోవాలన్నారు. విూ భవిష్యత్తును విూరే నిర్దేశిరచుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కూనా శ్రీశైలంగౌడ్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here