Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

వాల్టా చట్టానికి తూట్లు … విచ్చలవిడిగా బోర్లు

జూబ్లీహిల్స్ ( ఆదాబ్ హైదరాబాద్ )జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ మండలం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బోర్లు వేస్తూ వాల్టా చట్టానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. మండల పరిధిలోని శ్రీనగర్ కాలనీలో రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో బోర్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలో బోర్ వేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాల్టా చట్టం ప్రకారం 4.1/2 ఇంచు బోరు మండల తాసిల్దార్ అనుమతి తో వేసుకోవాల్సి ఉంటుంది. వాల్టా చట్టం నిబంధనలు సులువుగా ఉన్నా వాటిని  సామాన్య ప్రజలు ఉపయోగించుకోకుం డా దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే, ఎవరైనా ఎమ్మార్వో కార్యాలయం నుండి  అనుమతులు పొందకుండా బోర్లు వేస్తే కచ్చితంగా సమాచారం తీసుకుని ఆర్ ఐ వెళ్లి పనులు జరగకుండా నిలిపివేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బోర్లు, బోరు బండి ని సీజ్ చేసి  లక్ష రూపాయల మేర జరిమానా విధించే ఆకాశం ఉంది. ఇంటి గురించి వేసిన బోర్లను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించకూడదు. అలా ఎవరైనా ఉపయోగించుకుంటే కట్టిన చర్యలు చేపడతారు. మండల పరిధిలో అధికారుల అనుమతులు లేకుండా యధేచ్చ గా బోర్లు వేస్తున్న చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ వారిపై ఎలాంటి  చర్యలు పోకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్థానికులకు ఆగ్రహం కలిగిస్తోంది. నిబంధనలు అతిక్రమించే వారు ఎంతటి వారైనా మండల తహసీల్దార్ కఠిన చర్యలు తీసుకోవాల్సి  ఉంటుంది. కాగా ఖైరతాబాద్ మండల పరిధిలో నిబంధనలను  ఉల్లంఘిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా  మండల అధికారులు ఎలాంటి అనుమతులు పొందకుండా బోర్లు వేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.Attachments area

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close