అరుదైన తరహా ఈవెంట్‌ సంస్థ వోగ్‌ సిటీకి శ్రీకారం… తల్లీ బిడ్దలు ర్యాంప్‌ వాక్‌  

0
హైదరాబాద్, అక్టోబరు 11, 2018: విభిన్న రకాల ఈవెంట్‌ మనేజ్‌మెంట్‌ సంస్థలకు నిలయమైన నగరంలో అత్యంత అరుదైన ఈవెంట్‌ కంపెనీ శ్రీకారం చుట్టుకుంది. వోగ్‌ సిటీ పేరుతో నగరానికి చెందిన ప్రముఖ మహిళా వ్యాపార వేత్తల బృందం (నీలిమ, ఐశ్వర్య, దీపిక, అను మరియు మని)ఈ విభిన్న తరహా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని రూపకల్పన చేయడం విశేషం. 
 
లోగో ఆవిష్కరణ…
అరుదైన ఈవెంట్‌ సంస్థ అయిన వోగ్‌ సిటీ ఉద్దేశ్యాలను, లక్ష్యాలను ప్రతిబింబించేలా ఒక చక్కని లోగోను రూపొందించారు. దీనిని గురువారం కొత్తగూడలోని గూగుల్‌  సౌండ్‌ గార్డెన్‌ కేఫ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అట్టహాసంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ఈవెంట్‌ రంగ ప్రముఖులు, మోడల్స్, పేజ్‌ త్రీ సోషలైట్స్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మామ్‌ అండ్‌ మి పేరుతో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. దాదాపు 15 మంది దాకా తల్లీ బిడ్దలు ర్యాంప్‌ వాక్‌ చేశారు. 
 
వోగ్‌ సిటీ…ఓ వెరైటీ…
ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ నీలిమ మాట్లాడుతూ తమ వోగ్‌ సిటీ ప్రత్యేకతలను వివరించారు. ఇప్పటిదాకా ఏ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థా చేయని తరహాలో దీనిని పూర్తిగా చిన్నారుల కార్యక్రమాలకే పరిమితం చేయనున్నట్టు ఆమె తెలిపారు. ఇది అంతర్జాతీయ కాన్సెప్ట్‌ అనీ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్, గ్లోబల్‌ కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌లతో పాటు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు గాను టాలెంట్‌ అవార్డ్‌ షో కూడా నిర్వహించనున్నామన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా కుకింగ్‌ కాంటెస్ట్‌ ఫర్‌ కిడ్స్‌లాంటివి నిర్వహిస్తామన్నారు. అలాగే గర్భధారణలో ఉన్న అందాన్ని, అనుభూతిని నిరూపించేలా వుడ్‌ బీ మమ్‌ బ్యూటీ పేజెంట్, డెలివరీ తర్వాత కూడా అందంగా కనపడడం అసాధ్యం కాదని నిరూపించేలా మరో బ్యూటీ పేజెంట్‌ నిర్వహించే యోచన ఉందన్నారు. 
 
కేరింతల కేలండర్‌…
కిడ్స్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ చేస్తూ, మామ్‌ అండ్‌ మి కేలండర్‌తో రానున్నామని, ఈ కేలండర్‌ని 2019లో దీనిని ఆవిష్కరించనున్నామని చెప్పారు. తండ్రీ పిల్లల మధ్య అనురాగాన్ని కూడా వివరిస్తూ  డాడ్‌ అండ్‌ మి లేదా పప్పా అండ్‌ మి పేరుతో ఒక వేదిక చేస్తున్నాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here