వీవీ ప్యాట్‌ చీటీలను పూర్తిగా లెక్కించాలి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు పూర్తిగా ట్యాంపరింగ్‌, మ్యాని ప్యులేట్‌ అయ్యాయని, అన్ని నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్‌ చీటీలు పూర్తిగా లెక్కించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఫలితాల అనంతరం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ విూడియాతో మాట్లాడా రు.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగా ణలో ఎన్నికల ఓటర్ల జాబితాను కుదించారని విమర్శిం చారు. ఇప్పటికే తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌, కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వంగా వినతిపత్రం ఇచ్చామన్నారు. ఈవీఎంలో పడిన ఓట్లు ఒక విధంగా వీవీ ప్యాట్‌ చీటీల సంఖ్య మరో విధంగా ఉన్నాయని అనుమానం వ్యక్తంచేశారు. ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని, అందుకే పేపర్‌ చీటీలు లెక్కించాలని కోరుతున్నట్టు చెప్పారు. ఎన్నికల సంఘం ఆ పని చేయపోతే ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఘటన బ్లాక్‌ డేగా నిలిచిపోతుందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కలను చెప్పేందుకు ఈసీ ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌ చీటీలు లెక్కచేయనప్పుడు ఆ యంత్రాలు ఇక ఇందుకని నిలదీశారు. ఎవరి ప్రయోజనం కోసం ఈసీ పనిచేస్తోందన్నారు. తెలంగాణలో అధిక రాజకీయ పార్టీలు వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించమంటే ఎందుకు ఆపుతున్నారని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here