ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అవ్వాలంటే.. వీటిని తీసుకోవాలి

0

మన శరీరం మొత్తం బరువులో రక్తం బరువు దాదాపుగా 7 శాతం వరకు ఉంటుంది. ప్రతి వ్యక్తిలో దాదాపుగా 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. అయితే ఆడ, మగ, బరువు, ఎత్తు, ఆరోగ్య స్థితి వంటి అనేక అంశాల వల్ల రక్తం పరిమాణం మారుతుంది. ఇక మన శరీరంలో అనేక ముఖ్యమైన పనులు సజావుగా జరిగేందుకు రక్తం అవసరం. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేర వేసేందుకు రక్తం పనికొస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూడడంలోనూ రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రక్తం సరిగ్గా సరఫరా అవకపోతే మనకు అనేక సమస్యలు వస్తాయి.

శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోతే ఆకలి లేకపోవడం, పాదాలు, చేతులు మొద్దుబారిపోయి స్పర్శ లేనట్లు అనిపించడం, జీర్ణ సమస్యలు రావడం, త్వరగా అలసి పోవడం, చర్మం రంగు మారడం, రక్త నాళాలు ఉబ్బిపోవడం, వెంట్రుకలు, గోర్లు విరిగిపోయినట్లు అవడం తదితర సమస్యలు వస్తాయి. అయితే పలు ఆహారాలను నిత్యం తీసుకుంటే దాంతో రక్త సరఫరాను మెరుగు పరుచుకోవచ్చు.

రోజూ తగినంత నీరు తాగాలి. నీటి వల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్‌ను రోజూ తినాలి. వీట్లిలో ఉండే విటమిన్ ఎ, బి, సి, ఇ, మెగ్నిషియం, ఐరన్‌లు మన శరీరంలో రక్త సరఫరాను పెంచుతాయి. అలాగే రోజూ గ్రీన్ టీ తాగాలి. ఇది రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది.

వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకున్నా రక్త సరఫరాను మెరుగు పరుచుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. ఇవే కాకుండా అశ్వగంధ, డార్క్ చాకొలెట్లు, ఎండు కారం, పొద్దు తిరుగుడు విత్తనాలు, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, పుచ్చకాయలు, అవకాడోలు తదితర ఆహారాలను తరచూ తీసుకుంటుంటే రక్తం బాగా తయారవుతుంది. అలాగే రక్త సరఫరా కూడా సరిగ్గా జరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here