టీ ఆర్‌ఎస్‌లో ప్రకంపనలు

0

శ్రీధర్‌ యాలాల – ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్‌ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి సోమవారం ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు కేసీఆర్‌ ను తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తారు. బీజేపీలో రాజకీయంగా అణగ దొక్కబడిన తర్వాత 2001లో కేసీఆర్‌ పిలిచి సంగారెడ్డి టికెట్‌ ఇచ్చారని చెప్పారు. 2004లో టిఆర్‌ఎస్‌ టికెట్‌ పై పోటీచేసి గెలిచి కేసీఆర్‌ వల్ల రాజకీయ పునరుజ్జీవం పొందానని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబంతో తనకు ఎలాంటి రాజకీయ వైరం లేదని తేల్చి చెప్పారు. విభేదం అంతా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుతోనే అని చెప్పారు. అసలు తనను జైల్లో పెట్టించింది హరీష్‌ రావే అని చెప్పారు. హరీష్‌ కన్నా కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని, హరీష్‌ రావు బ్లాక్‌ మెయిలర్‌ అని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్‌ రావు ఉనికి కోసమే నన్ను పాస్‌ పోర్టు కేసులో ఇరికించి జైల్లో పెట్టించాడని తెలిపారు. జైల్లో పెట్టడంవల్లే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యానని, జైలుకు వెళ్లడం వల్లే నాకూతురు జయారెడ్డి రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిందని తెలిపారు. ఒకవైపు కేసీఆర్‌ ను పొగుడుతూనే మరోవైపు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు జగ్గారెడ్డి. నాకు కష్టం వస్తే పార్టీ ఆదుకుంటుందన్న విశ్వాసం పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని.. పార్టీ మారే ఆలోచన లేదని స్పృష్టం చేశారు. రాహుల్‌ అంటే నాకు పిచ్చిఅని, ఆ ముఖంలో చరిష్మా ఉందని, ప్రజలకోసమే గాంధీ కుటుంబం బతుకుతోందని జగ్గారెడ్డి సొంత పార్టీపైనా తన అభిమానం చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైన తాను ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు చాలా నిజాయితీ కలిగిన నేత అని పొగడ్తలు కురిపించారు. అదే సమయంలో ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు

గుప్పించారు. లాబీయింగ్‌ చేసేవాళ్లకే తమ పార్టీలో పదవులు ఉంటాయని ఆరోపణలు చేశారు. తనలాంటి వాళ్లకు లాబీయింగ్‌ చేసేవాళ్లు లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి తనకు లేదని జగ్గారెడ్డి చెప్పారు. ఇక్కడ ఇబ్బంది పడుతున్న నాయకులకు తమ పార్టీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ భరోసా ఇవ్వాలని చెప్పారు. కాగా, జగ్గారెడ్డి తెరాస గెలిచిన కొత్తలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నాలుగేళ్ల పాటు కేసీఆర్‌ పాలన గురించి మాట్లాడనని చెప్పారు. తన నియోజకవర్గం అభివ ద్ధి కోసం వారి అవసరం ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు కేసిఆర్‌, కేటిఆర్‌ ల పై ప్రశంసలు కురిపించారు. అదే సమయం లో హరీష్‌ రావు పైన విమర్శలు గుప్పించారు.కేసిఆర్‌ హరీష్‌ రావు ను పక్కన పెట్టడం, రాష్ట్రంలోనే కాక ఉమ్మడ్డి మేదక్‌ జిల్లాలో కూడా హరీష్‌ రావు కి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జగ్గా రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరడానికి మార్గం సుగమైందని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్న గజ్వేల్‌ లో ఒంటెరు ప్రతాప్‌ రెడ్డి, ఈ రోజు జగ్గా రెడ్డి ఇలా కాంగ్రెస్‌ నాయకులు టిఆర్‌ఎస్‌ లో చేరడానికి క్యూ కడుతున్నారు. అదే సమయం లో టిఆర్‌ఎస్‌ లోని సీనియర్‌ నాయకులు అయిన హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ లాంటి నాయకుల పరిస్తితి ఆగమ్య గోచరంగా తయారయింది. మొదటినుండి పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని, నిన్న మొన్న వలస వొచిన నాయకులకు ఆగ్రా తాంబూలం ఇవ్వడం వలన పార్టీ లోని సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు లోలోపల మదన పడుతున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్న కార్యకర్తలు వలస వొచ్చిన వారితో ఇమడలేకపోతున్నారు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే త్వరలోనే టిఆర్‌ఎస్‌ లో ప్రకంపనలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. టిఆర్‌ఎస్‌ పార్టీ యే ఊపిరిగా పార్టీ ఆవిర్భావంనుంచి ఉన్న సీనియర్లు తాజా పరిణామాలతో బెంబేలెత్తుతునారు. ఒకరకంగా కేసిఆర్‌ తన స్థాయి సీనియర్‌ నాయకులను తప్పించే ప్రయత్నంగానే జరుగుతున్నా పరిణామాలను అంచనా వేస్తునారు. కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి తన కొడుక్కి పోటీ ఉండకూడదనే ఉద్ధేశం తోనే ఆయన పరిపాలనకు ఆటంకాలు స ష్టించకుండా ఉండేందుకే దూరద ష్టితో తీసుకుంట్టున్న చర్యలుగా పలువురు భావిస్తున్నారు. కొడుకు కేటిఆర్‌ కోసం కేసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తునారు. కేటిఆర్‌ కు అందరినీ కలుపుకపోయే తత్వం లేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తరువాత సీనియర్‌ నాయకుల కు విలువ ఇవ్వడం లేదు అని విమర్శనలను ఎదురుకొంటున్నరు. ముఖ్యమంత్రిగా అధికారం చెప్పట్టిన పక్షంలో పార్టీ లో తమ రాజకీయ భవిష్యత్తే శూన్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడధు అని కేసిఆర్‌ తీసుకునే నిర్ణయాల వలన పార్టీ లోనే ప్రతిపక్షం తయారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here