Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలువిద్యస్టేట్ న్యూస్

గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి పరుచుకోవాలి

రేగోడ్ ఆదాబ్ హైదరాబాద్ ప్రజలందరూ భాగస్వాము లై గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రేగోడ్ మండలంలోని టి లింగంపల్లి గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత పనులను వీధుల్లో తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో నిర్దేశించిన పనులన్నీ చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి రక్షించవలసిన బాధ్యత గ్రామ ప్రజలందరిపై ఉందని అన్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ కలెక్టర్ 30 రోజుల ప్రణాళిక  కార్యక్రమంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారని వివరాలు సేకరించారు.  గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించుకోవాలని పరిసరాలు రోడ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు పాడు పడిన ఇళ్లను కూలగొట్టి విషకిటకాలు రాకుండా చేసుకుంటున్నామని అన్నారు. విద్యుత్ సమస్యలు తీర్చుకోవడంతో పాటు వ్రేలాడే విద్యుత్ వైర్లు విద్యుత్ స్తంభాలను సరి చేసుకుంటున్నామని పగటిపూట విద్యుత్ లైట్లు వెలగకుండా ఆన్ స్విచ్వులు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఈ ముప్పై రోజుల కార్యక్రమం ద్వారా మునుపెన్నడు లేని విధంగా గ్రామస్తులు అందరూ కలిసి గ్రామ గ్రామాల రూపురేఖలు మార్చుకుంటామని గ్రామస్తులు వివరించారు. స్పందించిన కలెక్టర్ ముప్పై రోజుల కార్యక్రమం అనేది ఆరంభం మాత్రమేనని దీనిని ఇంకా మెరుగుపరుచుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామల రూపు రేఖలు మార్చుకోవాలని కోరారు. గ్రామాల మధ్య ఇళ్ల మధ్య పోటీ ఉండాలని ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. తమ గ్రామాన్ని తమ ఇంటిని ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఆరు మొక్కలు తప్పనిసరిగా నాటు కోవాల్సిందిగా సూచించారు. మీ గ్రామాన్ని బాగు చేయడానికి అధికారులు అందరూ వస్తున్నారని వారితోపాటు మీ భాగస్వామ్యం తోడైతే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. పరిశుభ్రతలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి కలెక్టర్ చెత్తబుట్టలను  పరిశీలించి పంపిణీ చేసి తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలని అట్టి చెత్త రవాణా సక్రమంగా జరిగే డంపింగ్ యార్డ్ వేయాలని ఆయన సూచించారు. గ్రామంలో మరుగుదొడ్లు అందరి గృహాల్లో ఉన్నాయా అని అడుగగా కొందరు ఇంకనూ నిర్మించుకోలేదని చెప్పగా వంద శాతం మరుగుదొడ్లు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గ్రామ పంచాయతీ చట్టం మే సవరించి ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమైన రెండు నెలల లో మొత్తం పన్నులు సక్రమంగా వసూలు చేస్తే గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు గ్రామంలో డంపింగ్ యార్డ్  మెటీరియా ఉన్నచోట నర్సరీ ఏర్పాటుకై ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని అన్నారు గ్రామ అభివృద్ధి కొరకై ఎన్ ఆర్ ఐ ఇతర దాతల నుండి నిధులు  సేకరించుకోవాలని అన్నారు.అనంతరం కలెక్టర్ గ్రామాల్లో మొక్కలను నాటారు. ఈ సమావేశంలో  జిల్లా పంచాయతీ అధికారి హనొక్ తాహసీల్దార్ చంద్రకళ ఇఓ పిఆర్డి లచ్చాలు. మండల ప్రత్యేక అధికారిణి గ్రామ సర్పంచ్ సుమంత  ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close