విక్రమ్‌ సినిమా కోసం పాట పాడిన శృతి హాసన్‌

0

కమల్‌ గారాల పట్టీ శృతి హాసన్‌ మల్టీ టాలెంటెడ్‌ అన్న సంగతి తెలిసిందే. నటిగా, సింగర్‌గా, ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో విభాగాలలో తన ప్రతిభ కనబరుస్తుంటుంది. తండ్రికి తగ్గ తనయగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన శృతి హాసన్‌ రీసెంట్‌గా విక్రమ్‌ సినిమా కోసం ఓ పాట పాడింది. గిబ్రాన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని షబ్బీర్‌తో కలిసి శ తి హాసన్‌ పాడింది. కదరం కొండన్‌ అంటూ సాగే ఈ పాటకి ప్రియన్‌ లిరిక్స్‌ అందించారు. ఈ సాంగ్‌ ఇటు విక్రమ్‌ అభిమానులతో పాటు శృతి హాసన్‌ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవల సామి 2 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్‌ ప్రస్తుతం తన 56వ సినిమాతో బిజీగా ఉన్నాడు. కదరం కొందన్‌ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందుతుంది. చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ఈ మూవీలో అక్షర హాసన్‌, అభి హాసన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం శృతి హాసన్‌ తన గొంతు సవరించుకోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here