Featuredస్టేట్ న్యూస్

వికారాబాద్‌ కలెక్టర్‌ అవినీతిపై విచారణ జరపండ

ఢిల్లీ జాతీయ లోక్‌ పాల్‌ కమిషన్‌కు ఫిర్యాదు

వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి: వెంకటయ్య

వికారాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖాన్‌ తాసిల్దార్‌ లతో కుమ్ముక్కై అవినీతి అక్రమాలకు పాల్‌ పడు తున్నందున సమగ్ర విచారణ జరిపి చర్య తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య ఢిల్లీలోని జాతీయ లోక్‌ పాల్‌ కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఆయన విలేకరులకు పత్రికా ప్రకటన విడుదల చేశారు పరిగి మున్సిపల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 81 లో 14 ఎకరాల ముప్పై తొమ్మిది గంటల ప్రభుత్వ భూమిని పట్టగా మార్చి నట్లు తెలియజేసారు దాదాపు 25 కోట్లు విలువ చేసే ప్రభు త్వ భూమి 1974 నుంచి ఇప్పటివరకు నలుగురు వ్యక్తులకు చేతులు మారినట్లు ఆయన తెలియజేశారు 1974 కంటే ముందు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రభుత్వ మిగులు భూమిగా ఉందని అన్నారు ఈ విష యమై వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కు అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టిం చుకోలేదని అన్నారు అలాగే పా నా ది దాదాపు 20 గుంటల భూమి 7 కోట్ల విలువ విలువ చేస్తుందని దానిని అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్న కలెక్టర్‌ చర్యలు తీసుకోలేదని అన్నారు పరిగి తాసిల్దార్‌ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని కలుపుకొని రోడ్డు వరకు వెంచర్లను ఏర్పాటుచేసి ఇ ప్లాట్లు విక్రయిస్తున్న చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు వీటిపై అనేకసార్లు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ జాయింట్‌ కలెక్టర్‌ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన చర్య లు లేవని అన్నారు దీంతో వీరిరువురు ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్ముక్కై భూ ములు కబ్జా చేయడానికి సహకరించి అవినీతికి పాల్పడుతున్నారని ఢిల్లీ జాతీయ లోక్‌ పాల్‌ కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు దీనిపై సమగ్ర విచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close