పోటీ చేయను – ప్రచారం చేస్తా: స్పష్టం చేసిన విజయశాంతి

0

★ వారసుల ఎదుగుదల కోసం దూరంగా ఉంచారు

(హైదరాబాద్, ఆదాబ్ హైదరాబాద్):వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, మండలాల వారీగా పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. టీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. కేటీఆర్, కవితల రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటాననే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు పార్టీలను ఒప్పించలేని కేసీఆర్.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని అనడం హ్యాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ అహంకారపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సోనియా కాళ్ల మీద పడి పార్టీని కలిపేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని విమర్శించారు. టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యం అని విజయశాంతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 430 మండలాల్లో ప్రచారం చేస్తానని పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి చెప్పానన్నారు. ప్రచార షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నామని చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here