మరో క్రేజీ బయోపిక్‌ లో విద్యా బాలన్‌

0

బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ కు మొదటి నుంచి విభిన్న కథా చిత్రాలు ఎంచుకునే అలవాటు ఉంది. ఒకవైపు పక్కా కమర్షియల్‌ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు ఆర్టిస్టిక్‌ టచ్‌ ఉన్న సినిమాల్లో కూడా నటించింది. ఈమధ్య బాలీవుడ్‌ లో బయోపిక్‌ ల ట్రెండ్‌ ఊపందుకుంది కదా. ఈ ట్రెండ్‌ ఊపందుకోక మందే సిల్క్‌ స్మిత బయోపిక్‌ లో నటించిన విద్య ప్రస్తుతం ఒక చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. అదొక్కటే కాదు.. తాజాగా మరో క్రేజీ బయోపిక్‌ కు కూడా పచ్చ జెండా ఊపింది.

గణిత మేథావి.. హ్యూమన్‌ కంప్యూటర్‌ గా పేరు తెచ్చుకున్న శంకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘శకుంతలా దేవి’ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అను మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్‌ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఫిలిం మేకర్స్‌ ప్రకటించారు.

ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించిన విద్యా బాలన్‌ ”మ్యాథ్‌ జీనియస్‌ శంకుతలా దేవి పాత్రలో నటించడం ఎగ్జైటింగ్‌ గా ఉంది. అను మీనన్‌.. విక్రమ్‌ మల్హోత్రా తో కలిసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకు రావడం థ్రిల్లింగ్‌ గా ఉంది. ఒక చిన్న టౌన్‌ అమ్మాయి తన టాలెంట్‌ తో ప్రపంచాన్ని ఎలా తనవైపుకు తిప్పుకుందనేది మీరు చూడబోతున్నారు.” అంటూ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here