సంక్షోభంలో విద్యా వ్యవస్థ వికారాబాద్‌ రూరల్‌

0

(ఆదాబ్‌ హైదరాబాద్‌) :

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిం దని ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండవ తరగతి పాఠ్యాంశం లో ఉన్న పదాలను చదవలేక పోతున్నారని బాలల హక్కుల పరిరక్షణ వేదిక విద్య సామర్ధ్యాల ఉద్యమకర్త ధనసిరి ప్రకాష్‌ అన్నారు శుక్రవారం వికారాబాద్‌ పట్టణంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశము లోని 596 జిల్లాలో ఉన్న గ్రామీణ పాఠశాలలను సందర్శించినట్లు ఆయన తెలియజేశారు దాదాపు 16 వేల గ్రామీణ పాఠశాలల్లో సర్వే నిర్వహించిన ప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల సామర్థ్యం పూర్తిగా సర్వేలో వెల్లడి అయ్యిందన్నారు 2018 సంవత్సరానికి ఆ సార్‌ విద్యా ప్రమాణాలపై సర్వే నిర్వహించి నివేదిక తయా రు చేసిందని అన్నారు దా దాపు 5.53 లక్షల విద్యా ర్థులతో సర్వే నిర్వహించి విద్య ప్రమాణాలను గుర్తిం చినట్లు చెప్పారు ఎని మిది తరగతి చదువుతున్న 16 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులను సర్వేలో తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు వారు చదువుతున్న తరగతి పాఠ్యాంశం కాకుండా రెండవ తరగతి చదువుతున్న పాఠ్యాంశాన్ని కూడా చదవలేక పోతున్నారని అన్నారు ఈ విషయాన్ని జాతీయ మానవ వనరుల శాఖ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహించిన సర్వేలు ఇవే ఫలితాలను వెల్లడిస్తున్నాయని అన్నారు ఆయా రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విద్య సామ ర్ధ్యాలు పెరగడం లేదని అన్నారు ఆయా రాష్ట్రాల్లో విద్యాశాఖ నిర్లక్ష్య ధోర ణితో వివరిస్తున్నట్లు స్పష్టమవుతుందని దీనికి ఆయా పాఠశాల విద్యా శాఖ పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు దేశంలోని పాఠశా లలో విద్యా ప్రమాణాలు పడిపోతున్న కారణంగా దేశంలో సామా జిక అసమానతలు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయా ప్రభుత్వాలు నైతిక బాధ్యత తీసుకొని ప్రతి ఏడాది జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న విద్యా ప్రమా ణాలపై పూర్తి స్థాయిలో చర్చించవలసిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం తెలం గాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రభుత్వ పాఠ శాల ల్లో దిగజారిన ప్రతి విద్యా ప్రమాణాలపై చర్చించవలసిన అవసరం ఉందని అన్నారు ప్రతి ఏడాది అ సర్‌ వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలపై సర్వే నిర్వహించి ఆయా ప్రభుత్వాలకు నివేదికలు అందించి సూచనలు చేసి పరిగణలోకి తీసుకోవాలని సూచిం చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదని అన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయా రాష్ట్రాల్లో విద్యాభివద్ధి తో పాటు దేశాభివద్ధి వెను కబడే ప్రమాదం ఉందని ప్పటికైనా ప్రభుత్వాలు ప్రభుత్వంతో పనిచేస్తున్న విదా శాఖ దాని పరిధిలోని ఉపాధ్యాయులు నైతిక బాధ్యత ప్రభుత్వ పాఠ శాలల్లో సామర్థ్య విద్య అందించడానికి కషి చేయాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here