Featuredరాజకీయ వార్తలు

ఉత్తమ్‌కు ఓటమి దెబ్బ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు?

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాదిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ను ఈ బాధ్యతల నుండి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాదిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ను ఈ బాధ్యతల నుండి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కొనసాగించారు. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడ పూర్తైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కొనసాగించారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. కానీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌ పదవిలో మార్పు ఉండే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో రెండో దఫా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్ల పాటు పార్టీని సమర్థవంతంగా నడపాల్సిన అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.. టీఆర్‌ఎస్‌ దూకుడును తట్టుకొంటూ కాంగ్రెస్‌ పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకులు అవసరం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌గా మధుయాష్కీ లేదా రేవంత్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.మధుయాష్కీ గతంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.ఎఐసీసీ కార్యదర్శిగా కూడ యాష్కీ పనిచేస్తున్నారు.యాష్కీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఈ తరుణంలో మధుయాష్కీ లేదా రేవంత్‌ రెడ్డిలలో ఎవరో ఒకరికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారంలో ఉంది.

తెలంగాణ శాసనసభలో కూడ కాంగ్రెస్‌ పార్టీ ఉనికి లేకుండా చేయాలనే వ్యూహంతో కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.ఇదంతా ఆ పార్టీ వర్గాల్లో కొంత గందరగోళానికి తావిస్తోంది. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమైంది.. రాజకీయాల్లో అవసరమైన సమయాల్లో అవసరానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలను ద ష్టిలో ఉంచుకొని పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పార్టీలో నూతనోత్తేజాన్ని నింపే నాయకుడికి పీసీసీ పగ్గాలను ఇచ్చే అవకాశం ఉంది.

ఓవర్‌ కాన్షిడెన్సే కొంపముంచింది: కోదండ… ఓవర్‌ కాన్పిడెన్స్‌ కూటమి కొంపముంచిందని టీజేఎస్‌ చీఫ్‌ ప్రోఫెసర్‌ కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. కూటమి తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధికులు కొత్త వారు కావడం కూడ నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఓటమిపై కోదండరామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారానికి సమయం సరిపోదని తాను చెప్పినా కూడ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారానికి 15 రోజులు సరిపోతోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారని, 3 వారాలు సరిపోతోందని టీడీపీ చీఫ్‌ ఎల్‌. రమణ అభిప్రాయపడ్డారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌ ప్రచారశైలి గురించి మీకు తెలియదని తాను చెప్పినా కూడ కూటమిలోని పార్టీలు పెడచెవిన పెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమిలోని పార్టీల మధ్య పొత్తుల చర్చలను ముందుగా తేలిస్తే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాన్ని కోదండరామ్‌ వ్యక్తం చేశారు. పీపుల్స్‌ ప్రంట్‌ అజెండా బాగున్నా కూడ ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో సక్సెస్‌ కాలేకపోయినట్టు ఆయన చెప్పారు. ఇంటింటికి తీసుకెళ్లలేకపోయామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమా రావడంతో కూటమి నేతలు, అభ్యర్థులు ఎక్కువగా పెద్ద సభలతోనే సరిపెట్టారని చెప్పారు.క్షేత్రస్థాయిలో కూటమిని తీసుకెళ్లలేకపోయినట్టు చెప్పారు. ప్రచారం ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు.మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువగా కొత్తవారే కావడం కూడ నష్టం చేసిందన్నారు. కేసీఆర్‌ తనపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చుకొన్నారని కోదండరామ్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కీలక నేతలను ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకోవాలనే విషయమై సరిగా ప్లాన్‌ చేసుకోలేకపోయినట్టు కోదండరామ్‌ ఒప్పుకొన్నారు. గద్దర్‌, మందక ష్ణమాదిగ లాంటి వాళ్లను రాహుల్‌ గాంధీ సభలకే పరిమితం చేశారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌, చంద్రబాబునాయుడు మధ్య ఏం సంబంధాలున్నాయో తెలియదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి తనకు రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి తనకు అలాంటి ఆఫర్‌ రాలేదని ఆయన తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close