Featuredరాజకీయ వార్తలు

వాడుకునే రాజకీయం..

  • అంతుచిక్కని కెసిఆర్‌ వ్యూహం
  • అవకాశాన్ని పట్టి మారే మాటలు..
  • ముందు దూరం, అపై దగ్గరికి..
  • తిట్టినవారే పొగిడేలా చర్యలు..

రాజకీయం, అధికారం అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రజలను, ఉద్యోగులపై కఠినంగా ప్రవర్తిస్తూ, వారి దృష్టిలో చెడ్డవారీగా గుర్తింపు తెచ్చుకున్న ఒక క్షణంలో అధినేతలు తీసుకున్న నిర్ణయాలే ఎన్నో మార్పులకు ప్రధాన కారణమవుతాయి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయం ఎక్కువశాతం అలాగే ఉంది. నెలలు, సంవత్సరాల నుంచి పేరుకుపోతున్న ఎన్నో ప్రజల సమస్యలు ఉంటాయి. వాటిని నేరవేర్చాలనే ఆలోచన వస్తుందా, లేదా అనేది పక్కన పెడితే, ప్రజల ఆందోళనలు, సమస్య తీవ్రతను బట్టి అధినాయకులు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో జరుగుతుందీ అదే. ఇక్కడ పాలకులు విధానం కూడా ప్రతిపక్షాలకు కాదు కదా, ప్రజలకు కూడా అంతుబట్టకుండా ఉంది. అందరూ ముక్తకంఠంతో ఏకమై సమస్యపై స్పందించినా పట్టించుకోరు కాని అంతా సమస్య మరిచిపోయాక స్పందిస్తారనే ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో బాగా నానుతుందీ..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌

అధికారంలో ఉన్న పాలకుల ఆలోచన ఎవరికి అంతుచిక్కకుండా ఉంటుంది. కొంతమంది అధికారంలో ఉన్న నాయకులు సమస్యలను విస్మరిస్తూ ప్రజల అవసరాలను గాలికొదులేస్తారు. ఒక సమస్యను ప్రజల్లో నానేలా చేస్తారు, ప్రజలకు మాత్రం ఏదో చేయబోతున్నామనే లీకులు ఇస్తారు. చిట్టచివరకు మాత్రం మేం అలా ఎందుకు చేస్తాం అంటూ అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపును ఇస్తారు. తెలంగాణ సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలకు ప్రతీసారి ప్రతిపక్షాలు బలైపోతూనే ఉన్నాయి. రాల్లేసిన వారితో పూలు చల్లించుకొని చప్పట్లు కొట్టించుకుంటున్న ఘనత కేసీఆర్‌ సొంతమనే మాట రోజురోజుకు అర్థమవుతూనే ఉంది. కేసీఆర్‌ మొదటగా అందరికి విలన్‌ గా కనిపించిన అనంతరం క్లైమాక్స్‌ లో మాత్రం హీరోగా మారిపోతారు. కేసీఆర్‌ లోని ఆ విల’నిజం’పై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కెసీఆర్‌ స్ట్రాటజీ ప్రత్యర్థులకు కూడా అంతుబట్టని విధంగా ఉంటుంది. మొన్నటి ఆర్టీసీ సమ్మె విషయంలో మొదట కార్మికులకు అండగా నిలిచి హల్‌ చల్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఇతర పార్టీలు కొన్ని రోజుల తర్వాత సైలెంట్‌ అయ్యారు. అస్సలు వారి సమ్మెకు మద్దతుగా ఆందోళనలు చేసిన సంధర్బాలు తక్కువగానే ఉన్నాయి. రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ రెడ్డి లాంటి వాళ్లు కూడా సమ్మొ దగ్గరకు సంధర్బం తక్కువగానే ఉంది. అసలు ఆర్టీసీ సమ్మె వెనుకాల కేసీఆర్‌ ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన అభీష్టం మేరకే ఈ సమ్మె జరుగుతోందని ప్రతిపక్షాలు అనుమానించారు. అందుకే ఈ ఆటలో అరటిపండు కాకూడదని ప్రధాన ప్రతిపక్షం దూరం జరిగిందంటారు. చివరకు ఆర్టీసీ సమ్మె విషయంలో మొదట విలన్‌ అయిన కేసీఆర్‌ తర్వాత వరాలు ప్రకటించి హీరో అయిపోయారు. ఈ ఆర్టీసీ ఉదంతంలో అటు కార్మిక సంఘాలను నియంత్రించి.. ప్రతిపక్షం కాంగ్రెస్‌ చెవిలో కేసీఆర్‌ పిచ్చి పువ్వులు పెట్టేశారు.

ఇటీవల సంఘటనలు అలాగే కనబడుతున్నాయి.

ఇక దిశ ఎన్‌ కౌంటర్‌ విషయంలోనూ కేసీఆర్‌ స్ట్రాటజీ వర్కవుట్‌ అయ్యింది. దిశ కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్‌ తీరుపై జాతీయ మీడియాలోనూ దుమ్మెత్తి పోశారు. తెలంగాణ పోలీసుల తీరు – కేసీఆర్‌ ను తిట్టిపోశారు. కానీ ఒక్క ఎన్‌ కౌంటర్‌ తో ఇప్పుడు దిశ కుటుంబమే కాదు. మొత్తం మీడియా – యావత్‌ దేశం మనసులు గెలుచుకున్నారు కేసీఆర్‌. ఇటీవల తెలంగాణలో ఒక మంత్రి అన్నట్టుగా కేసీఆర్‌ ఏదైనా ఒక సమస్యపై మౌనంగా ఉన్నారంటే అందులో ఇన్వాల్వ్‌ కావడం లేదంటే దాని వెనుక పెద్ద ఉపద్రవమే ఉండబోతోంది అని చెప్పకన చెప్పారు. దిశ ఎన్‌ కౌంటర్‌ – ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ మౌనం దాల్చి చివరకు నాన్చి భావోద్వేగాలన్నీ పతాక స్థాయికి చేరాక వాటికి ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌ కు ఎవ్వరి నోటా మాట రాని పరిస్థితి. అందుకే ఇప్పుడు కేసీఆర్‌ మొదట విలన్‌ గా మారిపోతారు.. చివర్లో హీరో అయిపోతుంటారని.. ఆయన రాజకీయ ఉచ్చులో పాపం ప్రతిపక్షాలు – మిగతా పక్షాలు బలైపోతున్నాయని విశ్లేషిస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close