తన్నుకొస్తున్న డొల్ల కంపెనీలు

0

★ వేల కోట్లు లావాదేవీలు
★ అంత దగ్గరి వాళ్ళే
★ రాజకీయ వవర్గాలలో సంచలనం
★ సిబిఐ దర్యాప్తుకు అన్ని పార్టీల డిమాండ్

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
తెలంగాణ రాష్ట్రం వీస్తుపోయో నిజాలు. డొల్ల కంపెనీల పేరుతో వేలకోట్ల ఆర్జనే ధ్యేయంగా సాగింది. అందులో పేర్లు అందరికీ తెలిసినవి.. పదుల సంఖ్యలో ఉంటే.. తెలియని డైరెక్టర్లు కూడా.. ఐపిఎల్ గేమ్ లాగా మారటమే. అంతా వారే.. మాయ స్పంష్టం. గతంలో ఓ ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఇదే తరహాలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేశారు. అయితే ఈసారి దొరికింది మాత్రం మధ్యవర్తు(బ్రోకర్)ల అత్యాశ వలనే. ‘ఆదాబ్ హైదరాబాద్’ మార్చి నుంచి ఈ ఆపరేషన్ మొదలెట్టింది. ఈ భారీతనం ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. ఆసియా, ఫసిఫిక్ దేశాలకు విస్తరించింది. సంబంధిత మధ్యవర్తులను మగ్గులోకి లాగడానికి ఆదాబ్ బృందం అనేక శ్రమలకు ఓర్చింది. ఓ ఐపీఎస్ అధికారి ఏకంగా బెదిరింపులకు దిగారు. (వీడియో సాక్ష్యాలు భద్రం)

ఎలా ‘తిరిగి’ అల్లారు..:
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని ఈ మాయగాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అందరికీ తెలిసిన సత్యం (SATYAM) తిరగేసి రాస్తే….మైటాస్..(MAYTAS). దేశ ప్రజలు.. ప్రత్యేకంగా తెలుగు… ఇంకా లోపలికి వెళ్ళితే తెలంగాణ ప్రజలు అమాయాకులనే భావనతో చేశారు. మైటాస్ దొంగ తెలివితేటలను ఘనాపాఠీలు ఇక్కడా ఉపయోగించారు.

పట్టించిన ఆదాబ్ స్నేహం:
‘ఆదాబ్ హైదరాబాద్’ బృందాలకు సుమారు 48 దేశాలలో శ్రేయోభిలాషులు ఉన్నారు. దేశంలోని ఆర్థిక నేరగాళ్ళ బంధువులు, సన్నిహితులు విదేశాలకు వెళ్ళిన సందర్భంలో ప్రత్యేక దృష్టి పెట్టింది ఆదాబ్ బృందం. ప్రతి సంఘటనను వీడియోలో చిత్రీకరించడంతో పాటు అక్కడ జరిగే లావాదేవీల వెనుక ఉన్న లాభా పరులపై దృష్టి పెట్టింది. ఒక్క చేప కూడ వదలకుండా అన్నీ చేపలు చిక్కాయి. ఈ నేపథ్యంలో సుమారు1600 డాక్యుమెంట్లు ఆదాబ్ సాహసోపేతంగా సేకరించింది. ఇవి అంచెలంచెలుగా బయటకు రానున్నాయి.

బెదిరింపులా..:
‘ఆదాబ్ హైదరాబాద్’ ఓ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ కత్తికి పదును మాత్రమే తెలుసు. అవకాశం కోసం ఏళ్ళ తరబడి చూసే సహనం ఉంది. అక్రమార్కులు, తప్పుడు పనులు చేసిన వాడిని ఎవ్వడినీ వదిలేది లేదు. ఈ దేశ సొత్తు ప్రజలది. ప్రజాధనానికి ఓ ఐదేళ్ళు కాపలా గాళ్ళు దోచుకుంటే చూస్తూ ఆదాబ్ ఊరుకోదు. నాడు ఉరిశిక్షలకు భయపడితే భారతం ఇంకా సంకెళ్ళ మధ్యే నలుగుతూ ఉండేది. ఇదీ అంతే బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు భయపడతామనే భ్రమలు వద్దు. తప్పు చేసినవాడు ఎవరైనా జాతి ముందు దోషులుగా నిలబెడతాం.

కల్వకుంట్ల అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు టిజెఎస్ డిమాండ్

నిప్పులు చెరిగిన కృష్ణ

దేశంలో జరిగిన అతిపెద్ద వ్యూహాత్మక కుట్ర ఇందులో దాగి ఉందని, సిబిఐ దర్యాప్తు చేయడం ద్వారా మాత్రమే నిజాలు వెల్లడవుతాయని తెలంగాణ జనసమితి అధికార ప్రతినిధి కృష్ణ కాసుల డిమాండ్ చేశారు.

ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రచురించిన :’కల్వకోట్ల కుటుంబం’ కథనంపై తెలంగాణ జనసమితి స్పందించింది. ఈ కుంభకోణం కూడా ‌జగన్ డొల్ల కంపెనీలకు ధీటుగా సాగిందని, ఇందులో ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, పార్టీలోని కీలక వ్యక్తులు ఈ డొల్ల కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నారు. 2016-17లలో మాత్రమే ఈ కంపెనీలు మొదలై కేవలం రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిందని ఈ ప్రభుత్వంపై గవర్నర్ స్పందించి సిబిఐ విచారణకు చొరవ చూపాలని ఆయన కోరారు. హాల్మార్క్ ఇన్ఫ్రా-కాన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, సిజనస్ ఇన్ఫ్రా అండ్ రికాన్కన్ ప్రైవేట్ లిమిటెడ్, కారోలినా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వెర్ టెక్స్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఎస్ సహజ వనరుల ప్రైవేటు సంస్థ, సియాన్ ఇన్ఫ్రా, ఆకార మైనింగ్, ఒయర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాశిష్టా ప్రైవేట్ లిమిటెడ్, అక్బోబియ ప్రైవేట్ లిమిటెడ్, మూవోన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, కర్వి సోలార్ పవర్ లిమిటెడ్, షార్ప్ వెంచర్ ప్రైవేట్ సంస్థలను 2016-17 సంవత్సరాలలో ఏర్పాటు జరిగాయి. ఇందులో ప్రధానంగా ‘కాల్ హెల్త్’కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పై సంస్థలలో ఓ మంత్రి పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30% వాటాలున్నట్లు తెలిసింది. ఆసియా పసిఫిక్ దేశాలకు అంతర్గతంగా విస్తరించిని తేజారాజ్ తో కేటీఆర్ మలేషియా ప్రధానమంత్రితో కలవడం సంచలనం కలిగించే విషయం. తేజారాజ్ పై ఇప్పటికే వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కంపెనీలలో ముఖ్యమంత్రి బావమరిది పేరు‌, ఎంపీ భర్త, మేనల్లుడి భార్యతో పాటు మియాపూర్ భూ కుంభకోణంలో ఇరుక్కున్న ఒకరు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి అనుయాయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

తాట తీస్తాం..
★ కేంద్రం దృష్టిలో పెట్టా
★ ఎన్నాళ్ళీ దోపిడీ
ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి

అల్లిబిల్లి కంపెనీల ముసుగులో జరుగుతున్న వ్యవహారాలను కేంద్రం దృష్టికి తెచ్చానని, ఈ దోపిడీని అరికడతానని కేంద్ర మాజీమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి తెలిపారు.

‘ఆరోగ్యం’ ముసుగులో జరిగిన ఈ అవకతవకలపై తాను ఇప్పటికే అనే దశలలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తెచ్చానని, తాజాగా ‘ఆదాబ్ హైదరాబాద్’ మరో కోణంలో ఈ విషయాలనుb వెలుగులోకి తెచ్చారని మరో రెండు, మూడు నెలలో పూర్తి క్లారిటీ కేంద్ర నిఘా సంస్థల నుంచి వస్తాయని ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here