Featuredజాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లుపై విపక్షాల అనవసర రాద్దాంతం

పాక్‌ గొంతుకను వినిపిస్తున తీరు దారుణం

సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ చట్టం

ఇదో చారిత్రక చట్టమని చెప్పిన ప్రధాని మోడీ

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం

న్యూఢిల్లీ

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడాన్ని ప్రధాని మోదీ తప్పు పట్టారు. విపక్షాల తీరును ఎండగట్టారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌ ఎలా మాట్లాడుతుందో తూచ తప్పకుండా కొన్ని ప్రతిపక్షాలు అదే పరిభాషలో మాట్లాడుతున్నాయని అన్నారు. బుధవారంనాడు రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని అధికార పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు దీనిపై పాక్‌ లా మాట్లాడుతున్నాయన్న విషయాన్ని మన పార్టీ ఎంపీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోదీ సూచించార /హపౌరసత్వ బిల్లుపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఎంపీలకు సూచించారు. కాగా, పౌరసత్వ బిల్లు అనేది సువర్ణాక్షరాలతో లిఖించిన బిల్లు అవుతుందని ప్రధాని పేర్కొన్నట్టు సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు. సాధారణ మెజారిటీతో బిల్లు నెగ్గుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటు లైబ్రరీలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ¬ం మంత్రి అమిత్‌షా సహా పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కీలకమైన పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా ప్రవేశపెడుతున్నందున దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు.కాగా, బిల్లుపై రాజ్యసభలో జరగనున్న చర్చలో కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌, టీఎంసీకి చెందిన డెరెక్‌ ఒబ్రెయిన్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌గోపాల్‌ యాదవ్‌ పాల్లోనున్నారు. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ఎంపీలకు విప్‌ జారీచేశారు. కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత, ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల తీవ్ర నిరసనల మధ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close