Featuredక్రైమ్ న్యూస్

కొంపలు కూలుస్తున్న వివాహేతర బంధాలు

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న కవి మాటలు అక్షరాల నిజం అనిపించేలా ఉన్నాయి నేటి కుటుంబ బంధాలు.. అవును కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వివాహేతర సంబంధాలు హాయిగా దాంపత్య జీవితం గడపాల్సిన భార్యలు?.. భర్తలను దారుణంగా హతమారుస్తున్నాయి.. నిండునూరేళ్ల జీవితాన్ని కర్కశంగా కాటేస్తున్నాయి. విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నారు.. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కుటుంబంలోని పిల్లలు, ముసలి తల్లిదండ్రులకు దూరమవుతున్నాయి.. ఏ ఆడపిల్లకైనా పెళ్లయిన తర్వాత భర్త తోడే లోకం. కానీ విచిత్రంగా కొందరు మహిళలు భర్తను వద్దు అనుకుంటున్నారు. దాంతో భర్తలను అంతం చేస్తున్నారు.. ఒకపక్క బంగారం లాంటి భర్త, అంతకు మించిన బంగారం లాంటి పిల్లలు ఉన్నా క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కి భర్తలను మట్టు పెడుతున్నారు. స్వాతి, విద్య, జ్యోతి, అలాగే మొన్న హైదరాబాద్‌ బోయిన్‌ల్లికి చెందిన జహీదా, బోరబండకు చెందిన సంగీత.. ఇలా రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమసంబంధాలను చూసి సభ్య సమాజం సిగ్గు పడుతుంది.. తలదించుకుంటుంది..

బాలానగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వాట్సప్‌.. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి… ఎంతగా దగ్గర చేస్తున్నాయంటే కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలతో భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్ళతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయనీ, ఫలితంగా విచ్చలవిడిగా వివాహేత సంబంధాలు పెచ్చువిూరుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ప్రతి ఏటా మూడు వేల మంది హత్యకు గురౌతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో వివాహేతర సంబంధాల వల్ల 138 మంది హత్యలకు గురయ్యారని తేలింది. తెలంగాణలో 117 మంది వివాహేతర సంబంధాల వల్ల హతమయ్యారు.

గతంలో వివాహేతర సంబంధాలకు ఇటు మహిళలు, స్త్రీలు భయపడేవారు. కానీ ఇప్పుడు ఈ ‘బంధం’ పెంచుకోవడానికి ఎటువంటి జంకూ.. గొంకు ప్రదర్శించడం లేదని వెల్లడైంది. పైగా దానిని ఫ్రెండ్‌షిప్‌గా అభివర్ణించడం మామూలైపోయింది. వివాహమైన ప్రతి పదిమంది మగాళ్ళలో ముగ్గురు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఇక మహిళల విషయాన్ని చూస్తే… పదిమంది మహిళకు ఇద్దరు మహిళలు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. పైగా ఈ సంబంధాన్ని కలిగి ఉండటం వారు తప్పుగా భావించడం లేదు. పెళ్ళయిన పురుషులు/మహిళలు సాన్నిహిత్యం కారణంగా ఇటువంటి సంబంధాలు ఎక్కువవుతున్నాయనీ, స్నేహం పేరుతో అవతలి వ్యక్తిని ఏదోవిధంగా ఒప్పించి అక్రమ సంబంధాలకు పురిగొల్పుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధాలు.. హత్యలు సంచలనం కలిగిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఎవరైనా ఎంటరైతే.. వారికి నూకలు చెల్లిపోతున్నాయి. భర్తను తప్పించేందుకు భార్యలు కర్కశంగా మారుతున్నారు. భార్య అడ్డుతొలగించుకునేందుకు భర్తలు నేరస్థులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు ఒకరిపై ఒకరు కక్షలు, కార్పణ్యాలకు పాల్పడేంత వైరానికి కారణం అవుతున్నాయి.

హైదరాబాద్‌ బోయిన్‌ల్లిలో…

ఓ భార్య ఘోరానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంతేకాదు మూడో కంటికి తెలియకుండా అంత్యక్రియలు కూడా చేసేసింది. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని బాబాఖాన్‌గా గుర్తించారు. అతడి భార్య పేరు జహీదా. ప్రియుడి మోజులో పడిన జహీదా భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే స్కెచ్‌ వేసి భర్తను చంపింది. ప్రియుడు, అతని స్నేహితుల సాయంతో 2019, ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు గొంతునులిమి హతమార్చారు. అనంతరం అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ విషయాలను ఏసీపీ రామిరెడ్డి తెలిపారు. భార్య జహీదా, ప్రియుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బోరబండలో…

సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి బోరబండలో రైల్వే ఉద్యోగి శ్రీనివాసను ప్రియుడైన మేనల్లుడు మోజులో పడి రైల్వే ఉద్యోగి భర్తను చంపేసింది భార్య సంగీత. ప్రియుడైన మేనల్లుడి మోజులో రైల్వే ఉద్యోగి అయిన భర్తనే చంపేసింది ఆ భార్య. గత శుక్రవారం రోజున రైల్వే ఉద్యోగి డెడ్‌ బాడీ బోరబండ రైల్వే ట్రాక్‌ పక్కన కనిపించింది. మొదట ఇది ఆత్మహత్యగా అనిపించినప్పటికీ? మృతుడు శ్రీనివాస్‌ సోదరులు సురేష్‌, శంకర్‌.. అతడి భార్య సంగీతపై అనుమానంతో రైల్వే పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు. క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు రైల్వే పోలీసులు. రైల్వే క్వార్టర్స్‌ కు వెళ్లిన స్నిఫ్పర్‌ డాగ్స్‌.. అక్కడున్న రక్తం మరకలు అతడి భార్యకు సంబంధించినవని గుర్తుపట్టాయి. భార్య సంగీతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన నాంపల్లి రైల్వే పోలీసులు విచారణలో ఘోరమైన నిజాలు తెల్సుకున్నారు. హత్యగా తేలడంతో సనత్‌ నగర్‌ పోలీసులకు బదిలీ చేశారు నాంపల్లి రైల్వే పోలీసులు.

అల్లుడి సహకారంతో భర్త హత్య : భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది సంగీత. తన అల్లుడు విజయ్‌ సహకారంతో? చంపేసి.. భర్త శ్రీనివాస్‌ డెడ్‌ బాడీని చాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్‌ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టుగా భార్య సంగీత ఒప్పుకుంది. రైల్వే ఉద్యోగి శ్రీనివాస్‌ అక్క కొడుకు విజయ్‌ రెండేళ్ల కిందట వీళ్ళు ఇంట్లోనే ఉండేవాడు. అల్లుడు వరుసైన విజయ్‌ తో శ్రీనివాస్‌ భార్య సంగీత కు వివాహేతర సంబంధం ఏర్పడింది. శ్రీనివాస్‌ కి విషయం తెలియడంతో భార్యతో తరచు గొడవ పడుతూ ఉండేవాడు. అక్రమ సంబంధం తెలుసుకున్న శ్రీనివాస్‌ మద్యానికి బానిసయ్యాడు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన సంగీత, విజయ సహాయంతో భర్తను అత్యంత పాశవికంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు.

బీఈడీ చదివి ఎస్సైగా క్వాలిఫై అయిన సంగీత : ఇటీవల జరిగిన ఎస్సై పరీక్షల్లో క్వాలిఫై అయింది. త్వరలో ఎస్సై కాబోతోంది. రైల్వే ఉద్యోగి అయిన శ్రీనివాస్‌ అక్క కొడుకు విజయ్‌ .. రెండేళ్ల కిందట వీళ్ల ఇంట్లోనే ఉండేవాడు. అల్లుడి వరసైన విజయ్‌ తో? శ్రీనివాస్‌ భార్య సంగీత? వివాహేతర సంబంధం నడిపింది. శ్రీనివాస్‌ కు ఈ విషయం తెలియడంతో.. భార్యతో తరచుగా గొడవ పడుతుండేవాడు. అక్రమ సంబంధం తెలుసుకుని శ్రీనివాస్‌ మద్యానికి బానిసయ్యాడు. ఓ రోజు సాయంకాలం భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న భార్య సంగీత సాయంకాలం ఆరు గంటల టైమ్‌ లో ప్రియుడైన విజయ్‌కి ఫోన్‌ చేసి రమ్మంది.

ఇంట్లోకి దూరి మేనమామను చంపిన కిరాతక అల్లుడు : లాలాగూడ నుంచి రైలులో బోరబండకు వచ్చిన విజయ్‌ రాత్రి పదకొండున్నర సమయంలో రైల్వే క్వార్టర్‌ వెనుక నుండి శ్రీనివాస్‌ ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం తాగి పడుకున్న శ్రీనివాస్‌ కాళ్లను భార్య సంగీత పట్టుకోవడంతో? మేనల్లుడు విజయ్‌ బండ రాయితో తలపై బలంగా కొట్టాడు. అక్కడికక్కడే శ్రీనివాస్‌ చనిపోయాడు.

నాగర్‌ కర్నూల్‌లో..

ప్రియుడి కోసం భర్త సుధాకర్‌ రెడ్డి ని అత్యంత దారుణంగా హతమార్చిన స్వాతి కథ ఎలా మారిందో తెలిసిందే..! కట్టుకున్న భర్తను కాదనుకొని ప్రియుడు రాజేష్‌ వ్యామోహంలో మునిగిపోయింది స్వాతి. భర్త లేని సమయంలో తులసి వచ్చి వెళితే స్వాతికి దగ్గరయ్యాడు రాజేష్‌. వీరి వ్యవహారం తెలిసిన భర్త సుధాకర్‌ రెడ్డి స్వాతిని మందలించాడు అయినా ఆమె వినకుండా రాజేష్‌ తో అనైతిక సంబంధాన్నీ కొనసాగించింది. తమ అక్రమ సంబంధానికి భర్త సుధాకర్‌ రెడ్డి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా ప్రియుడి సహాయంతో దారుణంగా భర్తను హతమార్చింది. ఆ తర్వాత తన భర్తపై ఆసిడ్‌ దాడి జరిగిందని. దాంతో ఆయనకు ప్లాస్టిక్‌ సర్జరీ జరిగిందని కొన్ని రోజులు నమ్మించింది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్టు సుధాకర్‌ రెడ్డి సోదరుడు వదిన బాగోతాన్ని కనిపెట్టాడు.దాంతో ఈవిడ బాగోతం బయటపడి జైలు జీవితం గడుపుతుంది. కనీసం బెయిల్‌ ఇవ్వడానికి కూడా స్వాతి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరు ఇవ్వలేని పరిస్థితి. సమాజం మొత్తం వెలివేసే స్థితిలో ఉన్న ఆమెను ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి బెయిల్‌ ఇచ్చిన ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అక్కభర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హతమార్చింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం పోతులూరు కు చెందిన శ్రీవిద్య స్కూల్లో టీచర్గా పని చేసేది. అయితే ఆమెకు రెండేళ్ల కిందటనే విూ నా భావన నరేంద్ర చంద్ర తో వివాహం జరిగింది. అయితే అంతకు ముందే శ్రీవిద్య అక్క భర్త వీరయ్య తో సంబంధం పెట్టుకుంది. పెళ్లయ్యాక బావతో కలిసేందుకు సమయం దొరకడం లేదని భావించిన శ్రీవిద్య భర్త నరేంద్ర అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశంతో కట్టుకున్న భర్తను బావతో కలిసి అంతమొందించింది. స్వాతికి, శ్రీవిద్య కి ఎక్కడ తీసిపోను అనుకుందో ఏమో జ్యోతి మహిళ పాలుపంచుకున్న నరేష్‌ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహతన భర్తను కడతేర్చింది. నాగరాజు కార్పెంటర్‌ కు జ్యోతి అనే మహిళతో వివాహం జరిగింది. కొంతకాలానికి కార్తీక్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఈ క్రమంలోనే భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతని ఎలాగైనా అంతమొందించాలని పథక రచన చేసింది. ఈ విషయంలో కార్తీక్‌ స్నేహితుల సహాయంతో భర్తను హత్య చేసింది. అయితే ఈ హత్యలోత్యకు పాల్పస్థానికులుడ్డాడు. విషయాన్ని గ్రహించిన అతనిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని విచారించగా హత్య ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చింది. జ్యోతి, ఆమె ప్రియుడు, అతని స్నేహితులు కటకటాల పాలయ్యారు.

రాజేందర్‌నగర్‌ శివరాంపల్లిలో..

మరొకటి 2 నెలల క్రితం హైదరాబాదు రాజేందర్‌నగర్‌ శివరాం పల్లి కి చెందిన భర్త ఆనందం ప్రియుడితో హత్యచేసి తగులబెట్టి మూసీ నదిలో పడేసింది. ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇలా కొందరు మహిళలు ప్రియుల ప్రేమ గాలానికి చిక్కి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భర్త కుటుంబం, ప్రియుడి కుటుంబం తన కుటుంబం పై దీని ప్రభావం ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఆర్థికంగా, సమాజ పరంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ మొత్తం సమాజం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. సినిమాల ప్రభావం, సామాజిక మాధ్యమాల ప్రభావం, మొబైల్‌ ఫోన్లు, ఉచిత డాటా, అడ్డు అదుపులేని పోకడలు, బాధ్యతారాహిత్యం ఇటువంటివి చాలవ. విలువలు నేర్పించాల్సిన చోట అవురా అని ముక్కున వేలేసుకునే విధంగా పోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విూడియా కూడా నేనుఎం తీసిపోను అన్నట్టుగా ఉంది. తన స్వీయ నియంత్రణ కోల్పోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే తీవ్రంగా స్పందించే సంఘాలు ఆ తర్వాత మిన్నకుండి పోతాయి

ఒంగోలులో.. డాక్టర్‌తో వివాహేతర సంబంధం

ఓ డాక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొన్న భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకొన్నారు. ఓ చిన్న క్లూ ఆధారంగా పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేశారు. ప్రకాశం జిల్లాలోని కంభంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని డాక్టర్‌ వెంకటనారాయణ నడుపుతున్నాడు. ఇదే జిల్లాలోని అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన రజనీ, జగన్మోహన్‌ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వైద్యం కోసం అప్పుడప్పుడు కంభంలో డాక్టర్‌ వెంకటనారాయణ నిర్వహించే ఆసుపత్రికి వచ్చేవారు ఈ దంపతులు. అయితే ఈ క్రమంలోనే డాక్టర్‌ వెంకటనారాయణతో రజనీకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడితో రజనీకి ఏర్పడిన వివాహేతర సంబంధం ఏర్పడడంతో భర్త జగన్మోహన్‌ రెడ్డి తమ మధ్య అడ్డుగా ఉన్నాడని భావించారు. జగన్మోహన్‌ రెడ్డిని హత్య చేయాలని ప్లాన్‌ చేశారు. కిరాయి హంతకులతో జగన్మోహన్‌ రెడ్డిని హత్య చేసేందుకు డాక్టర్‌ వెంకటనారాయణ, రజనీ ప్లాన్‌ చేశారు. జగన్మోహన్‌ రెడ్డిని ఇంటి నుండి కిడ్నాప్‌ చేశారు. ఆత్మకూరులోని అటవీ ప్రాంతానికి జగన్మోహన్‌ రెడ్డిని తీసుకెళ్లి హత్య చేశారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో జగన్మోహన్‌ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జగన్మోహన్‌ రెడ్డి మృతదేహన్ని గుర్తించేందుకు భార్య రజనీని పోలీసులు తీసుకెళ్లారు. జగన్మోహన్‌ రెడ్డి మృతదేహన్ని చూసి భార్య రజనీ నవ్వింది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఈ కేసును ఆ దిశగా దర్యాప్తు చేశారు. దీంతో పోలీసులు రజనీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. డాక్టర్‌ వెంకటనారాయణతో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని ఆమె బయటపెట్టింది. జగన్మోహన్‌ రెడ్డిని హత్య చేసినట్టు ఆమె ఒప్పుకొంది.

చెన్నైలో.. ప్రియుడితో రాసలీలలు.. కన్న కూతురి చంపిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో కన్నకూతురును బావిలో తోసి చంపింది ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఈ విషయమై తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూరు సవిూపంలోని వీరగనూరుకు చెందిన శివశంకర్‌ సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య ప్రియాంకగాంధీ, నాలుగేళ్ల కూతురు శివాని ఉంది. ప్రియాంక, నాలుగేళ్ల కూతురు శివానీతో కలిసి తమిళనాడులోనే నివాసం ఉంటుంది. మంగుళూరులోని బ్యాంకుకు వెళ్లిన ప్రియాంకగాంధీ, ఆమె కూతురు శివానీ రాత్రి పూట బావిలో పడిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన వద్ద ఉన్న నగదును లాక్కొని బావిలో తోసేశారని ఆమె చెప్పింది. అయితే అప్పటికే శివానీ మృతి చెందింది. ప్రియాంకను పోలీసులు విచారించిన సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. వెంకటేషన్‌ అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. వెంకటేషన్‌తో ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని కూతురు శివానీ తండ్రికి పోన్‌లో చెప్పింది. ఈ విషయమై భార్య ప్రియాంకను శివంకర్‌ మందలించాడు. శివానీ ఉంటే తనకు ఇబ్బందని భావించిన ప్రియాంక ఆమెను బావిలో తోసి చంపేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రియాంకను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు ఇటువంటి సంఘటనలను  ముందే గుర్తించి  కఠినంగా వ్యవహరించేందుకు సుముఖంగా ఉన్నా చట్టాలు సంకెళ్ళు వేస్తున్నాయి. కానీ  వీటిని  మొగ్గ దశలోనే గుర్తించి  తుంచి వేయాల్సిన తల్లిదండ్రులు,  కుటుంబ సభ్యులు పట్టనట్లు వ్యవహరించడం క్షమించరాని నేరం. ఇకనైనా సంఘసంస్కర్తలు, మేధావులు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చేద్దాం.. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close