దారి తప్పిన నక్సల్‌ తూటా…ఉదయం అస్తమయం

0

  • రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు
  • పరిశోధనకు పెద్దపీట

(ఆదాబ్‌ హైదరాబాద్‌ విశ్లేషణ కదనం-4)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

నక్సల్స్‌ (నేటి మవోయిస్ట్‌) మేథావులే… కానీ… సమాజంపై అసహనం.. సరైన సమయంలో జరగని న్యాయం కోసం… యువత సహకారంతో… పెన్ను వద్దని గన్నుతో అడవిదారి పట్టారు. ఎందుకోసం పోరాడుతున్నారో… ఎవరి కోసం పోరాడుతున్నారో… లక్ష్యం ఏమిటో తెలియని అయోమయ స్థితి. ఎవరి కోసమైతే పోరుబాట పట్టారో… వారినే చంపే దుస్థితి. అదే ‘విప్లవం’ అనుకునే భ్రమలో బతుకుతూ… పొట్టకూటి కోసం పనిచేసే పోలీసోడిని, తమకు నచ్చని వారిని చంపుతూ… పైశాచిక ఆనందంలో.. దశాబ్దాలుగా ‘మునిగి’ తేలారు. అస్సలు లక్ష్యం తాకట్టు పెట్టుకుని… అసమర్థపు స్వార్థంతో అధఃపాతాళానికి దిగి’పోయారు’.

అస్తమించిన ఉదయం: వేలాదిమంది ప్రాణాలను తీసిన విప్లంవం పాత్రికేయ వృక్షాన్ని తెగ నరికి వేలాది మంది రోడ్డున పడేట్టు చేశారు. ఆ పత్రిక పేరు ఉదయం.

ఉదయించిన వేళ: దినపత్రిక 1984 సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు. ఈపత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్‌ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్‌. రామకృష్ణ ప్రసాద్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్రసాద్‌ సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు. ఇది హైదరాబాదు,విజయవాడ నుండి ప్రచురించబడేది. ప్రసాద్‌ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్‌.వై.పతంజలి పత్రికను నిర్వహించారు. 1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు.గజ్జెల మల్లారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, తరువాత కె.రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.

ఆదీఈ ఒక రికార్డ్‌: అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైనది.ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని ‘ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం రిపోర్టులు’ చాలా ప్రాచుర్యం పొందాయి.హైదరాబాదు నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్‌ ప్రచురించడం మొదలుపెట్టినది. విద్యార్థుల కోసం వెలువరించిన అనుబంధం ”దిక్సూచి” చాలా ప్రసిద్ధమైనది.

ప్రశ్నించే నాథుడే లేడు: సుమారు ఎనిమిది వేల ఉద్యోగులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉదయం సాకేది. మాగుంట సుబ్బరామిరెడ్డిని నాటి నక్సలైట్లు అకారణంగా 1995లో కాల్చి చంపారు. దీనితో ఉదయం దిక్కులేక మూతపడింది. నక్సలైట్లు ఆ తరువాత అది తప్పేనని అంగీకరించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. వేలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ విషయాన్ని నక్సలైట్లకు భయపడి ఎవరూ మాట్లడలేదు. ఓ పత్రిక యజమానిని అకారణంగా చంపటంతో నక్సల్‌ బావుకుంది లేదు. బాగుపడిందీ లేదు. వందలాది మంది పాత్రికేయులు నడిరోడ్డుపై నిలిచిన అసాధారణ సంఘటన గురించి ఏ విూడియా నోరు మెదపలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here