Featuredస్టేట్ న్యూస్

అనుమతులే రాలే… అక్రమంగా డబల్‌ సెల్లర్‌ తవ్వకం

ప్రమాదకరంగా సెలర్ల తవ్వకం

చర్యలు చేపట్టని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

సెల్లర్ల తవ్వకం వెనక బడా నేతల హస్తం?

సెల్లర్‌ నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాలని

మార్కెట్‌ పోలీసులకు పిర్యాదు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సికింద్రాబాద్‌ బేగంపేట్‌ సర్కిల్‌ పరిధిలో విచ్చలవిడిగా సెలర్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపల్‌ అనుమతులకు దరఖాస్తు చేసి రోజులు గడవక ముందే! ముందుగానే సెలర్ల తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయి.మొండా డివిజన్‌ పరిధిలోని టకార బస్తీలో జిహెచ్‌ఎంసి అనుమతులకు అప్లయ్‌ చేసిన నిర్మాణదారుడు.. అధికారులు అనుమతులు ఇస్తారులే అన్న ధీమాతో అనుమతులు రాకముందే డబల్‌ సెల్లర్‌ తవ్వకం జరుగుతుంది. ఈ భవనం నిర్మాణంలో బడా బాబుల హస్తం,అండదండలు ఉండడంతో యజమాని యధేచ్చగా అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని తెలుస్తోంది. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించి వాటిపై చర్యలు చేపడుతామన్న మున్సిపల్‌ ఉన్నతాధికారుల మాటలకు ఈ అక్రమ సెల్లర్ల తవ్వకాలు కనబడడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ సెల్లర్ల తవ్వకం వల్ల చుట్టుపక్కల ఉన్న భవనాలకు ప్రమాదం పొంచి ఉందని ఆ నిర్మాణదారునిపై చట్ట రీత్యా చర్యలు చేపట్టాలని టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆపిసర్‌ మార్కెట్‌ పోలీసులకు గత సంవత్సరం నవంబర్‌ నెలలో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ పిర్యాదుపై చర్యలు తీసుకోలేమని మాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు.పోలీసులకు పిర్యాదు చేశాం ఎంజరిగినా మనకేం సంబంధం లేదులే అన్నట్లుగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.ఈ సెల్లర్‌ అక్రమం అని మూడు నెలల ముందే అధికారులకు తెలిసిన చర్యలు చేపట్టడంలో అదికారులు వెనకంజ వేస్తున్నారు.బడా నేత హస్తం ఉన్నందునే చర్యలు చేపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు.అక్రమ భవన నిర్మాణం ప్రమాదకరమని తెలిసిన టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది నిర్మాణదారునికి నోటీసులు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు.50,60 గజాలలో పేదలు ఇల్లు నిర్మాణం చేస్తుంటే తనిఖీల పేరుతో నిర్మాణదారుని ఇబ్బందులకు గురి చేసే ఆడిన కాడికి దండుకునే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అనుమతులు రాక ముందే సెల్లర్లు భారీగా తవ్వితే చర్యలు చేపట్టారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసిన బేగంపేట సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి సికింద్రాబాద్‌ జోన్‌ జెడ్‌ సి,బేగంపేట్‌ సర్కిల్‌ డిసి, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది చొరవ తీసుకుని ప్రమాదం జరగక ముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close