అధికార కూటమితో అనధికార కూటమి.. ఢీ

0

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌ : ఎట్టకేలకు రాజకీయ ముసుగులు తీయాల్సిన తరుణం వచ్చింది. అధికార కూటమికి నారా చంద్రుడు… అనధికార కూటమికి కల్వకుంట్ల చంద్రుడు పరోక్షంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటున్నారు.

అధికారికంగా..: కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, తెజస, తెలంగాణ ఇంటి పార్టీలు అధికారిక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి పొత్తులు, కుమ్ములాటలతో అంతర్గత ప్రజాస్వామ్యం అలా ఆసక్తి పరులకు కావలసినంత వినోదం పంచాయి. నామినేషన్‌ పర్వం ప్రారంభం కావడంతో నారా చంద్రుడు కూడా అక్కడక్కడి లోపాలతో అందరినీ సర్థేశారు. ఇది బహిరంగ రహస్యంలాగా తెలంగాణ గాంధీ అరచి గీ పెడుతున్నారు.

అనధికార కూటమి..: తెరాస లక్ష్యం, గమ్యం వేరు. రాష్ట్రంలో మజ్లీస్‌ తో కలసి అసెంబ్లీ మెజారిటీ కావాలి. కేంద్రంలో భాజపా తో కలసి కూతురుకు కేంద్రంలో మంత్రిని చేయాలి. ఫ్రంట్‌ పేరుతో చక్రం తిప్పాలి. అందుకు అనుగుణంగా కల్వకుంట్ల చంద్రుడు ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రమే ఉంటామని చెప్పే రెండు పార్టీలతో గుమ్మనంగా కలిసిపోయారని తెలుస్తోంది.

వైఎస్సార్‌ పార్టీ పోటీ చేయదు: గత తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలలో ప్రభావం చూపిన వైఎస్సార్‌ పార్టీ తెలంగాణలో పోటీ చేయడంలేదని అధికారికంగా ప్రకటించింది. అయితే గత కొద్ది నెలలుగా కేటీఆర్‌, జగన్‌ ‘ఫోన్‌ టచ్‌’లో ఉన్నారని తెలిసింది. అంతేకాకుండా గత ఎన్నికల సందర్భంలో కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ లో జగన్‌ గెలుస్తారని జోస్యం చెప్పారు. అంతే కాకుండా వైఎస్సార్‌ సీపీ తరఫున వారు తెరాసలోకి వెళ్ళినా ఏనాడు ఆయన విమర్శించిన దాఖలాలు లేవు. ఆ పార్టీల అనుబంధం అది.

జనంలేని జనసేన: తెలంగాణలో మెగా అభిమా నులకు కొదవలేదు. ఆ అభిమానులకు అన్నద మ్ములు ఇద్దరూ దశల వారీగా షాకులిచ్చారు. అన్న చిరు ప్రజారాజ్యంలో తమ్ముడు యువరాజ్యం అధిపతి. తెలంగాణ ఉద్యమంలో ఊరులో ఉన్న పార్టీ దిమ్మలతో సహా కాంగీతో సగర్వంగా కలిపారు. అన్న కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం తమ్ముడు ప్రజారాజ్యం సీక్వెల్‌ గా జనసేన తెచ్చారు. ఇది కూడా తెలంగాణలో పోటీ చేయడం లేదు. పార్టీ కూడా అనధికారికంగా తెరాసకే మద్దతు.

మజ్లీస్‌ తో మజాలే..!: మజ్లీస్‌ తో స్నేహపూర్వక పోటీ పేరుతో తెరాస అంటకాగింది. తాయిలాలు ఇచ్చింది. ఇదిలావుండగా 10టివి కొనుగోలుకు సహకరించిన బిఎల్‌ఎఫ్‌ కూడా కల్వకుంట్ల చంద్రుడికి దగ్గరైంది. ఇది స్వతంత్రంగా బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనుంది.

ఇదీ లెక్కా..: అంటే నారా చంద్రుడి అధికారిక కూటమిలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, తెజస, తెలంగాణ ఇంటి పార్టీలు ఉన్నాయి. కల్వకుంట్ల చంద్రుడుతో వైఎస్సార్‌, జనసేన, మజ్లీస్‌.. పరోక్షంగా బిఎల్‌ఎఫ్‌ లు కల్వకుంట్ల చంద్రుడితో సాగుతున్నాయి.

చివరిగా..: పైకి కాంగీ కూటమి పేరుతో ఐదు పార్టీలు, కనిపించని కూటమితో తెరసా కూడా ఐదు పార్టీలతో ఎన్నికల సమరానికి సిద్దం. ఓ¬ ఏవిూ (అ) రాజకీయం. జయ¬.. ఎవరు గెలిచినా… సామాన్యుడి జీవితం గమనం దినసరి కూలీనే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here