753 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఏకగ్రీవ పంచాయితీల్లో దాదాపు 90శాతంపైగా టిఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. మరోవైపు తొలి విడత పంచాయతీ ల్లో దాదాపు 753 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సింగిల్‌ నామినేషన్‌ వచ్చిన ఊర్లన్నీ ఏకగ్రీవమైనట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మిగిలిన గ్రామాలకు సంబంధించి బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇక

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4479 గ్రామాల్లో ఈ నెల 21న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి విడత పంచాకతీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ మగిసిన తర్వాత ఎన్నికల సంఘం అధికారులు ఏకగ్రీవాల లెక్క తేల్చారు. సింగిల్‌ నామినేషన్‌ దాఖలైన ఊర్లలో సర్పంచ్‌, వార్డు మెంబరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో టీఆర్‌ఎస్‌ ప్రముఖ నేతల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కోరెం గ్రామ సర్పంచ్‌గా ఎంపీ వినోద్‌ కుమార్‌ అత్త చెన్నాడి రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు జోగుళాంబ గద్వాల జిల్లాలోని ధరూర్‌ మండం బూరెడ్డిపల్లి గ్రామంలో కూడా పంచాయతీ పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నకైంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్‌ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి బూరెడ్డిపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి, ముత్తారం మండలం ఓడేడ్‌ గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. జగిత్యాల జిల్లాలో బీమిరెడ్డిగూడెం, ధర్మానాయక్‌ తండా, వడ్డెరకాలనీ, కందెనకుంట, సూరారం, గోవింద్‌పల్లి, బూనుగుపల్లి, ఆకుసాయిపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆముదాలపల్లి, వదినపల్లి, నేరేడుపల్లి, కొత్తపేట, చైన్‌పాక, తాళ్లపల్లి, బావుసింగ్‌పల్లి, నావాపేట, వరికోల్‌పల్లి, తైలాపూర్‌, పిరసిల్ల, పెద్ద కోమటిపల్లి, పెద్దపల్లి, దమ్మన్నపేట, చెన్నాపూర్‌, చెంచుపల్లి, పొనగల్లు, రేపాకపల్లి, గుమ్మడిపల్లి, అసిరెడ్డిపల్లి, పంగిడిపల్లి, మందలూరిపల్లి గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా విషయానికొస్తే దుగ్గొండి మండలంలో తొమ్మిది గ్రామాలు, నర్సంపేట మండలంలో ఆరు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సంగెం మండలంలోని కాపుల కానిపర్తి, బిక్యూనాయక్‌ తండా, ఎల్గూర్‌ స్టేషన్‌, కొత్తగూడెం, సోమలతండా, పెద్ద తండా, గాంధీనగర్‌, షాపూర్‌ గ్రామాల పాలకవర్గాలు ఏకగ్రీవంగా నిలిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్‌ ఏకగ్రీవమైంది. అటు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం ముజ్జిగూడెం, అప్పలనర్సింహాపురం, తిరుమలాపురం తండా, సుద్రేపల్లి గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. తిరుమలాయ పాలెం మండలం సోలిపురం, ముదిగొండ మండలం గోకినపల్లి, కూసుమంచి మండలం గోరిల్లతండా, కొత్తూరు, ధర్మతండా, ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనూ ఏకగ్రీవాల జోరు కొనసాగింది. కృష్ణా మండలంలోని గురజాల, అలంపల్లి,

మురహరిదొడ్డి, ఐనాపూర్‌ పంచాయతీలు.. మాగనూరు మండలంలోని ఉజ్జెల్లి, గురువావులింగంపల్లి గ్రామాలు ఏకగ్రీవాలయ్యాయి. మరికల్‌ మండలం అయ్యవారిపల్లి, పలుగుతండా, నక్కానుకుంట తండా, మోడీపూర్‌, చిన్నాగాల్చేడు, నల్లవెల్లి, అచార్యాపూర్‌, శేరి వెంకటాపూర్‌, అనంతాపూర్‌, గంగానాయక్‌ తండా, ఎల్లారెడ్డిపల్లి, హనుమాన్‌గడ్డ తండా, కన్మనూర్‌, కోయిల్‌కొండ గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక నారాయణపేట మండలంలోని సింగారం, వందర్‌గుట్ట తండా, బోయిన్‌పల్లి.. దామరగిద్ద మండలంలోని కంసన్‌పల్లి, శుద్ధబండ తండా, దామరగిద్ద తండాతో పాటు ధన్వాడ మండలం బుడ్డమర్రీ తండా ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్‌ జిల్లాలో మొత్తం 58 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. మామడ మండలంలో ఏకంగా 13 పంచాయతీలు, లక్ష్మణచాంద మండలంలో నాలుగు, కడెం మండలంలో 9, ఖానాపూర్‌ మండలంలో 10, పెంబి మండలంలో 20 పంచాయతీలు, దస్తురాబాద్‌ మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అటు ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలంలో 15 పంచాయతీలు, తాంసీ మండలంలో 8, జైనథ్‌ మండలంలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 30 గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘనపురం మండలంలో 13 పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. సంగారెడ్డి జిల్లాలో 21 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు, జనగామ జిల్లాలో 18 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నర్మెట్ట మండలంలో 5, తరిగొప్పుల మండలంలో మూడు, బచ్చన్నపేట మండలంలో నాలుగు, లింగాల ఘనపురం మండలంలో నాలుగు, జనగామ పరిధిలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అటు కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని వేంపాడు పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏకగ్రీవాలపై టిఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here