యుద్ధరంగంలో ఇద్దరూ ప్లాప్‌

0

బలాలు

– జనసమీకరణ భేష్‌

– భాగస్వాములను ఒకే వేదిక మీదికి తేవడంలో సక్సెస్‌

– మాస్‌ లీడర్లందిరికి మాట్లాడే అవకాశం ఇవ్వడంలో సక్సెస్‌

– 119 అభ్యర్థులను సభకు తీసుకురావడంలో సక్సెస్‌

– రెబల్స్‌ అసమ్మతులను కూడా దువ్వి మేడ్చల్‌ రప్పించడంలో సక్సెస్‌

– ఎటువంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా జాగ్రత్త పడడంలో సక్సెస్‌

బలహీనతలు

– దమ్ములేని ప్రసంగాలు, ధైర్యం చాలని విమర్శలు

– వక్తలు మొనగాళ్లే అయిన చాలని సమయం, పదునైన ప్రసంగాలకు అవరోధం

– కేసీఆరే టార్గెట్‌గా మాట్లాడడంతో సొంతగా ఏం చేస్తారో చెప్పుకోలేని ధైన్యం

– పార్టీ మ్యానిఫెస్టో ఈ వేదికపైనే విడుదలైనా దాని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లే వివరణ ఇవ్వకపోవడం పెద్ద లోపం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎన్నికల సమరంలో మొదటి అంకం ముగిసింది. కాంగ్రెస్‌ శ్రేణులలో ఉత్సాహం. కుమ్ములాటల కూటమి నాయకులలో గెలుపు ఓటముల ఊగిసలాట. స్థానిక వ్యతిరేకతతో తెరాస నాయకులలో బెరుకుదనం. వెరసి శాసనసభాపర్వంలోని ప్రథమార్థ ప్రచారంలో ప్రధాన పార్టీల ప్లాప్‌ షో.

‘వాడి’…పోయే.. తాజా గులాబీ:

భారీ యుద్ధం చేయడానికి ఊహించని భయంకర పరిణామాలతో గులాబీ నేత తెరలేపారు. వీర సైనికుడిలా ముందుకు దూకారు. అసెంబ్లీ రద్దు వరకు గులాబీనేత ఆడిందే ఆట. పాడిందే పాట. ఆయన అనుకున్నట్లుగా పరిణామాలు జరగలేదు. కొంగరకలాస్‌ ప్లాప్‌ తో గులాబీ దళాలకు గెలుపు సంశయం వచ్చింది. వందిమాగధుల ఇంటిలిజెన్స్‌ సమాచారం తల్లకిందులైంది. అవసరాలకు అనుగుణంగా ఉండే ”మీడియా, లబ్దిపథకాలు” అనే పక్షులు.. కేసీఆర్‌ నుంచి దూరంగా జరిగాయి.

వ్యతిరేకతను కప్పెట్టే ప్రయత్నం: స్థానిక నాయకులపై సహజంగా ఉండే వ్యతిరేకతను మీడియా (ఆదాబ్‌ హైదరాబాద్‌ కాదు) తొక్కిపెట్టింది. సోషల్‌ మీడియా విజంభించింది. నాయకుల నిలదీత వీడియోలు చక్కెర్లు కొట్టాయి. ఇది గులాబీ దళాలకు కొరుకుడు పడని వ్యవహారం. అప్పటిదాకా వెన్ను చూపడం వీరుని లక్షణం కాదు. విజయమో వీరస్వర్గమో తేల్చుకునే సమరంలో…

కేసీయార్‌ నోటి వెంట వచ్చిన ”ఏమైతదివయా” కేసీయార్‌ ఓడిపోతే నాకేమైన్నా నష్టమా..? ఇంట్ల కూసొని రెస్టు తీసుకుంట” ‘గెలిపించకపోతే నాకే. నష్టం లేదు. వెళ్ళి నిద్రపోతాను’ అంటూ కేసీఆర్‌ చేసిన వాఖ్యలతో ఒక్కసారిగా తెరాస శ్రేణులు నిశ్చేష్టులయ్యారు. ఇదిలా ఉండగా కేటీఆర్‌ కూడా ‘ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని ఒకసారి.. ‘మీకు నచ్చకపోతే నోటాకు వోటేయండి’ అని చెప్పడం కూడా ఊహించని పరిణామం.

‘లాజిక్‌’ మిస్‌: రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అవసరార్థం కోసం వచ్చిన ఇతర పార్టీల వారితో వచ్చిన తలనొప్పుల కారణంగానే స్థానిక అభ్యర్థులకు గ్రామాలలో వెల్లువెత్తుతున్న సంఘటనలు. సంక్షేమ పథకాలు అందిన వారికన్న అందని వారు ఎక్కువ. వీరిలో ప్రభుత్వ పరంగా సహాయం అందేవారు తెరాసకు ఓటు వేసే విషయంలో నిర్ణయం వెల్లడి కష్టం. కానీ లబ్ధి పొందని వారు , పోలీసుల వేధింపులకు గురైనవారు మాత్రం తప్పక ద్వేషంతో తెరాస ప్రత్యర్థులకు ఓటు తప్పక వేస్తారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతలు పునఃసమీక్షించుకోవాలి. లేదంటే జరిగిన తప్పులను జరిగాయని చెపితే తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నవారే.

ఇది తగ్గిస్తేనే..: చంద్రబాబు నాయుడుని తప్ప తెలంగాణ ఇతర నాయకుల విషయాలు తెరాస నాయకులు మాట్లాడకపోవడం కూడా ప్రాతికూలం. దునికి తోడుగా ఉత్తమ్‌ కుమార్‌ 5వేల కోట్ల భూ కుంభకోణం గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడగానే సంగతి చూస్తానని చెప్పారు. ‘నిరంకుశం’ గురించి కాంగ్రెస్‌ చెప్పే వార్తలు ప్రజలు నిజమనే అభిప్రాయం వచ్చింది.

ప్రచారంలో…కసిలేని కాంగ్రెస్‌ : అన్నీ ఉన్నాయి. అనుకూల వాతావరణం. కూటమిలోని నాయకులంతా కలిశారు. వేదికపైన 119 అభ్యర్థులను తీసుకురావడంలో ఉత్తముడి క షి ఉంది. కొలువుదీరిన వివిధ వర్గాల ముఖ్యనేతలు మేడ్చల్‌ సభావేదిక కొత్త దశ్యాలను ఆవిష్కరించింది. అరుదైన కలయికలకు వేదికగా మారింది. మొట్టమొదటి సారిగా ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క ష్ణమాదిగ, బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కష్ణయ్య, ప్రజాగాయకుడు గద్దర్‌ ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. సభలో కాంగ్రెస్‌ జెండాలతో పాటు తెలుగుదేశం పసుపు జెండాలు, సీపీఐ ఎర్రజెండాలు, తెజస జెండాలు రెపరెపలాడాయి. వేదికపై ఆసీనులైన నేతలు కూడా వారి వారి పార్టీల కండువాలు ధరించి వచ్చారు.

కాంగ్రెస్‌లో కదనోత్సాహం:

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చారు. ప్రజాకూటమి తరఫున ఏర్పాటుచేసిన తొలి భారీ బహిరంగసభను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఆమె తనయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాకూటమిలోని నాలుగు పార్టీల నేతలు రాష్ట్ర సర్కారు గురించి మాట్లాడారు.మేడ్చల్‌ వేదికగా సోనియా సభను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభకు హాజరైన జనంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మొత్తం మీద సభ విజయవంతం కావడం ప్రజాకూటమిలో జోష్‌ నింపింది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని రాజేసింది.

స్నేహపూర్వక పోటీ..? : అందరూ కలిసినట్టు చెప్పడం కాదు. అలా ప్రవర్తించాలి. స్నేహపూర్వక పోటీలో బరిలో ఉన్న వారి గురించి తెరాస ప్రశ్నిస్తే.. కూటమి ఎవరి ముఖం నుంచి జవాబిస్తుంది.

మాటల తూటాలు ఎక్కడ: రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఎవ్ళరూ ఆ వేదికపై ఘాటుగా మాట్లాడలేకపోయారు. వీరందరిలోనూ గెలుపు ఓటముల దోబుచులాట కనిపిస్తోంది. ప్రత్యర్థులు గత నాలుగున్న సంవత్సరాల అవినీతి, అక్రమాలను ప్రశ్నించలేకపోయారు. అలాగే అనుకూలంగా ఉన్న మీడియాను సైతం కాపాడుకునే ప్రయత్నం. చేయలేకపోవడం వీరి బలహీనత. మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను వేదికపైన ప్రస్థావించే అవకాశం లేకుండా పోయింది. సరిగ్గా పది రోజుల సమయం ఉంది. గెలిచే గుర్రాలను ఎక్కితే సరిపోదు. గెలిచే విధంగా పరుగెత్తించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here