Featuredస్టేట్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో రెండు చట్టాలు..!

? అధికార పార్టీకి ఒకటి

? అనధికారులకు రెండోది

? పేదోడికి దక్కని చట్ట హక్కులు

? బెస్ట్‌ పోలీసింగ్‌ ముసుగులో ‘ఖాకీ’

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

భారతదేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజ్యాంగ హక్కులు ఒకో సందర్భంలో ఒకో విధంగా ఉంటున్నాయ్‌. సంఘటనలు ఒకే విధంగా ఉన్నా… అమలు తీరు మాత్రం ఒక్కో విధంగా ఉంటోంది. అందుకే అధికారులపై విమర్శలు. పోలీసుశాఖ ఎవరికి సేవలు చేయాలి..? ఎవరికి చేస్తుంది..? ఇది కొందరు ఉద్యోగులకు నచ్చకున్నా… గొంతులో బాధను దింగమింగుకొని… నిశ్చేష్టులుగా నిలబడే పరిస్థితి. ఈ దేశంలో రెండు విధాలుగా వ్యవహరిస్తున్న ఖాకీల తీరుపట్ల ప్రజల్లో అంతర్గతంగా ఉన్న ఆవేశం రోడ్డు ఎక్కితే అవాంఛనీయ దృశ్యాలు ఆవిష్కారం. అధికారంలో ఉన్న అవినీతి పరులకు ‘వంత’ పాడటం ఏ రకం ప్రజాస్వామ్యం. తినేది ప్రజా పన్నుల సొత్తు. ఊడిగం చేసేది ఎవరికి..? అంతరాత్మ చంపుకొని ఇంకా ఎన్నాళ్ళు కొలువులు చేస్తారు..? చట్టాల అమలులో ద్వంద్వ వైఖరిపై…అందుకు తగ్గ సాక్ష్యాధారాలను ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సంపాదించింది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు.. అధికార పార్టీలకు చొక్కాలుగా.. కాదు. టిప్‌ టాప్‌ సూట్‌ గా మారి ‘సెల్యూట్‌’ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, డీజీపీ, అసెంబ్లీ, పత్రికలు అందరూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. మరి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతోంది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న విశ్లేషణ కథనం.

ఇదే ఆందరికీ వర్తింప చేయాలిగా..:

పరుశమైన పదజాలంతో ఎవరు దూషించినా కోర్టు అనుమతితో సంబంధం లేకుండానే కేసు పెట్టి అరెస్టు చేసే వెసులుబాటును తెలంగాణ సర్కారు చట్ట సవరణ ద్వారా తీసుకుంది. ఇకపై ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, వ్యక్తులు కానీ పరుషమైన భాషలో తిట్లు, ధూషణలు చేస్తే వారిపై వెంటనే కేసు నమోదు చేయడమే కాదు కోర్టు అనుమతి అవసరం లేకుండానే అరెస్టు చేసి బొక్కలో వేయవచ్చు. ఇందుకోసమే సెక్షన్‌ 506, 507లను కోర్టు అనుమతి నుంచి మినహాయిస్తూ చట్ట సవరణ చేశారు. ఆ చట్ట సవరణ ఫైలు విూద ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంతకం కూడా చేసేశారు. దీనిపై పెద్ద రాద్దాంతం జరిగింది.

హిందువులను బొందుగాళ్లన్న కేసీఆర్‌ సంగతేంటి?:

సీఎం కేసీఆర్‌ ను ఉద్దేశించి తిట్టేసిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హిందువులను బొందుగాళ్లన్న కేసీఆర్‌ సంగతేంటి…? చట్టం ఎవరికి చుట్టంలా వ్యవహరిస్తోంది. ఒకేలా ఎందుకు వ్యవహరించడం లేదు. అంటే ఒకే విధమైన భావ వ్యక్తీకరణలో రెండు కోణాలు.

తిట్ల దండకం ఎవరు నేర్పారు..:

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నోటికి అడ్డూ అదుపు లేకుండా దొరికించుకొని మరీ తిట్లు తిట్టింది. ఉద్యమ నేత, సిఎం కేసిఆర్‌ నాటి నుంచి నేటి వరకు ఏనాడూ తిట్లు ఆగిన దాఖలాలు లేవు. తుదకు సహచర ఉద్యమ నేత కోదండరాం ను సైతం గౌరవమైన ప్రొఫెసర్‌ అనే విషయాన్ని పక్కనపెట్టి ‘వాడు, వీడు, లంగా’ అంటూ ధూషించిన దాఖలాలున్నాయి. ‘చవటలు, సన్నాసులు, దద్దమ్మలు, చెంచాలు, లుచ్చాలు, లత్కోర్లు, లఫంగాలు, పోరంబోకులు, ఫాల్తుగాళ్లు’ ఇలాంటి పదాలను రాజకీయాలకు పరిచయం చేసిందే టిఆర్‌ఎస్‌ వాళ్లు అన్న విమర్శ ఉంది. ఈ తిట్ల దండకాలకు కేసులేమైనా పెట్టారా…? అంటే సమాధానం ‘నిల్‌’. అదే ఏ పౌరుడు అయినా అసహనంతో ఇవే తిడితే కేసులు ‘ఫుల్‌’. మన గర్వించదగ్గ పోలీసింగ్‌ ఇదేనా..? ధన్యోస్మి.

కక్ష సాధిపులేనా..?

మరి ఈ పరిస్థితుల్లో ఈ చట్ట సవరణ ఏరకంగా ప్రజలకు మేలు చేకూరుస్తుందన్నది ఆశ్యర్యంగా ఉంది. కేవలం కొందరిపై కక్ష సాధింపు కోసమేనా అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి.

కేసీఆర్‌ గారి ఇంట ఆయన బుజ్జి కుక్క చనిపోతే కేసు..

ఇంటర్‌ విద్యార్థులు చనిపోతే నో కేస్‌…

సిఎంను తిడితే కేసులు పెట్టే పోలీసులు.. అదే ఇతరులు చేస్తే.. పరువునష్టం కేసులు వేయమని చెప్పటం ఎంత వరకు సబబు. స్వయంగా తెలంగాణ డిజిపికి ఇటీవల ఓ సంఘం నేతలు కలసి కొందరి తిట్ల పురాణం గురించి రెండు విధాలుగా ఫిర్యాదు చేశారు. ఇవి బుట్టదాఖలు అయినట్లు తెలుస్తోంది. ఔరా..! తెలంగాణ పోలీస్‌.. శభాష్‌…

ఆంధ్రప్రదేశ్‌ లో.అడ్డంగా…:

ఓ పత్రిక సంపాదకుడిని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కొడితే పట్టించుకోకపోగా ఎదురు ఆ సంపాదకుడిపైనే కేసు పెట్టారు. పోలీసు అధికారుల సంఘ నేతనంటూ ఒకాయన విూసాలు తిప్పి తొడలు చరిచాడు. తమ ¬ం గార్డును పచ్చి బూతులు తిడితే నోరు మెదపలేదు. చెప్పిన రెండు నిమషాల్లో కేసు నమోదు చేయలేదని నెల్లూరు జిల్లాలో ఒక సీఐని వీఆర్కు పంపారు. దీనిపై ఆ సంఘ నాయకులు నోరెత్తలేదు. విశాఖలో ఏకంగా జర్నలిస్టుల సంఘ సమావేశంలోనే వైసీపీ నేతలు మాట్లాడుతూ తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల సంగతి చూస్తామని.. యూనియన్లు వారి రక్షణకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేసులు పెడతామని అక్కడ డీజీపీ అంటున్నారు.

ముగింపు:

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విపరీత ధోరణులు ఆగక పోతే మరో కోణంలో విముక్తి పోరాటాలు జరుగుతాయని చరిత్ర చెపుతోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close