Featuredస్టేట్ న్యూస్

టివి9 డీల్‌ … 294 కోట్లు ఎక్కడ..?

రవిప్రకాష్‌ ఉచ్చు వెనుక

? ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి..?

? స్థానిక పోలీసులు ఛేదించగలరా .?

(ఖాకీ రంగు మారుతోందా..ఆదాబ్‌ హైదరాబాద్‌ విశ్లేషణ-4)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ప్రస్థుతం అన్నివర్గాలల్లో టీవీ9 భవితవ్యంపై చర్చ. లోగో నుంచి షేర్ల బదిలీల గురించి అనేక వార్తలు. వాటి వెనుక ఆర్థిక, రాజకీయ ఉద్దేశ్యాలు వేరు. పైకి మాత్రం రవిప్రకాష్‌ అరెస్ట్‌ గురించి మాత్రమే తెలంగాణ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన ‘ఓటుకు నోటు’ కేసు నుంచి పలు కేసుల గురించి మొదట చేసిన హడావుడి తర్వాత కన్పించడం లేదు. అసలు ఈకేసు డీల్‌ మొత్తం చేధించే సామర్థ్యం, స్థాయి ఇప్పుడు విచారణ చేస్తున్న విచారణ అధికారులు చేయగలరా…? ఇందులో ఇమిడి ఉన్న ఆర్థిక కోణాలను పరిశీలించి, పరిశోధించి అంతర్జాతీయ స్థాయి పోలీసుల సహకారం తీసుకోకుండా ముందుకు సాగే ధైర్యం ఈ కేసులు నమోదు చేసిన వారికి ఉందా…? వంటి అనేక చిక్కు ప్రశ్నల పరంపరే నేటి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రత్యేక కథనం.

ఎంతకు అమ్మకం:

టీవీ9 అంచెలంచెలుగా ఎ’దిగిన’ సంస్థ. ఎలక్ట్రానిక్‌ విూడియాలో ఓ ప్రభంజనం. ఇది మొదటి పెట్టుబడితో హఠాత్తుగా రాలేదు. దాని వెనుక రవిప్రకాష్‌ కష్టం ఉంది. బ్రాండ్‌ విలువ కాలక్రమేణా సుమారు ఐదు వందల కోట్లకు చేరుకుంది.ప్రధానంగా టీవీ9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద విూడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీలు జరిగాయి.”ఆగస్టు, 2018 నాటికి చింతలపాటి ¬ల్డింగ్స్‌, ఐల్యాబ్స్‌, క్లిపోర్డ్‌ ఫెరీరా, ఎంవీకేఎన్‌ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబిసిఎల్‌ లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద విూడియా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ అనధికార విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్‌ పర్చేజ్‌ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. 294 కోట్ల.లావాదేవీలలో కొనుగోలు చేసిన వారి దగ్గర టీవీ9 ఉంది. మరి అమ్మకం జరిపిన వారు… అంత పెద్ద మొత్తం ఎక్కడ ఉంది. బ్యాంకుల్లో ఉందా..? లేక మరొకరి ఖాతోలోకి మళ్ళిందా..? అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఒప్పంద సంగతి రాష్ట్ర పోలీసులు తేల్చ గలరా..? రవిప్రకాష్‌ ను గంటలకొద్ది విచారణ చేసిన పోలీసులు భవిష్యత్తులో రవిప్రకాష్‌ సంధించే తొలి ప్రశ్న ఇదే. కేసులో ఈ రూ.294 కోట్ల చుట్టూ చట్రం తిరుగుతుంది. కీలకమైన ఈ డబ్బు మార్పిడి వ్యవహారం గురించి పోలీసులు లోతుగా విచారణ జరపాలి. కానీ ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. అంత డబ్బు అమ్మకం దార్లు తిరిగి ఎక్కడ పెట్టుబడి పెట్టారనే విషయం స్థానిక విచారణ అధికారులు తేల్చగలరా..? అనేది బేతాళ ప్రశ్న.

లోగో రవిప్రకాష్‌ దే..:

రవిప్రకాష్‌ తొలి నాళ్ళల్లో వేసిన అధ్భుతమైన ఎత్తుగడ నేడు ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. ఇది కొద్దిగా ఆలస్యం అయినా అది రవిప్రకాష్‌ కే చెందుతుందని న్యాయనిపుణుల అభిప్రాయం.

ఇప్పుడున్న టివి9 లోగోను కానీ మొత్తానికి పేరునే కానీ మార్చుకోవాల్సిన పరిస్థితి కొత్త యాజమాన్యానికి వస్తుందా? టివి9 వ్యవహారంలో మాజీ సీఈవో రవిప్రకాష్‌ పెట్టిన మెలికలు అంత త్వరగా విడిపోయే పరిస్థితిలేనట్లుగా కనిపిస్తున్నది. అందుకే ప్రస్తుతం ఈ అనుమానం తలెత్తుతున్నది. ఈ సందర్భంగా రవిప్రకాష్‌ లాయర్లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ కేసులో తెలంగాణ పోలీసులు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు. షేర్ల బదలాయింపు నుంచి పలు అంశాలపై రవిప్రకాష్‌ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటరాగేషన్లో తప్పించుకుంటున్నారు. అదే సమయంలో తాను చెప్పాల్సినదంతా కోర్టులో న్యాయవాదులతో చెప్పిస్తున్నారు. లోగో అధికారికంగా తనదని తేలిన తర్వాత రవిప్రకాష్‌ కొత్త యాజమాన్యం నుంచి భారీ మోత్తం న్యాయబద్దంగా ఆశిస్తారు.

ఏం చేయగలరు..?:

అందుకే ఈ అంశంలో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత కూడా రవిప్రకాష్‌ తమకు సహకరించడం లేదనే పోలీసులు చెబుతున్నారు. ‘పోలీసులకు కావాల్సింది మా క్లయింటు చెప్పేంత వరకూ వేధిస్తూనే ఉంటారా’ అని రవిప్రకాష్‌ లాయర్లు ప్రశ్నిస్తున్నారు. రవిప్రకాష్‌ పై పెట్టిన కేసులు కొలిక్కి రావాలంటే రవిప్రకాష్‌ నోరు విప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే అత్యంత చాకచక్యంగా పోలీసు ప్రశ్నల నుంచి తప్పించుకుంటూ కేసును మరిన్ని కోణాలకు తిప్పే విధంగా రవిప్రకాష్‌ పావులు కదపుతున్నారు. అదిప్పుడు తనకు అవసరం కూడా.

లోగో పోతే డవ్మిూనే..:

లోగో మారిస్తే టివీ9 విలువ నాసిరకం ఛానళ్ళ స్థాయికి ఒక్కసారిగా పడిపోతుంది. అందుకే ఇంత రాద్దాంతం జరిగిన తరువాత కొత్త వాటాదార్లకు టీవీ9 లోగో ఎట్టి పరిస్థితుల్లో రవిప్రకాష్‌ ఇవ్వడానికి ఒప్పుకోరు. 2013 కంపెనీల చట్టంలోని 180 సెక్షన్‌ పై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి పోలీసుల మెడకు చుట్టుకుంది. ఆ సెక్షన్‌ ప్రయివేటు కంపెనీలకు వర్తించదని రవిప్రకాష్‌ తరపు లాయర్లు వాదించడంతో దానితో లింకు అయి ఉన్న టివి9 లోగో విషయం ఎలాంటి మలుపుతిరుగుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.

ఈ మెలికే కీలకం:

టీవీ9 లోగో కేసులో అలందా కంపెనీ తరుపున రాసిన ఫిర్యాదులో కంపెనీ చట్టం సెక్షన్‌ 180 ప్రకారం షేర్‌ ¬ల్డర్స్‌ అనుమతి ఉండాలని తెలంగాణ లాయర్‌ చెప్పగా, సెక్షన్‌ 180 టీవీ9 లాంటి ప్రైవేటు కంపనీలకు వర్తించదని రవిప్రకాష్‌ తరుపు లాయర్‌ వాదించారు. జస్టిస్‌ శ్రీదేవి వివరణ ఇమ్మని అడగగానే అప్పటి వరకు పదిమందికి పైగా కోర్టులో కూర్చున్న అలందా లాయర్లు బైటికి వెళ్ళిపోయారు. మే నెల పదో తారీఖున టీవీ9 ను అక్రమంగా ఆక్రమించుకుని కేసులోని కీలకమైన డాకుమెంట్స్‌ అన్నీ అలందా డైరెక్టర్‌ జూపల్లి జగపతి రావు కైవసం చేసుకున్నారని, ఆ ఆక్రమణకు వందమంది పోలీసులు సాయపడ్డారని దిల్‌ జిత్‌ చెప్పడంతో జూపల్లి వర్గం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తాత్కాలికంగా రవిప్రకాష్‌ ఇబ్బందులు పడ్డా…ఇదే భవిష్యత్తులో ఆయనకు అమృతం లాంటిది. న్యాయస్థానంలో రవిప్రకాష్‌ బెయిల్‌ పిటీషన్పై జరుగుతున్న కేసు పూర్తి అయితే తప్ప తెలంగాణ పోలీసులు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

ఃనీలీ:

రవిప్రకాష్‌ ఆస్థుల గురించి ఆరా…

రవిప్రకాష్‌ గురించి తెలంగాణా పోలీసులు బాగానే ఆరా తీస్తున్నారని తెలిసింది. ఇందులో బాగంగా ఆయన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆస్తులు ఆయనవేనా…? కావా..? అనే కోణంలో కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

  1. గండిపేట వద్ద మెలోయోహా అంతర్జాతీయ పాఠశాల
  2. మోజో టీవీ
  3. టొలీవిల్‌ వెబ్సైట్‌
  4. ఆర్‌ ఫ్యాక్టరీ – ఈవెంట్‌ నిర్వహణ సంస్థ
  5. నేను ఫ్రేమ్స్‌ – గ్రాఫిక్స్‌ స్టూడియో
  6. రియల్‌ ఎస్టేట్‌ – మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ పక్కన 10 ఎకరాల భూమి. ఇది ఒక సెటిల్మెంట్‌ స్ధలం.

ఉప్పల్‌ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ నేత జగ్గూరెడ్డి దీనిని నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనరసింహ కూడా ఇందులో ఒక భాగస్వామి అని కొందరు అంటున్నారు. వాణిజ్య సముదాయం కోసం ప్రణాళిక.

  1. శేర్లింగంపల్లి వద్ద హరీష్‌ వ్యవసాయ గృహం పక్కనే ఉన్న ఫామ్‌ హౌస్‌.
  2. పి. లో మాజీ హాత్వే రాజశేకర్తో ఫైబర్‌ ఆప్టిక్‌ వ్యాపారం (ఈ ప్రాజెక్ట్‌ వెనుక నారా లోకేష్‌, వేమూరి హరిప్రసాద్‌ ఉన్నట్లు తెలుస్తోంది.)
  3. దక్షిణ ఆఫ్రికాలో ఇంటర్నెట్‌ మరియు కేబుల్‌ టివి వ్యాపారం
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close